అనాధ పిల్లలు కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ లాంటి పండగలను సెలెబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వారి కోసం రేడియో మిర్చి తలపెట్టిన ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం లో ఆర్.జె.సమీర్ తనకు తాను జైలు లాంటి సెట్ లో బంధించుకున్నాడు. ఆ అనాధ పిల్లలకు కావాల్సిన ఫండ్ వచ్చే వరకు తాను ఈ జైలులోనే ఉంటానన్నాడు. శనివారం కూకట్ పల్లిలోని మంజీరా మాల్ లో జరిగిన ఈ ప్రోగ్రాంలో ''భలే మంచి రోజు'' హీరో సుధీర్ బాబు, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నటుడు జబర్దస్త్ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''ఇలాంటి ఓ మంచి కార్యక్రమలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది . ప్రతి ఒక్కరు తమ ఒంతు సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకోవాలని'' పిలుపునిచ్చాడు.
ఈ కార్యక్రమంలో రేడియో మిర్చి ఆర్.జె హేమంత్, ప్రోగ్రామింగ్ హెడ్ సాయి పాల్గొన్నారు.