pizza
Tiger Nageswara Rao First Look Launch
మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' ఫియర్స్ & మెజెస్టిక్ ఫస్ట్ లుక్ లాంచ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


24 May 2022
Hyderabad

Mass Maharaja Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao’s Fierce & Majestic First Look Launched

The Kashmir Files, Karthikeya 2, and now Tiger Nageswara Rao. Abhishek Agarwal Arts which delivered blockbusters at the Pan India level is coming up with yet another Pan India project Tiger Nageswara Rao with Mass Maharaja who is familiar to the south as well as the north audience playing the titular role. Directed by Vamsee and produced grandly by Abhishek Agarwal of Abhishek Agarwal Arts, the promotions of the movie kick-start in a first-of-its-kind manner with the makers launching the fierce and majestic first-look poster and intriguing concept video on the iconic Havelock Bridge (Godavari) in Rajahmundry. They hired a train for the grand first-look launch event.

Ravi Teja looks like a ferocious tiger and roars like a tiger in the first-look poster that sees him in a rugged get-up with a thick beard. It’s scary to stare into his eyes, though it’s just a poster. He can be seen behind bars. The concept poster is meant to introduce the world of Tiger Nageswara Rao. It is articulated strikingly with voiceovers of five different superstars in five different languages. While Venkatesh gave voiceover for the Telugu version, John Abraham, Shiva Rajkumar, Karthi, and Dulquer Salmaan introduced the world of Tiger Nageswara Rao in Hindi, Kannada, Tamil, and Malayalam languages respectively.

As mentioned in the beginning of the video, the story is inspired by true rumours. “It was the 70s. A small village in the coastal region of the Bay of Bengal... Even the darkness that scares the world is afraid of the people there... The train that makes huge noise trembles when it reaches the outskirts of the area... The feet of people shudder when they see the landmark of the town... Stuartpuram is the crime capital of South India... That area has another name... Tiger Zone… The Zone of Tiger Nageswara Rao...” explains the voiceover.

The dialogue- “You might have seen a tiger hunting a deer? Have you ever seen a tiger hunting a tiger?” uttered by Ravi Teja describes the ruthless nature of the character. The voiceovers of the superstars make the portrayal more interesting.

Director Vamsee picked a winning script and he is presenting it in an appealing manner. Top technicians are working on the movie and we can see the brilliant and collective efforts put in by all the craftsmen.

The visuals captured by R Madhie ISC, the presentation by director Vamsee, the grandness in making by Abhishek Agarwal Arts, and the sound created by GV Prakash Kumar give enough elevation and take us to the world of notorious criminals. Ravi Teja’s body language, diction, and getup are completely different. The first look and the concept video create curiosity among the audience across the nation.

While speaking at the event director Vamsee said, “The 4 years of hunger of Ravi Teja’s fans will be satisfied with the movie. Although Ravi Teja is not here, his blessings will be with us. We are making a semi-biopic. It, however, will have fictional elements as well. It’s a realistic, raw, and rustic story. You will feel the emotion and vibe while watching the movie. It has the biggest action episodes. A set depicting Rajahmundry Bridge was built where an entire fight was shot. That will be ultimate and out of the world forever.

We created Stuartpuram village in 5-6 acres of land. We want to show the world in a more realistic manner. This movie needed the biggest scale of production. When I did my research on Tiger Nageswara Rao, I came to know that 3 lakh people came for his funeral. He has done a lot of help to many people. Not many know it. TNR planned Simhachalam robbery, but Gajjela Prasad executed it.

Ravi Teja has done 73 movies so far. His diction and body language will be completely different. Ravi Teja is best suited for the character. There is a love story as well in the movie. It took 14 days for us to get the required permission from railway authorities for one hour program.”

Producer Abhishek Agarwal said, “This is a very special movie for me. Vamsee and I have been traveling for 4 years. The first look is like a tiger coming out of the cage. I have been getting threats for the kind of movies I’m making, but I don’t care any. This movie is about how Nageswara Rao got the tagline- Tiger.”

Nupur Sanon and Gayathri Bharadwaj are roped in to play the leading ladies opposite Ravi Teja in the movie.

Avinash Kolla is the production designer. Srikanth Vissa is the dialogue writer, while Mayank Singhaniya is the co-producer.

The box office hunt of Tiger Nageswara Rao begins from Dussehra with the movie releasing grandly worldwide on October 20th.

