30 August 2024
Hyderabad
Wall Poster Cinema has gained recognition for producing content-driven films that are both commercially successful and critically acclaimed. Most of the films under this banner have not only achieved commercial success but also garnered critical praise. Nani backs the projects from the banner as a presenter. Today, they announced a new film starring Priyadarshi in the lead role, with Ram Jagadeesh making his directorial debut. Produced by Prashanti Tipirneni, the film has an intriguing title: COURT – State vs A Nobody.
The title poster shows Lady Justice standing in the witness box, her blindfolded gaze resolute as she grips a sword. Pigeons, symbols of peace, soar around her, creating a stark contrast to the tense atmosphere. The poster effectively captures the film’s themes of justice and conflict.
This story revolves around a legal fight for a boy who is unjustly implicated in a case. In this, Priyadarshi will be seen in the character of a lawyer.
The movie was launched grandly today with a pooja ceremony. For the muhurtham shot on Priyadarshi, Nani sounded the clapboard, while producer Prashanti switched on the camera. The first shot was directed by Gemini Kiran. The regular shoot commences in September.
Sivaji, Sai Kumar, Rohini, Harshavardhan, Harsh Roshan, and Sri Devi are the other prominent cast of the movie that will have a team of talented technicians associated with it. Dinesh Purushothaman will handle the cinematography, while Vijai Bulganin will score the music. Vithal Kosanam is the art director.
Along with director Ram Jagadeesh, the screenplay was written by Karthikeya Sreenivass and Vamsidhar Sirigiri.
Cast: Priyadarshi, Sivaji, Sai Kumar, Rohini, Harshavardhan, Harsh Roshan, and Sri Devi
Technical Crew:
Presents: Nani
Producer: Prashanti Tipirneni
Banner: Wall Poster Cinema
Story, Director: Ram Jagadeesh
DOP: Dinesh Purushothaman
Music: Vijai Bulganin
Art: Vittal Kosanam
Screenplay: Ram Jagadessh, Karthikeya Sreenivass and Vamsidhar Sirigiri
Ex-Producer: S. Venkatarathnam (Venkat)
Line producer: Prashant Mandava
నాని ప్రజెంట్స్, ప్రియదర్శి, రామ్ జగదీష్, ప్రశాంతి తిపిర్నేని, వాల్ పోస్టర్ సినిమాస్ ఫిల్మ్ టైటిల్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'- గ్రాండ్ గా లాంచ్- సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
వాల్ పోస్టర్ సినిమా కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన కంటెంట్-డ్రివెన్ మూవీస్ నిర్మించడంలో పేరు తెచ్చుకుంది. ఈ బ్యానర్‌లో వచ్చిన చాలా సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. బ్యానర్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్‌లకు నాని ప్రజెంటర్ గా సపోర్ట్ ఇస్తున్నారు. ఈరోజు, ప్రియదర్శి లీడ్ రోల్ లో రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయమవుతున్న న్యూ మూవీని అనౌన్స్ చేశారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు.
బోనులో న్యాయదేవత, శాంతి చిహ్నాలు గా ఎగురుతున్న పావురాలు వున్న టైటిల్ లుక్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది. అన్యాయంగా ఓ కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ప్రియదర్శి లాయర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ప్రియదర్శిపై షూట్ చేసిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి జెమినీ కిరణ్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీ దేవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రనీ పని చేస్తున్నారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్.
దర్శకుడు రామ్ జగదీష్‌తో పాటు కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి స్క్రీన్ ప్లే రాశారు.
తారాగణం: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీ దేవి
సాంకేతిక సిబ్బంది:
ప్రజెంట్స్: నాని
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
కథ, దర్శకత్వం: రామ్ జగదీష్
డీవోపీ: దినేష్ పురుషోత్తమన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఆర్ట్: విట్టల్ కోసనం
స్క్రీన్ ప్లే: రామ్ జగదీష్, కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: S. వెంకటరత్నం (వెంకట్)
లైన్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