పివిపి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘క్షణం’. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా....
పివిపి మాట్లాడుతూ ‘’పివిపి సంస్థ అనేది కలెక్షన్ ఆఫ్ పీపుల్ మైండ్. క్రియేటివ్ కంటెంట్ ను క్రియేట్ చేసే పెద్ద సంస్థ. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ముందుకు సాగుతుంటాం. అలాగే ఈ సినిమా కథ వినగానే కొత్తగా అనిపించడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాం. డిఫరెంట్ మూవీ. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు.
అడవిశేష్ మాట్లాడుతూ ‘’ముందు పివిపిగారికి థాంక్స్. రవి ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే బాగా డైరెక్ట్ చేశాడు. అలాగే అనసూయ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించారు. అలాగే నేను, ఆదాశర్మ ఇలా అందరూ పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. షనియ్ డియో సినిమాటోగ్రఫీ సూపర్. మూడేళ్ళ పాప కోసం చేసే జర్నీయే ఈ సినిమా’’ అన్నారు.
అనసూయ మాట్లాడుతూ ‘’ఈ సినిమా కథ విన్న తర్వాత ఆదాశర్మ పాత్ర ఇస్తారేమోనని అనుకున్నాను. కానీ పోలీస్ ఆఫీసర క్యారెక్టర్ ఇచ్చారు. నన్ను ఇలా కొత్తగా చూపించారు. రియలిస్టిక్ కాన్సెప్ట్ తో రూపొందించిన మూవీ. డైరెక్టర్ గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. అలాగే పివిపిగారికి కూడా థాంక్స్’’ అన్నారు.
డైరెక్టర్ రవికాంత్ పేరెపు మాట్లాడుతూ ‘’నేను, అడవిశేష్ కలిసి ఈ సినిమా కథను తయారు చేశాం. ప్రీలుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ విన్న పివిపిగారు మూడు రోజుల్లోనే సినిమాను చేయడానిక యాక్సెప్ట్ చేశారు. సస్పెన్స్ డ్రామాగా సాగే కథ ఇది. మార్చి 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రంలో అనసూయ పోలీస్ క్యారెక్టర్ చేసింది. ప్రతి పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. షనిల్ సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతుంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ షనిల్ డియో పాల్గొన్నారు.
అడవిశేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు, అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.