pizza
Titanic first look launch
‘టైటానిక్’ ట్రైలర్ విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

22 April 2016
Hyderabad

రాజీవ్‌ సాలూరి, యామిని భాస్కర్‌ హీరో హీరోయిన్లుగా కన్నా సినీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నూతన చిత్రం 'టైటానిక్‌'. 'అంతర్వేది టు అమలాపురం' ట్యాగ్‌ లైన్‌. జి.రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా...

చిత్ర దర్శకుడు రాజవంశీ మాట్లాడుతూ ‘’అమలాపురం నుండి అంతర్వేది వరకు ఓ ఫ్యామిలీ టైటానిక్ అనే లాంచీలో చేసే ప్రయాణమే ఈ చిత్రం. టైటిల్ వినగానే నిర్మాతగారు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. కథ వినగానే ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకెళదామని పుల్ సపోర్ట్ చేసి సినిమాను నిర్మించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. త్వరలో పాటలను విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

నిర్మాత కె.శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ చిత్రం ప్యామిలీ కామెడి ఎంటర్‌టైనర్‌. 'అంతర్వేది నుండి అమలాపురం' వరకు గోదావరి నదిలో టైటానిక్‌ అనే లాంచీలో జరిగే కథే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా నటిస్తున్నాడు. రాజీవ్‌ సాలూరి హీరోగా నటిస్తున్నాడు. రఘుబాబు విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే 'జబర్‌దస్త్‌' టీం కామెడి సినిమాకు ప్లస్‌ అవుతుంది. రాజవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌కు వినోద్‌ యాజమాన్య సంగీతం అందించారు'' అన్నారు.

హీరో రాజీవ్ సాలూరి మాట్లాడుతూ ‘’సినిమాను 30రోజుల పాటు లాంచీలో చిత్రీకరించాం. యూనిట్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయాం. మంచి ఎంటర్ టైనింగ్ సాగే చిత్రమిది’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ ‘’సినిమాలో నాలుగు పాటలున్నాయి. అన్నీ రకాల పాటలతో మ్యూజిక్ కు స్కోప్ ఉన్న చిత్రమిది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

పృథ్వీ, రఘుబాబు, కాదంబరి కిరణ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్‌: సత్య, ఫైట్స్‌: రాం సుంకర, ఆర్ట్‌: రఘుకులకర్ణి.కె, మ్యూజిక్‌: వినోద్‌ యాజమాన్య, ఎడిటర్‌: ఎమ్‌.ఆర్‌.వర్మ, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీః రామరాజు, సహా నిర్మాతః అట్లూరి సురేష్‌ బాబు, నిర్మాతః కె.శ్రీనివాసరావు, రచన-దర్శకత్వం: జి.రాజవంశీ.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved