20 November 2014
Hyderabad
అనేక అంతర్జాతీయ అవార్డులతో పాటు మూడు జాతీయ అవార్డులను దక్కించుకున్న చిత్రం నా బంగారు తల్లి ప్రజ్వల సమర్పణలో సన్ టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సునీత కృష్ణన్, ఎం.ఎస్.రాజేష్ నిర్మాతలుగా రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం నా బంగారు తల్లి ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ నెల19న సెలబ్రిటీస్ షో ను ఏర్పాటు చేశారు. ఈ షో లో సమంత, రెజీనా, గాయని సునీత, సన, చిత్రయూనిట్ సహా పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత వారి స్పందనలు...
ఈ సినిమాలో కొత్తగా ఏమీ చూపించలేదు. సోసైటీలో జరుగుతున్నదే చూపించారు. మనం సినిమాలు చూస్తాం. పేపర్లో చదువుతాం. కానీ వదిలేస్తాం. కానీ సునీతకృష్ణన్ గారు మాత్రమే అటువంటి మహిళల కోసం పోరాటం చేస్తున్నారు. ఆమెతో 2002 నుండి పరిచయం. మనం చేసే పని కరెక్టా కాదా, దాని వల్ల సోసైటీ ఏం జరగబోతుంది అనే విషయాన్ని రాజేష్ గారు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సునీత కృష్ణన్ వటి ఫ్రెండ్ నాకుందని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను. సునీతకృష్ణన్ వంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. ఆమెకి మన సపోర్ట్ ఎంతో అవసరం. సినిమాని అందరూ తప్పకుండా చూడండి. - సునీత, గాయని
సమంత, హీరోయిన్ - ఈ సంవత్సరం చూడాల్సిన చిత్రం నా బంగారు తల్లి. దయచేసి ప్రతి కుటుంబంలోని వ్యక్తులు చూడాల్సిన చిత్రం. ఇది అందరూ చూడాల్సిన సినిమా. ఇంత కష్టపడి క్రౌడ్ ఫండింగ్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ టీమ్ ని అభినందిస్తున్నాను. నా కెరీర్ లో ఇటువంటి సినిమా చేయలేదు. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. సునీత కృష్ణన్ గారంటే నాకెతో అభిమానం. ఈ సినిమాతో అది రెట్టింపైయింది. ఈ సినిమా నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
రెజీనా, హీరోయిన్ - నా బంగారు తల్లి హార్ట్ టచింగ్ మూవీ. నిజమైన కథ. ఈనాటి సమాజంలో ఇలాంటి ఘటనలు జరగుతున్నాయా అని షాకింగ్ గా ఉంది. మనం గర్వపడకూడదు. సిగ్గుపడాల్సిన విషయాలు. ఇలాంటి ఒక ఒక విషయాన్ని సినిమా తెరకెక్కించిన టీమ్ ని అభినందిస్తున్నాను. అమేజింగ్ సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సినిమాకి ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. మరిన్ని అవార్డులు కూడా వస్తాయి. అయితే మనం అందరం ఈ సినిమా చూసి అవేర్ నెస్ తెచ్చుకున్నరోజు ఈ టీమ్ కి పెద్ద అవార్డ్ వచ్చినట్టు. ప్రతి ఒకరు చూడాల్సిన సినిమా ఇది.
సనా, నటి - ఈ సినిమా చూసిన ప్రతి ఒకరు ఓ ఫీల్ లో ఉండిపోతారు. నిజంగా జరిగిన సినిమా. హర్ట్ టచింగ్ సినిమా. ఏ పదం వాడినా తక్కువే. దయచేసి ప్రతి ఒకరు చూడాల్సిన సినిమా. ఇందులో మెసేజ్ అనే కాదు. చాలా విషయాలు తెలుస్తాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి.