pizza
Kushi Blockbuster Celebrations at Vizag
ఖుషి వైజాగ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో హీరో విజయ్ దేవరకొండ
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 September 2023
Hyderabad

All my fans are Devara family. 100 families will be selected and given Rs 1lakh each - Hero Vijay Devarakonda at Vizag "Kushi" Block Buster Celebrations

Tollywood latest blockbuster movie Kushi starring Vijay Devarakonda and Samantha impressed everyone as a love and family entertainer. Kushi's Blockbuster Celebrations, which grossed Rs 70.23 crore in three days, was grandly held in Visakhapatnam. Hero Vijay Devarakonda, producer Naveen Yerneni, director Shiva Nirvana and other film crew participated in this event. On this occasion,

Sashidhar Reddy, distributor of Mythri, said - Kushi movie in Nizam area got 75% return of investment within three days. Kushi is the highest first 3 days collection in Vijay Devarakonda's career. These collections do not stop here. There will be a long run. Families and youth are all connected to Kushi.

Cinematographer G. Murali said - Hero Vijay and I have always wanted to work together. Now thag wish is done. I worked for Rajinikanth's Kabali. What kind of response was received while watching that movie in Hyderabad theater, same mass response was received from the audience while watching Vijay's movie. Thanks to the audience who made the movie a super hit.

Producer Naveen Yerneni said - Thanks to Vijay, Samantha and Shiva for giving a memorable movie like Kushi to our Production. This is a movie that feels like Mani Ratnam's Roja. Proud to have produced such a clean family entertainer. It is not normal that Kushi recovered 75 percent in the first three days. We think it will be the highest grosser in Vijay's career. From the morning of Kushi's release till now, US calls are coming continuously. They are saying that the movie is good. We will hold more success celebrations events in next two weeks.

Music director Hesham Abdul Wahab said - I thank the audience for making Kushi a blockbuster hit. They are enjoying the music in the movie. Thanks to director Shiva and Mythri for giving me such a great opportunity.

Director Shiva Nirvana said - I am a resident of Vizag. This is the first time that my film function is happening here. I have brought the rowdy hero to you. In Vizag dialect, I brought Vijay Mavaya to you. I went to Tollywood from Sabbavaram. A boy like me who went from Sabbavaram and now directs a film with Vijay means that the story is inspiring. Why is Kushi special in my movies? After watching Arjun Reddy's movie in Hyderabad, I couldn't get out of that hangover. Close-up shots of Vijay while listening to Arjun Reddy's song in the car. I strongly wanted to direct a film with Vijay in two or three years. Today I was able to make a good movie like Kushi. If I want, I can put fights and item songs in this movie. But I want to make a clean movie, a full purpose movie. We may have many differences of opinion in our family, but we are all one family. I told Kushi a good thing that even if our thoughts and beliefs are different, they should not be an obstacle to being together. Soon action movies like Pushpa 2 and Salaar will come and impress you. Among such action movies, Our Kusni is like a pleasant movie. Tomorrow is Teacher's Day, and day after tomorrow its Krishnashtami holiday. You can go with your family and see Kushi. Our collections in Vizag should be more than US and Nizam areas.

Hero Vijay Devarakonda said - I can see the love you are showing for Kushi. I feel that love even when I am at home. There are attacks on me and my film. They are doing fake BMS ratings and fake YouTube videos on our Kushi. Thousands of fake accounts are created and YouTube videos are circulated. Some are spending money for this. Beyond all that, we are getting these numbers and success because of the love of fans and audience. You are the reason for this success. We will talk about these conspiracies later. Seeing your love here today, I don't feel like talking about other things. If you are Kushi, I am full Kushi. I wanted to see happiness on your faces when the promotion of this movie started. Looking at that happiness today. I am very satisfied to see the happiness on your faces even after three days. Khushi is a simple, cute emotional love story. Shiva also said the same thing while making the film. Vijay Bro said that we will make a cute love story with a good point and make it a comfortable watch for families. Seeing the love you are giving to the movie today, we have a lot to do thanks to you. I used to think only that I should earn money, take good care of my parents and live with respect in the society. Seeing the popularity of Kushi today, I understand that you all are waiting to see me make a good film. You all want me to win and my films to succeed. They are sad if my movies flop, they are happy if my movie is a hit. I am saying from this platform. From now on I will work for you hundred percent along with my family. You should always smile. I want to share Kushi with you all. I want to see your smile. But not satisfied. But something has to be done. I cannot meet all of you personally. You are happy even I am happy. I am giving one crore rupees from my earnings and Kushi's earnings to you, my family, to share my happiness with you. In the next ten days I will select one hundred families and give a check of one lakh rupees to each family. I will share my earnings with you as well as my happiness. You all are Devara family. I will put a form on my social media with Spreading Kushi. I am happy that the money I give helps you with rents and fees. 100 families will be announced tomorrow. We will hold a big event in Hyderabad in the next ten days. Before that event, 100 families will be provided at the rate of 1 lakh each. Only then will I be satisfied.Thank you for the love you are showing.

ఖుషి వైజాగ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో హీరో విజయ్ దేవరకొండ

ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. నేను ఇంట్లో ఉన్నా ఆ ప్రేమను ఫీలవుతున్నా

నా మీద, నా సినిమా మీద అటాక్స్ జరుగుతున్నాయి. మా ఖుషి మీద ఫేక్ బీఎంఎస్ రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. వేలాది ఫేక్ అక్కౌంట్స్ క్రియేట్ చేసి, యూట్యూబ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందుకు కొందరు డబ్బులు ఖర్చు చేస్తున్నారు.

అవన్నీ దాటుకుని అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ నెంబర్స్, సక్సెస్ అందుకుంటున్నాం. మీరే ఈ విజయానికి కారణం.

మూడు రోజుల్నించి చూస్తున్నా మీ మొహల్లో సంతోషం చూసి నాకు చాలా తృప్తిగా ఉంది.

ఖుషి ఒక సింపుల్, క్యూట్ ఎమోషనల్ లవ్ స్టోరి. సినిమా చేసేప్పుడు శివ కూడా ఇదే మాట చెప్పాడు. విజయ్ బ్రో మనం ఒక క్యూట్ లవ్ స్టోరిని ఒక మంచి పాయింట్ చెబుతూ ఫ్యామిలీస్ హాయిగా చూసేలా చేద్దామని అనేవాడు.

ఇవాళ సినిమాకు మీరు అందిస్తున్న ప్రేమ చూస్తుంటే కృతజ్ఞతగా మీకు మేము చాలా చాలా చేయాలని అనిపిస్తోంది.

నేను డబ్బు సంపాదించాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి, సమాజంలో గౌరవంగా బతకాలి అనేది మాత్రమే ఆలోచించేవాడిని. ఇవాళ ఖుషికి మీరిస్తున్న ఆదరణ చూస్తుంటే నేనొక మంచి సినిమా చేస్తే చూసేందుకు మీరంతా ఎదురుచూస్తున్నారని అర్థమైంది.

నేను గెలవాలని, నా సినిమాలు విజయం సాధించాలని మీరంతా కోరుకుంటున్నారు. నా సినిమాలు ఫ్లాపైతే బాధపడుతున్నారు, నా సినిమా హిట్ అయితే సంతోషిస్తున్నారు.

ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా. ఇప్పటి నుంచి నేను నా ఫ్యామిలీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం కూడా పనిచేస్తా. మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి
ఖుషిని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. మీ నవ్వులు చూద్దామని అనుకున్నా చూస్తున్నా. కానీ తృప్తి లేదు. కానీ ఏదో చేయాలని ఉంది. పర్సనల్ గా మీ అందరినీ కలవలేను. మీరు ఖుషిగా ఉన్నారు నేను ఖుషిగా ఉన్నా.

మీతో నాకు ఖుషి పంచుకునేందుకు నా సంపాదన నుంచి, ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. త్వరలో వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తా.

నా హ్యాపీనెస్ లాగే నా సంపాదన కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరంతా దేవర ఫ్యామిలీ. నా సోషల్ మీడియాలో ఒక ఫామ్ పెడతా. స్ప్రెడింగ్ ఖుషి అని. నేనిచ్చే మనీ మీకు రెంట్స్, ఫీజు దేనికి హెల్ప్ అయినా నాకు సంతోషం.

నా అభిమానులంతా దేవర ఫ్యామిలీ. వంద మంది ఫ్యామిలీస్ సెలెక్ట్ చేసి లక్ష చొప్పున కోటి రూపాయలు అందిస్తా - వైజాగ్ "ఖుషి" బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో హీరో విజయ్ దేవరకొండ.