Cast: Ravi Teja, Nupur Sanon, Gayathri Bharadwaj and others

Technical Crew:
Writer, Director: Vamsee
Producer: Abhishek Agarwal
Banner: Abhishek Agarwal Arts
Presenter: Tej Narayan Agarwal
Co-Producer: Mayank Singhaniya
Dialogues: Srikanth Vissa
Music Director: GV Prakash Kumar
DOP: R Madhie
Production Designer: Avinash Kolla

మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' ఫియర్స్ & మెజెస్టిక్ ఫస్ట్ లుక్ లాంచ్

'టైగర్ నాగేశ్వరరావు’తో అభిమానులు ఆకలి ఖచ్చితంగా తీర్చుతాను: డైరెక్టర్ వంశీ

'టైగర్ నాగేశ్వరరావు’ మాకు చాలా స్పెషల్ మూవీ : నిర్మాత అభిషేక్ అగర్వాల్

ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా లెవల్ బ్లాక్ బస్టర్స్ అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దక్షిణాది తో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితమైన మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'టైగర్ నాగేశ్వరరావు తో వస్తోంది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషన్‌ లు వినూత్న పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మేకర్స్ ఫియర్స్ & మెజెస్టిక్ ఫస్ట్-లుక్ పోస్టర్, ఆసక్తికరమైన కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌లాక్ బ్రిడ్జ్ (గోదావరి) వద్ద గ్రాండ్ గా ఫస్ట్-లుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. గ్రాండ్ ఫస్ట్ లుక్ లాంచ్ కోసం మేకర్స్ రైలును హైర్ చేసుకున్నారు.

ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ లో రవితేజ ఫెరోషియస్ టైగర్ లా రగ్గడ్ గెటప్‌ లో కనిపించారు. ఇది కేవలం పోస్టర్ అయినప్పటికీ అతని కళ్ళలోకి చూడాలంటే భయంగా ఉంది. రవితేజ బార్స్ వెనుక ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేసేలా కాన్సెప్ట్ పోస్టర్ ఉంది. ఇది ఐదు వేర్వేరు భాషల్లో ఐదుగురు సూపర్ స్టార్‌ ల వాయిస్‌ ఓవర్‌ లతో అద్భుతంగా ప్రజంట్ చేశారు. తెలుగు వెర్షన్‌కి వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, జాన్ అబ్రహం, శివ రాజ్‌కుమార్, కార్తీ, దుల్కర్ సల్మాన్ వరుసగా హిందీ, కన్నడ, తమిళం , మలయాళ భాషలలో టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేశారు.

వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా, కథ నిజమైన రూమర్స్ నుండి ప్రేరణ పొందింది. ''అది 70వ దశకం. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాల్ని చూసి భయపడుతుంది. దడదడ మంటూ వెళ్ళే రైలు ఆ ప్రాంత పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలు రాయి కనపడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని. ది క్రైమ్‌ క్యాపిటల్‌ అఫ్ సౌత్ ఇండియా.. స్టువర్ట్ పురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా వుంది. టైగర్‌ జోన్‌... ది జోన్ అఫ్ టైగర్ నాగేశ్వరరావు..” అంటూ వాయిస్‌ ఓవర్‌ టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేసింది.

''జింకల్ని వేటాడే పులుల్ని చూసుంటావ్. పులుల్ని వేటాడి పులిని ఎప్పుడైనా చూశావా ?'' అని రవితేజ చెప్పిన డైలాగ్ ఆ పాత్ర స్వభావాన్ని వివరిస్తాయి. సూపర్‌స్టార్ల వాయిస్‌ ఓవర్‌లు ప్రజంటేషన్ ని మరింత ఆసక్తికరంగా మార్చాయి.

దర్శకుడు వంశీ ఒక విన్నింగ్ స్క్రిప్ట్‌ని ఎంచుకుని, దానిని ఆకట్టుకునే రీతిలో ప్రజంట్ చేస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అద్భుతమైన పని తీరు సమిష్టి కృషిని మనం చూడవచ్చు.ఆర్ మదీ క్యాప్చర్ చేసిన విజువల్స్, దర్శకుడు వంశీ అందించిన ప్రెజెంటేషన్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మేకింగ్‌లో గ్రాండ్‌నెస్. జివి ప్రకాష్ కుమార్ సృష్టించిన సౌండ్ తగినంత ఎలివేషన్‌ని ఇచ్చి మనల్ని టైగర్ నాగేశ్వరరావు ప్రపంచానికి తీసుకెళ్తాయి.

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ ని ఇంత గ్రాండ్ గా లాంచ్ చేసిన నిర్మాతలుకు కృతజ్ఞతలు. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా వున్నాయి. రవితేజ గారి అభిమానులకు, ప్రేక్షకులకు, మీడియాకి, అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. రవితేజ గారి అభిమానులు ఆకలి తీరేలా ఈ సినిమా వుంటుంది. రవితేజ గారి బ్లెసింగ్స్ మనకీ ఎప్పుడూ వుంటాయి. నువ్వు చెయ్ వంశీ నేను వున్నాని చెబుతుంటారు. ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను. అక్టోబర్ 20న సినిమాని మిస్ కావద్దు’’ అన్నారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ. కొన్ని దారి రాస్తుంది. కొన్ని నేను రాస్తాను .వాళ్ళు కష్టాలు రాస్తూ ఉంటారు. నేను గమ్యం రాసేస్తాను. నా రెక్కలు మీరు కోసేసిన నేలపై వుండి నింగిని రాసేస్తాను’’ ఇదీ మా టైగర్ నాగేశ్వరరావు;; అన్నారు

మయాంక్ మాట్లాడుతూ.. టైగర్ నాగేశ్వరరావు కోసం చాలా ఎక్సయిట్ టెడ్ గా వున్నాం. ఫస్ట్ లుక్ లో రవితేజ గారు మునుపెన్నడూ కనిపించని విధంగా, డేంజరస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాం’’ అన్నారు

అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది.

