02 January 2025
Hyderabad
The wait is over! The highly anticipated trailer for Ram Charan’s Game Changer has finally been unveiled, sending waves of excitement across the globe. Directed by the legendary S. Shankar and co-starring the luminous Kiara Advani, the film promises to be a cinematic extravaganza like never before.
The trailer is a masterful blend of pulse-pounding drama, breathtaking action, and heartfelt emotions, offering audiences a glimpse into a story that is both gripping and deeply resonant. With its stunning visuals and cutting-edge production values, Game Changer raises the bar for Indian cinema, showcasing a level of grandeur that leaves viewers spellbound. The trailer offers a glimpse into Shankar's mesmerizing cinematic world.
As the trailer trends across social media platforms, fans and critics alike are hailing Game Changer as a true milestone in filmmaking. With its star-studded cast, compelling narrative, and unparalleled production scale, the film has already solidified its place as one of the most eagerly awaited releases of the year.
The wait is over! The highly anticipated theatrical trailer of Global Star Ram Charan's upcoming pan-India biggie "Game Changer" is out now. Ace filmmaker Rajamouli launched the trailer at a grand event held in Hyderabad. With this being the first-ever collaboration between Charan and master filmmaker Shankar, the project has generated immense excitement and high expectations.
Speaking at the event, Global Star Ram Charan said, "Every day of working with Shankar garu is unpredictable. It was a beautiful journey with him. I feel fortunate to work with Sukumar garu, Rajamouli garu, and Shankar garu for 2-3 years each. There are similarities between Shankar garu and Rajamouli garu off-screen, but on the filmmaking front, they are different. Both of them are open to suggestions. My 'Dhop' moment of working with Shankar garu is leaving behind time and working efficiently. Shankar garu worked on this story by traveling with honest bureaucrats and politicians. By traveling with him, I got that entire system in my mind. All our artists are pillars of our movie. Our performances elevate because of their support. I thank Srikanth garu, Samuthirakani garu, SJ Suryah garu, and Anjali garu for their support. Thank you, Sai Madhav Burra garu, for impactful dialogues and Thaman for a rocking album. Thank you, Dil Raju and Sirish garu, for this opportunity."
Sensational director Rajamouli said, "When they told me it is Shankar sir's first Telugu cinema, I doubted it. Because, for Telugu audiences, Shankar sir is always a Telugu director. We all have a lot of respect for Shankar sir. For the last 10 years, all of us have been making pan-India films. He is the OG of directors among current big-screen filmmakers. He is the one who inspired an entire generation of directors. I thank him for giving me the opportunity to launch the trailer. There are many mesmerizing and exciting shots in the trailer. Everyone who knows Charan knows how he evolved. Even I know how he evolved from Magadheera to now. Throughout Magadheera, I used to call him 'hero.' I feel happy to see him at such a level. I can only imagine how people would react to Charan's performance in theatres. Game Changer is coming to enthrall us in theatres on January 10. Watch the film only in theatres."
The film's director Shankar said, "I like commercial films like Okkadu and Pokiri. I always wanted to make such a film. This film is such a film. It also has all the ingredients you expect from my film. The movie is about the war between a government officer and a politician. There is a backstory in the movie which comes and gives a huge impact. Everyone is saying that it will be a 'Shankranthi,' but I believe it is going to be 'Ram Navami' for sure. He played all characters with ease. His screen presence is impeccable. Even Kiara Advani performed very well and danced on par with Ram Charan garu. Anjali gave a soulful performance. There is another surprise. I won't talk about that character. You should watch it in theatres. I watch actors like SJ Suryah garu very rarely. Srikanth garu did this character with heavy prosthetic makeup and did an excellent job. When we see Samuthirakani garu acting, we don't feel much. But when we see it in the edit room, we get that impact. Sunil garu, Jayaram garu, and Rajiv Kanakala garu all did a phenomenal job. They strengthened the film with their performances. Raju garu never says no to whatever I request. We have to thank Dil Raju for giving me such freedom and also introducing me to Telugu cinema. He not only spends money but is on set every day, looking after each and every department. That is their success formula. Music director Thaman garu lived up to my expectations. Especially, the background score was excellent. DOP Thiru garu gave eye-catching visuals. We tried infrared cinematography for the first time. Whatever you see in the Dhop song is not CG but lakhs of lights. Production designer Avinash Kolla brought Telugu culture with the production design. Rama Krishna garu also worked on this movie. Both of them did a terrific job in production design. Editor Ruben and VFX supervisors Srinivasan garu and Rangarajan did their jobs brilliantly. The story is written by popular Tamil director Karthik Subbaraj. Sai Madhav Burra garu gave powerful dialogues to the movie. Prabhu Deva garu choreographed the 'Jaragandi' song without taking a penny, only out of love for Ram Charan garu and Dil Raju garu. Rajamouli is the pride of Indian cinema, who made Hollywood look up to Indian cinema. I thank him for attending this event."