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకుంది. మూడు రోజుల్లో 70.23 కోట్ల రూపాయలు రాబట్టిన ఖుషి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకుడు శివ నిర్వాణ తదితర చిత్రబృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా

మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ - నైజాం ఏరియాలో ఖుషి సినిమాకు మూడు రోజుల్లోనే పెట్టుబడి 75శాతం తిరిగి వచ్చింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో హయ్యెస్ట్ ఫస్ట్ 3డేస్ కలెక్షన్ ఖుషిదే. ఈ కలెక్షన్స్ ఇక్కడితో ఆగవు. లాంగ్ రన్ ఉంటుంది. ఫ్యామిలీస్, యూత్ అందరూ ఖుషికి కనెక్ట్ అయ్యారు. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ జి.మురళి మాట్లాడుతూ - హీరో విజయ్, నేను కలిసి వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ సినిమాకు కుదిరింది. నేను రజనీకాంత్ కబాలీ సినిమాకు పనిచేశాను. ఆ సినిమాను హైదరాబాద్ థియేటర్ లో చూస్తున్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో విజయ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆడియెన్స్ నుంచి అలాంటి మాస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ - మా సంస్థకు ఖుషి లాంటి మెమొరబుల్ మూవీ ఇచ్చిన విజయ్, సమంత, శివ అందరికీ థ్యాంక్స్. మణిరత్నం రోజా లాంటి ఫీల్ ఇచ్చే సినిమా ఇది. ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను నిర్మించినందుకు గర్వంగా ఉంది. ఖుషికి ఫస్ట్ త్రీ డేస్ లోనే 75 పర్సెంట్ రికవరీ అయ్యిందంటే మామూలు విషయం కాదు. విజయ్ కెరీర్ లో ఇది హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుందని అనుకుంటున్నాం. ఖుషి రిలీజైన ఉదయం నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా యూఎస్ కాల్స్ వస్తున్నాయి. సినిమా బాగుందని అక్కడి వారు చెబుతున్నారు.ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ మరో రెండు వారాల్లో మరిన్ని జరిపిస్తాం. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మాట్లాడుతూ - ఖుషిని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నాను. సినిమాలో మ్యూజిక్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఇంతమంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శివ, మైత్రీ సంస్థకు కృతజ్ఞతలు. అన్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ - నేను వైజాగ్ వాసినే. ఇక్కడ నా సినిమా ఫంక్షన్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. రౌడీ హీరోను మీ దగ్గరకు తీసుకొచ్చాను. వైజాగ్ యాసలో చెప్పాలంటే విజయ్ మాయ్యను మీ దగ్గరకు తీసుకొచ్చా. నేను సబ్బవరం నుంచి టాలీవుడ్ వెళ్లాను. నాలాంటి ఒక కుర్రాడు సబ్బవరం నుంచి వెళ్లి ఇప్పుడు విజయ్ తో సినిమా డైరెక్ట్ చేశాడంటే ఆ స్టోరి ఇన్ స్పైరింగ్ గా ఉంటుంది. నా సినిమాల్లో ఖుషి ఎందుకు స్పెషల్ అంటే..హైదరాబాద్ లో అర్జున్ రెడ్డి సినిమా చూశాక ఆ హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేకపోయాను. కారులో అర్జున్ రెడ్డి పాట వింటుంటే విజయ్ క్లోజప్ షాట్స్ గుర్తొచ్చాయి. రెండు మూడేళ్లలో విజయ్ తో సినిమా డైరెక్ట్ చేయాలని గట్టిగా అనుకున్నాను. ఇవాళ ఖుషి లాంటి మంచి సినిమాను రూపొందించగలిగాను. నేను కావాలంటే ఈ సినిమాలో ఫైట్స్, ఐటెంసాంగ్స్ పెట్టొచ్చు. కానీ ఓ క్లీన్ మూవీ, పర్పస్ ఫుల్ మూవీ చేయాలనుకున్నా. మన కుటుంబంలో మనకెన్ని అభిప్రాయ బేధాలైనా ఉండొచ్చు..కానీ మనమంతా ఒక కుటుంబం. మన ఆలోచనలు, నమ్మకాలు వేరైనా..కలిసి ఉండేందుకు అవి అడ్డు కాకూడదు అనే మంచి విషయాన్ని ఖుషిలో చెప్పాను. త్వరలో పుష్ప 2, సలార్ వంటి యాక్షన్ మూవీస్ వచ్చి మిమ్మల్ని ఆకట్టుకోవచ్చు. అలాంటి యాక్షన్ మూవీస్ మధ్య మన ఖుషి ఆహ్లాదకరమైన ఒక చిరుజల్లు లాంటిది. రేపు టీచర్స్ డే, ఎల్లుండి కృష్ణాష్టమి హాలీడే. మీరు మీ ఫ్యామిలీతో వెళ్లి ఖుషి చూడండి. యూఎస్, నైజాం ఏరియాల కంటే మన వైజాగ్ లో కలెక్షన్స్ అదిరిపోవాలి. అని అన్నారు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. నేను ఇంట్లో ఉన్నా ఆ ప్రేమను ఫీలవుతున్నా. నా మీద, నా సినిమా మీద అటాక్స్ జరుగుతున్నాయి. మా ఖుషి మీద ఫేక్ బీఎంఎస్ రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. వేలాది ఫేక్ అక్కౌంట్స్ క్రియేట్ చేసి, యూట్యూబ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందుకు కొందరు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అవన్నీ దాటుకుని అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ నెంబర్స్, సక్సెస్ అందుకుంటున్నాం. మీరే ఈ విజయానికి కారణం. ఈ కుట్రల గురించి తర్వాత మాట్లాడతా. ఇవాళ ఇక్కడ మీ ప్రేమ చూస్తుంటే మిగతా విషయాలు మాట్లాడాలని అనిపించడం లేదు. మీరు ఖుషి అయితే నేను ఫుల్ ఖుషీ. ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు మీ మొహల్లో సంతోషం చూడాలని అనుకున్నా. ఇవాళ ఆ హ్యాపీనెస్ చూస్తున్నా. మూడు రోజుల్నించి చూస్తున్నా మీ మొహల్లో సంతోషం చూసి నాకు చాలా తృప్తిగా ఉంది. ఖుషి ఒక సింపుల్, క్యూట్ ఎమోషనల్ లవ్ స్టోరి. సినిమా చేసేప్పుడు శివ కూడా ఇదే మాట చెప్పాడు. విజయ్ బ్రో మనం ఒక క్యూట్ లవ్ స్టోరిని ఒక మంచి పాయింట్ చెబుతూ ఫ్యామిలీస్ హాయిగా చూసేలా చేద్దామని అనేవాడు. ఇవాళ సినిమాకు మీరు అందిస్తున్న ప్రేమ చూస్తుంటే కృతజ్ఞతగా మీకు మేము చాలా చాలా చేయాలని అనిపిస్తోంది. నేను డబ్బు సంపాదించాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి, సమాజంలో గౌరవంగా బతకాలి అనేది మాత్రమే ఆలోచించేవాడిని. ఇవాళ ఖుషికి మీరిస్తున్న ఆదరణ చూస్తుంటే నేనొక మంచి సినిమా చేస్తే చూసేందుకు మీరంతా ఎదురుచూస్తున్నారని అర్థమైంది. నేను గెలవాలని, నా సినిమాలు విజయం సాధించాలని మీరంతా కోరుకుంటున్నారు. నా సినిమాలు ఫ్లాపైతే బాధపడుతున్నారు, నా సినిమా హిట్ అయితే సంతోషిస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా. ఇప్పటి నుంచి నేను నా ఫ్యామిలీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం కూడా పనిచేస్తా. మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఖుషిని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. మీ నవ్వులు చూద్దామని అనుకున్నా చూస్తున్నా. కానీ తృప్తి లేదు. కానీ ఏదో చేయాలని ఉంది. పర్సనల్ గా మీ అందరినీ కలవలేను. మీరు ఖుషిగా ఉన్నారు నేను ఖుషిగా ఉన్నా. మీతో నా ఖుషి పంచుకునేందుకు నా సంపాదన నుంచి, ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. మరో పది రోజుల్లో వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తా. నా హ్యాపీనెస్ లాగే నా సంపాదన కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరంతా దేవర ఫ్యామిలీ. నా సోషల్ మీడియాలో ఒక ఫామ్ పెడతా. స్ప్రెడింగ్ ఖుషి అని. నేనిచ్చే మనీ మీకు రెంట్స్, ఫీజు దేనికి హెల్ప్ అయినా నాకు సంతోషం. రేపే అనౌన్స్ చేసి వందమంది ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేస్తా. నెక్ట్ పదిరోజుల్లో హైదరాబాద్ లో పెద్ద ఈవెంట్ చేస్తాం. ఆ ఈవెంట్ కు ముందే వందమంది ఫ్యామిలీస్ కు లక్ష చొప్పున అందిస్తా. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. మీరు అరిస్తే నాకు ఖుషి, మీరు కనబడితే నాకు ఖుషి, నాకు ఫుల్ ఖుషి మీ నవ్వులు చూస్తే..మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్యూ. అన్నారు.

 


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved