2 August 2016
Hyderabad
14 ఏళ్లుగా సినీవినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న సినీవారపత్రిక `సంతోషం`. ప్రతియేటా ఆగష్టులో `సంతోషం అవార్డ్స్` పేరిట టాలీవుడ్‌కి కొంగొత్త వెలుగులు తెస్తోంది. ఈ ఆగస్టు 2 నాటికి `సంతోషం` సినీవారపత్రిక 14 వసంతాలు పూర్తి చేసుకుని, దిగ్విజయంగా 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా `సంతోషం` 14వ వార్షికోత్సవ సంబరాలు, `సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్` వేడుకలు 14 ఆగస్టు 2016 న గచ్చిబౌళి ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ పార్క్ హయత్‌లో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో నిఖిల్ విశ్వ రాసి, కంపోజ్ చేసిన సంతోషం సాంగ్‌ను విడుదల చేశారు. అలాగే హీరోయిన్ క్యాథరిన్ హీరో నిఖిల్, థమన్ లకు తొలి ఇన్విటేషన్స్‌ను అందచేసింది. అనంతరం.....
నిఖిల్ మాట్లాడుతూ ``నా చిన్నప్పట్నుంచి ఈ అవార్డు వేడుకలను చూస్తున్నాను. విశ్వ మంచి సాంగ్‌ను రాసి, కంపోజ్ చేశారు. సాంగ్ చాలా బావుంది. 14ఏళ్లను పూర్తి చేసుకుంది. నంది, ఫిలింఫేర్ అవార్డులు తర్వాత ఆస్థాయిలో జరగుతున్న అవార్డుల కార్యక్రమం ఇది. నటీనటులు, టెక్నిషియన్స్‌ను ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఈ అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఈ అవార్డుల వేడుక చాలా కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
విశ్వ మాట్లాడుతూ ``నాది, సురేష్‌కొండేటిగారిది పాలుకొల్లు ప్రాంతమే. పద్నాలుగేళ్ళుగా సురేష్ సంతోషం మేగజైన్ ద్వారా సినిమా రంగానికి సేవ చేస్తూనే అవార్డులను ఇస్తున్నారు. ఈ సారి సంతోషం సాంగ్‌ను రాయమన్నారు. నా శాయశక్తులా మంచి సాంగ్‌ను రాసి, కంపోజ్ చేశాననే అనుకుంటున్నాను. ఆగస్ట్ 14న జరుగనున్న వేడుక పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
Catherine Tresa Glam gallery from the event |
|
|
|
కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ``సురేష్ జర్నలిస్ట్‌గా నాకు మంచి పరిచయం.సంతోషం మేగజైన్‌తో పాటు అవార్డులను అందిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. నంది అవార్డులతో పాటు ఈ సంతోషం అవార్డులకు ఓ క్రేజ్ ఏర్పడింది. ప్రతి సంవత్సరం ఈ అవార్డు వేడుకను ఘనంగా నిర్వహిస్తూ వచ్చి ఇప్పుడు దక్షిణాది సినీ రంగాల్లో అందరికీ ఇస్తున్నారు`` అన్నారు.
ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ ``పరిశ్రమలో సురేష్‌కు అందరి సపోర్ట్ ఉంది. సంతోషం అవార్డులతో చాలా మంది నటీనటులను, టెక్నిషియన్స్‌ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 14న జరుగనున్న ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ ``నేను బ్రతికున్నంత కాలం ఈ సంతోషం అవార్డులను నిర్వహిస్తాను. నాకు ఎవరూ హెల్ప్ చేయకపోయినా పరావాలేదు కానీ చెడగొట్టవద్దని కోరుకుంటున్నాను. సంతోషం మేగజైన్ స్టార్ట్ చేసిన రెండో సంత్సరం బాలకృష్ణగారు సంతోషం పేరుపై అవార్డులు ఇస్తే బావుంటుందని అన్నారు. ఆయన మాటతో ఈ సంతోషం అవార్డులను స్టార్ట్ చేశాను. అలాగే చిరంజీవిగారు మరో ఫంక్షన్‌లో నన్ను డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా ఎదగాలని అన్నారు. ఆయన మాటతో నేను డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. 74 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. అలాగే నిర్మాత 15 సినిమాలు చేశాను. అందరి సహకారంతో ముందుకెళ్తున్నాను. నా టీంలో సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావుగారు, వాసు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వారి సపోర్ట్ ముందుకు వెళుతున్నాను.
ఈ క్యార్యక్రమంలో క్యాథరిన్, ఏడిద శ్రీరాం, శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు.