సూపర్‌స్టార్ మహేష్ హీరోగా పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకాలపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్ లవ్ స్టోరీ 'బ్రహ్మోత్సవం'.ఈ సినిమా మే 20న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కాజల్ అగర్వాల్, సమంతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ‘’దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. చాలా మంది నటీనటులున్న యాక్ట్ చేసిన చిత్రం బ్రహ్మోత్సవం. ఇలాంటి సినిమాను డైరెక్ట్ చేయడమంటే అంత సులువు కాదు. ఈ చిత్రంలో ఎన్నారై అమ్మాయి పాత్రలో కనపడతాను. నా పాత్ర పేరు కాశీ. ఇండిపెండెంట్ అమ్మాయి. ఎన్నారై హీరోయిన్ అంటే ఏదో రెబల్ పాత్రలా కాకుండా సింపుల్ గా ఉండే అమ్మాయిలా కనపడతాను. నా క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశారు. నేను, సమంత ఇద్దరం మా పాత్రల గురించి హ్యపీగా ఉంది. ఇద్దరి పాత్రలను చూస్తే దేని ప్రాముఖ్యత దానికుంది. ఇప్పటి వరకు బబ్లీ, హైపర్ అమ్మాయి పాత్రలో కనపడితే, ఈ చిత్రంలో పరిణితి గల అమ్మాయిగా కనపడతాను. పివిపిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా చిత్రాన్ని నిర్మించారు. మహేష్ తో బిజినెస్ మేన్ తర్వాత చేస్తున్న సినిమా. తను బ్రహ్మోత్సవం సినిమా ఇంకా యంగ్ గా కనపడతారు. మహేష్ స్పాంటేనియస్, మెథాడికల్ యాక్టర్. మంచి లవ్ స్టోరీ. మరి ఎలాంటి లవ్ స్టోరీయో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు.
సమంత మాట్లాడుతూ‘’ బ్రహ్మోత్సవం పేరు తగినట్లే ఉత్సవం లాంటి సినిమా. ఇందులో కుటుంబ బంధాలు అప్యాయతలు, అనుబంధాలుంటాయి. నాకు, మహేష్ బాబు, వెన్నెలకిషోర్ మధ్య ట్రావెలింగ్ సన్నివేశాలుంటాయి. హరిద్వార్, ఉదయ్ పూర్, పూణే వంటి ప్రదేశాలు తిరగడం మంచి అనుభవాన్నిచ్చింది. శ్రీకాంత్ అడ్డాలగారి మార్క్ ఫీల్ గుడ్ మూవీ. దూకుడు కంటే సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఈ రెండింటి కంటే బ్రహ్మోత్సవం సినిమా బాగా నచ్చింది. మహేష్ బాబుగారు ఈ సినిమాలో చాలా యంగ్ గా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన 15 ఏళ్ల స్కూల్ పిల్లాడిలా కనిపించారు. అలాగే సీనియర్ నటీనటులైన సత్యరాజ్ గారు, రేవతి, జయసుధగారితో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది’’ అన్నారు.