The film's producer Dil Raju said, "I thank Shankar garu for making Tamil cinema a pan-India phenomenon and Rajamouli garu for elevating Telugu cinema to global recognition. They have paved the way for us to create large-scale films and make them successful. Shankar garu's vision and grandeur can be witnessed in every scene and song of Game Changer. The teaser and trailer showcase only 40-50% of the film's essence. Shankar garu has reserved many high moments for the movie. Yesterday, I watched a few reels at Prasad Labs, and while I want to share more, I will let audiences experience it in theatres on January 10. I also thank Shankar garu for trusting us with this project and Ram Charan garu for collaborating with us after his global hit. I believe Charan has reached even greater heights with this movie. Lastly, I thank Rajamouli garu for taking time out of his busy schedule, especially on the day he launched his highly-anticipated film with Superstar Mahesh Babu garu."
Music director Thaman stated, "Just as a bride is kept hidden before matchmaking, Shankar garu and Dil Raju garu have kept Game Changer under wraps for the past three years. Dil Raju garu is one of the most significant personalities in the Telugu film industry, and I wanted to give my absolute best for him. I began my career with Shankar garu through Boys, and he has witnessed my transformation over the past 20 years. Working on his first direct Telugu film, especially with Ram Charan garu, is a thrilling experience. Everyone on this stage, from actors to technicians, are pivotal contributors and true game changers for Game Changer. I also wish Rajamouli garu the very best for launching SSMB 29 today. Game Changer will be a perfect 'Shankranthi feast' for the audience."
Actor Srikanth said, "Dil Raju garu has already asked me to prepare a speech for the January 4th event. I want to thank Shankar garu for giving me this role because it reminded me so much of my father. It’s such a great character, and I am deeply grateful. I witnessed Charan's phenomenal performance during the shoot. Having worked with him earlier in Govindudu Andarivaadele, I can say he has reached a whole new level in terms of performance, stability, confidence, and versatility. I am confident this film will be a landmark in his career. Thank you once again, Shankar garu, for this opportunity to relive memories of my father through this role. Even my mother is eagerly looking forward to the movie!"
Actress Anjali said, "My character in Game Changer is one of the best roles I’ve played in my career. I’m deeply grateful to Shankar garu for giving me such a powerful role and feel truly blessed to work under his direction. Working with Charan is an incredible experience. He’s the kind of co-star everyone wants to work with again and again. I also thank producers Raju garu and Sirish garu for this wonderful opportunity. Congratulations to Thaman garu, my co-stars Srikanth garu, SJ Suryah garu, and Samuthirakani garu for being part of this incredible film. Let’s all meet in theatres on January 10."
Actor Samuthirakani stated, "I extend my heartfelt thanks to Shankar sir for entrusting me with a role in this extraordinary movie. After playing Charan sir’s uncle in RRR, I feel delighted to reprise a similar bond in this film. Charan sir is a remarkable co-actor. Every time I work with him, it doesn’t feel like acting alongside a colleague but spending time with a brother. He’s sincere and dedicated to his craft. I also thank Dil Raju sir and the entire team for their hard work and commitment. This movie is destined to be a massive hit."
Actor SJ Suryah said, "Happy New Year to everyone! I’m deeply grateful to every member of the team for giving me this opportunity. However, I believe that our film will do all the talking. The way Shankar sir designed my character and guided me through the role is unforgettable. I mentioned at the Dallas event that I’ve saved Ram Charan garu’s contact as 'RC-The King.' There’s an old video of Chiranjeevi garu feeling proud of little Charan garu’s dance moves, showcasing their incredible bond. Today, Charan garu has risen to unparalleled heights with films like Magadheera and RRR. From Mega Power Star to Global Star, he’s truly remarkable. I feel honored to work alongside him. My thanks to Rajamouli garu for gracing this event. This Pongal will truly be a Shankranthi! Raju garu and Sirish garu have gone above and beyond in supporting Shankar sir’s vision, sparing no expense for this grand project."
Dialogue writer Sai Madhav Burra stated, "This film is going to be a super-duper hit, without a doubt. It’s been an absolute honor to work on such a wonderful movie with the visionary Shankar garu and the phenomenal Ram Charan garu. I feel privileged to witness Rajamouli garu launching our trailer. Having seen the film, I can confidently say that this Sankranthi will be remembered as Shankranthi! Prepare to experience the grandeur on January 10."
Game Changer's stellar cast includes Global Star Ram Charan, Kiara Advani, SJ Suryah, Samuthirakhani, Anjali, Naveen Chandra, Sunil, and Srikanth among others.
The film boasts a talented crew including music director Thaman, DOP S. Thirunavukarasu, writer Karthik Subbaraj, dialogue writer Sai Madhav Burra and others. Dil Raju and Sirish are bankrolling the project under Sri Venkateshwara Creations, Dil Raju Productions and Zee Studios. SVC Adityaram Movies is producing the film in Tamil. Anil Thadani of AA Films is releasing the film in Hindi. Game Changer is set to hit the screens worldwide on January 10, 2025.
‘గేమ్ చేంజర్’ ట్రైలర్‌లో ప్రతీ షాట్ అద్భుతంగా అనిపించింది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకధీరుడు రాజమౌళి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో గురువారం నాడు గేమ్ చేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం..
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ..‘శంకర్ గారు ఫస్ట్ తెలుగు సినిమా అని అంతా చెబుతుంటే.. అవునా? నిజమా? అని అనిపించింది. కానీ తెలుగు వాళ్లకి శంకర్ గారు తమిళ దర్శకుడు కాదు.. మన తెలుగు దర్శకుడే. శంకర్ గారు అంటే తెలుగు వారందరికీ గౌరవం. ఆ గౌరవంతోనే దిల్ రాజు గారు ఈ మూవీని శంకర్ గారితో తీసి ఉంటారు. ప్రస్తుతం ఉన్న కుర్ర దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు. కానీ మేం మాత్రం శంకర్ గారిని చూసి గర్వపడుతుంటాం. ఆయనే డైరెక్టర్లకు ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. మనకున్న పెద్ద కలల్ని సినిమాగా తీస్తే.. డబ్బులు వెనక్కి వస్తాయని అందరికీ కాన్ఫిడెంట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్. ట్రైలర్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్. ఈ మూవీతో వింటేజ్ శంకర్ గారెని చూస్తాం. ఒకే ఒక్కడు నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ స్థాయిని మించేలా గేమ్ చేంజర్ ఉంటుందనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే.. ప్రతీ షాట్, సీన్ ఎగ్జైట్మెంట్‌ను ఇచ్చింది. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్‌కే రామ్ చరణ్ ఎంతో ఎదిగి పోయాడు. మగధీర టైంలో రామ్ చరణ్‌ను హీరో అని పిలుస్తూ ఉండేవాడ్ని. హెలికాప్టర్ నుంచి లుంగీ కట్టుకుని కత్తి పట్టుకుని దిగుతుంటే.. విజిల్స్ ఎలా వస్తాయో నాకు తెలుస్తోంది. జనవరి 10న థియేటర్లోకి గేమ్ చేంజర్ రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. సోషల్ కమర్షియల్, మాస్, ఎంటర్టైనర్‌గా ఉంటుంది. ఓ పొలిటికల్ లీడర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ. హీరో పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు. అందరూ శంకరాత్రి అని అంటున్నారు. కానీ ఇది రామ నవమి. రామ్ చరణ్ తన పాత్రల్లో ఒదిగిపోయారు. అక్కడ రామ్ చరణ్ కాకుండా మీకు ఆ పాత్రలే కనిపిస్తాయి. అంత అద్భుతంగా కనిపిస్తారు. సాంగ్స్, యాక్షన్స్, పర్ఫామెన్స్ ఇలా అన్నింట్లో అద్భుతంగా నటించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామ్ చరణ్‌ను చూసేందుకే జనాలు వచ్చేస్తారు. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ అందరి హృదయాల్ని గెలిచేస్తారు. కియారా అద్వాణీ గారు రామ్ చరణ్ గారితో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అంజలి గారు తన నటనతో పాత్రకు జీవం పోశారు. ఎస్ జే సూర్య లాంటి యాక్టర్స్‌ని చాలా అరుదుగా చూస్తుంటాం. ఒక్కో సీన్, ఒక్కో షాట్‌ను ఎంతో పర్ఫెక్ట్‌గా చేస్తారు. శ్రీకాంత్ గారు ప్రోస్థటిక్ మేకప్‌తో చాలా చక్కగా నటించారు. చూస్తే నార్మల్‌గా ఉంటారు. కెమెరాముందుకు వస్తే మాత్రం సింహాంలా నటించేస్తారు. సముద్రఖని గారు ఎంతో సహజంగా నటిస్తారు. సునీల్ గారికి చాలా కొత్త పాత్రను చేశారు. రాజీవ్ కనకాల గారు తన అనుభవాన్ని చూపించారు. ఆర్టిస్టులంతా కలిసి తమ నటనతో ఈ సినిమాను నిలబెట్టారు. నేను ఏం అడిగినా, ఏం చెప్పినా కూడా దిల్ రాజు ఇచ్చారు. నన్ను తెలుగుకి పరిచయం చేసినందుకు దిల్ రాజు గారికి థాంక్స్. ప్రతీ రోజూ సెట్స్‌కు వచ్చి అన్నీ గమనిస్తుంటారు. శిరీష్ గారు దిల్ రాజుకు ఎంతో సపోర్ట్‌గా ఉంటారు. రెహమాన్ లేడనే లేటు నాకు తెలీకుండా తమన్ నా నమ్మకాన్ని నిలబెట్టి సంగీతం ఇచ్చారు. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చారు. డీఓపీ తిరు గారు ఒక్కో విజువల్‌ను ఐ క్యాచీగా ఇచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ఫ్రా రెడ్ టెక్నాలజీ వాడాం. పాటలకు చాలా వరకు కొత్త టెక్నాలజీ వాడాం. జరగండి సెట్‌ను ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల అద్భుతంగా వేశారు. రామకృష్ణ వేసిన డోప్ సాంగ్ సెట్ బాగా వచ్చింది. ఎడిటర్ రూబెన్ ఈ సినిమాను రేసీగా కట్ చేశారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఓ ఐదు నిమిషాలు గ్యాప్ దొరికినా ఫోన్ చూసేస్తుంటారు. కానీ అలా పక్కకి తిప్పుకోనివ్వకుండా అద్భుతంగా కట్ చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా అద్భుతంగా వచ్చింది. కార్తిక్ సుబ్బరాజ్ వద్ద కథను తీసుకుని ఈ మూవీని చేశాను. ఇది కూడా నాకు ఓ గేమ్ చేంజర్ లాంటిదే. సాయి మాధవ్ బుర్రా గారు అద్భుతమైన డైలాగ్స్ రాసిచ్చారు. పక్కా తెలుగు ఫ్లేవర్ ఉండేలా రాసిచ్చారు. ప్రభుదేవా గారు జరగండి సాంగ్‌ను ఫ్రీగా చేశారు. రామ్ చరణ్ గారి మీద ప్రేమతో, దిల్ రాజు గారు ప్రేమతో ఆయన ఉచితంగా చేశారు. రా మచ్చా పాటను గణేష్ ఆచార్య గారు చేశారు. ప్రతీ కొరియోగ్రాఫర్ రామ్ చరణ్ గారి మీద చాలా పెద్ద షాట్స్, స్టెప్స్ వేయించారు. ప్రేమ్ రక్షిత్ గారు సోలో ఫుల్ సాంగ్ చేశారు. జానీ మాస్టర్ గారు డూప్ సాంగ్ చేశారు. నేను ఏదో కొత్తగా ఆలోచిస్తే నాకంటే కొత్తగా ఆలోచించి కొరియోగ్రఫీ చేశారు. హైరానా పాటను బాస్కో మాస్టర్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. శాండీ గారు బిట్ సాంగ్ చేశారు. అన్బరివ్ యాక్షన్స్ అద్భుతంగా వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యాం గారు ఓ ఫోక్ సాంగ్ రాసిచ్చారు. హాలీవుడ్‌లా మనం తీయాలని అనుకుంటాం. కానీ హాలీవుడ్ కూడా ఇప్పుడు మనలా సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. దానికి కారణం రాజమౌళి గారు. జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతోంది’ అని అన్నారు.
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి గారికి థాంక్స్. రాజమౌళి గారు, శంకర్ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకు షూట్ చేస్తుంటారు. ఇద్దరూ చాలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. శ్రీకాంత్ గారు, ఎస్ జే సూర్య గారు, సముద్రఖని గారు, అంజలి గారు, కియారా ఇలా ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించడంతోనే సినిమాకు ఇంతటి అందం వచ్చింది. అందరి పర్ఫామెన్స్‌లతోనే ఈ సినిమా ఎలివేట్ అవుతోంది. సాయి మాధవ్ బుర్రా గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతోంది’ అని అన్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘తమిళ్ సినిమాను శంకర్ గారు పాన్ ఇండియాగా చేశారు. రాజమౌళి గారు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ ఇద్దరి వల్లే ఇప్పుడు ఇలాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. డల్లాస్ ఈవెంట్‌లో చాలా మాట్లాడాం. ఇంకా నాలుగో తేదీన చాలా మాట్లాడాల్సి ఉంది. శంకర్ గారు ఇప్పటి వరకు చేసినదంతా మెల్లిమెల్లిగా రివీల్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశాం. ఇప్పటి వరకు మేం చూపింది కేవలం యాభై శాతమే. అసలు మ్యాటర్ ఏంటో జనవరి 10న తెలుస్తుంది. సినిమా అన్ ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. ఇదొక గొప్ప సినిమా కానుంది. ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా అంటే ఎలా ఉండాలో అలానే ఉంటుంది. పెట్టిన దాని కంటే ఎక్కువ లాభాలు రాబోతోన్నాయి’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ మాట్లాడుతూ.. ‘మూడేళ్లుగా ఈ సినిమాను దిల్ రాజు గారు చాలా జాగ్రత్తగా దాచారు. దిల్ రాజు గారికి ఈ చిత్రంతో పెద్ద హిట్ రావాలి. జనవరి 10న ఆయనకు నేను ప్రేమగా ఓ హగ్ ఇవ్వాలి. బాయ్స్ నుంచి గేమ్ చేంజర్ వరకు నా ప్రయాణాన్ని శంకర్ గారు చూశారు. ఆయన మొదటి సారిగా ఓ తెలుగు సినిమాను, అది కూడా రామ్ చరణ్ గారితో చేశారు. శంకర్ గారితో నా బంధాన్ని చాటేలా ఈ మ్యూజిక్ ఉంటుంది. మా ట్రైలర్‌ను లాంచ్ చేసిన రాజమౌళి గారికి థాంక్స్. సంక్రాంతికి పర్ ఫెక్ట్ సినిమాగా గేమ్ చేంజర్ జనవరి 10న రాబోతోంది’ అని అన్నారు.
రైటర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ..‘గేమ్ చేంజర్ సూపర్ డూపర్ హిట్ మూవీ. అద్భుతమైన సినిమాకు పని చేశానన్న సంతృప్తి ఉంది. శంకర్ గారితో, చరణ్ బాబు పని చేయడం ఆనందంగా ఉంది. రాజమౌళి గారు ట్రైలర్‌ను రిలీజ్ చేయడం మరింత అద్భుతం. ప్రతీ సీన్ అద్భుతంగా ఉంటుంది. రేపు వచ్చేది సంక్రాంతి కాదు.. శంకరాత్రి’ అని అన్నారు.
యాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నాలుగో తేదీ జరిగే ఈవెంట్‌లో మాట్లాడేందుకు మాటల్ని దాచి పెట్టుకో అని దిల్ రాజు గారు చెప్పారు. నాకు ఇంత మంచి కారెక్టర్ ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. ఈ పాత్రలో నేను మా నాన్న గారెని చూసుకున్నాను. రామ్ చరణ్ పర్ఫామెన్స్ ఇందులో సెట్స్ మీద, డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను. గోవిందుడు అందరివాడేలే సినిమా టైంలో కంటే రామ్ చరణ్ ఇప్పుడు ఎంతో స్థాయికి ఎదిగాడు. ఈ మూవీ కోసం మా అమ్మ గారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు’ అని అన్నారు.
హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైంది. ఈ పాత్రలోంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ఇంత మంచి పాత్రను ఇచ్చినందుకు శంకర్ గారికి థాంక్స్. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయి. రామ్ చరణ్ గారెతో పని చేయడం ఆనందంగా ఉంది. కో ఆర్టిస్ట్‌లకు చాలా కంఫర్ట్ ఇస్తుంటారు. నా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ గారికి థాంక్స్. జనవరి 10న గేమ్ చేంజర్ ఏంటో అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.
యాక్టర్ ఎస్.జె.సూర్య మాట్లాడుతూ.. ‘మంచి చిత్రంతో ఈ ఏడాది ప్రారంభం అవుతోంది. గేమ్ చేంజర్ లాంటి మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. సినిమా గురించి మనం చెప్పకూడదు.. ఆ సినిమానే మాట్లాడాలని అంటుంటారు. ఈ సినిమా ఏంటో జనవరి 10న అందరికీ తెలుస్తుంది. ఒక్కో సీన్ చేస్తుంటే నేను ఎంతో సంతోషించాను. శంకర్ గారు చాలా బ్రహ్మాండంగా ఈ మూవీని తీశారు. ఆయన రాసిన తీరు, తీసిన తీరు అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయికి వెళ్లారు. సెట్‌లో మాత్రం రామ్ చరణ్ ఎంతో హంబుల్‌గా ఉంటారు. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సంక్రాంతికి ఈ సినిమాతో అందరూ ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి గారికి థాంక్స్. మిగిలిన విషయాలు జనవరి 4న జరిగే ఈవెంట్లో మాట్లాడతాను’ అని అన్నారు.
యాక్టర్ సముద్రఖని మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్లు నేను నటించిన ఏదో ఒక మూవీ సంక్రాంతికి వస్తుంది. అలా సంక్రాంతికి వచ్చిన ప్రతీ చిత్రం హిట్ అవుతూనే ఉంది. ఇంత మంచి చిత్రంలో ఇంత అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు థాంక్స్. ఆర్ఆర్ఆర్‌లో చిత్రంలో రామ్ చరణ్ పక్కన బాబాయ్ పాత్రలో కనిపించాను. ఇందులో కూడా అలాంటి పాత్రలోనే నటించాను. రామ్ చరణ్ చాలా సిన్సియర్‌గా పని చేస్తారు. సూర్య గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.