వంశీ గారు.. గతంలో స్టువర్ట్ పురం నేపధ్యంలో చిరంజీవి గారు, అలాగే సాగర్ దర్శకత్వం స్టువర్ట్ పురం దొంగలు అనే సినిమాలు వచ్చాయి కదా.. ఇందులో ఆ ఛాయలు కనిపిస్తాయా ?
చిరంజీవి గారి సినిమా, సాగర్ గారి సినిమా నేనూ చూశాను. అందులో ఆ ఊరిలోని కొన్ని నేపధ్యాలు తీసుకున్నారు. కానీ మేము చేస్తున్నది బయోపిక్. టైగర్ నాగేశ్వర రావు ఒరిజినల్ బయోపిక్. చాలా రియల్ గా నేచురల్ గా ఒరిజినల్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకొని వుంటుంది.

వంశీ గారు. టైగర్ నాగేశ్వరరావు రవితేజ అభిమానులు అంచనాలు అందుకుంటుందా ?
టైగర్ నాగేశ్వరరావు రా రస్టిక్ స్టొరీ. బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ వున్నాయి. రాజమండ్రి బ్రిడ్జ్ ని సెట్ వేసి పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశాం. అది అల్టిమేట్ అవుట్ అఫ్ ది వరల్డ్ ఫర్ ఎవర్.. ఈ రెండు చాలు సినిమా ఎలా వుంటుందో చెప్పడానికి. ఆరు ఎకరాల్లో స్టువర్ట్ పురం విలేజ్ ని క్రియేట్ చేశాం. సినిమా ఎలా వుంటుందో మీ అంచనాలకి వదిలేస్తున్నాను. అభిమానులకు ఒకటే మాట చెబుతున్న . అభిమానుల ఆకలి ఖచ్చితంగా తీరుస్తాను.

అభిషేక్ గారు.. టైగర్ నాగేశ్వరరావు ఓపెనింగ్ గ్రాండ్ గా చేశారు., ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా ఇంత గ్రాండ్ గా చేశారు..ఈ సినిమాపైవున్న ప్రత్యేకమైన ఆసక్తి ఏమిటి ?
టైగర్ నాగేశ్వరరావు నాకు కొంచెం స్పెషల్. దర్శకుడు వంశీ నాకు బ్రదర్. నాలుగేళ్ళు కష్టపడి ప్రయాణం చేశాడు. ఈ రోజు టైగర్ కేవ్ నుంచి బయటికి వచ్చాడు.

వంశీ గారు.. మీ కెరీర్ బిగినింగ్ లోనే రవితేజ గారు లాంటి పెద్ద హీరోతో ఇంత పెద్ద స్కేల్ లో చేయడం ఎలా అనిపిస్తోంది?
టైగర్ నాగేశ్వరరావు కి ఆ స్కేల్ కావాల్సివచ్చింది. ఇది నా డ్రీం ప్రాజెక్ట్. అభిషేక్ గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ధమాకా వందకోట్లు చేసింది. నేను వెయ్యి కోట్లు చెయ్యాలంటే ఆ స్కేల్ చూపించాలి. దాని కోసమే పని చేశాం.

వంశీ గారు.. దొంగ పాత్రని ఎలా పాజిటివ్ గా చూపిస్తారు?
ఈ కథ గురించి రిసెర్చ్ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి టైగర్ నాగేశ్వరరావు చనిపోయినప్పుడు మూడు లక్షల మంది చూడటానికి వచ్చారు. ఆయన కథలో ఎదో దాగిన నిజం వుంది. ఆ నిజం కోసమే ఈ సినిమా చేశాం.

వంశీ గారు రవితేజ గారిని ఇందులో ఎంత కొత్త గా చుపిస్తున్నారు ?
రవితేజ గారు ఇప్పటివరకూ దాదాపు 73 సినిమాలు చేసివుంటారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లోని డిక్షన్ , బాడీ లాంగ్వేజ్ కనిపించదు. టైగర్ నాగేశ్వరరావు లోని రవితేజ కనిపిస్తారు.

వంశీ గారు.. ఫస్ట్ లుక్ ని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు.. రైలుని కూడా హైర్ చేసుకున్నారు .. ప్లానింగ్ కి ఎన్ని రోజులు పట్టింది ?
గత నెల రోజులుగా ప్లాన్ చేశాం. ఇది ట్రాక్ ట్రాక్ లో రైలు. ఒక గంట తీసుకోవాలంటే 70 రైళ్ళని డైవర్ట్ చేయాలి. 14 రోజులు పర్మిషన్ కే పట్టింది.

ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

దసరా నుండి టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వేట ప్రారంభమవుతుంది. ఈ చిత్రం అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుంది.
నటీనటులు: రవితేజ, నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ తదితరులు
రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా


Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved