సందీప్ కిషన్, అనీషా అంబ్రోస్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రన్'. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మించారు. అని కన్నెగంటి దర్శకుడు. తమిళ చిత్రం'నేరం' రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 23న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రయూనిట్ గుమ్మడికాయ ఫంక్షన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా...
నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ ‘’ఈ సినిమాను నిర్మించడం అందమైన అనుభూతి. హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టి అందరూ చేసిన మూవీ. సినిమాను తక్కువ టైంలో చాలెంజ్ తో చేశాం. ఇదే టీంతో మళ్లీ పనిచేయాలనుంది. రాజశేఖర్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. డైరెక్టర్ అని కన్నెగంటి దర్శకత్వంపై నమ్మకంతో ఈ సినిమాను ఆయనకు అప్పగించాం. ఆ నమ్మకం ఈ రోజు నిజమైనందుకు హ్యపీగా ఉంది. అలాగే సందీప్ తో ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ ఈ సినిమాకు కుదిరింది. తను ఫుల్ సపోర్ట్ చేశాడు. అనీషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం. తనకు మంచి పేరు వస్తుంది. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించాడు. రఘుకుంచె బెజవాడ సాంగ్ ను చక్కగా పాడారు. నా నెక్ట్స్ మూవీలో ఆయనకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇస్తాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
Anisha Ambroseglam gallery from the event
సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘’అందరూ మంచి మనసుతో చేసిన సినిమా ఇది, డెఫనెట్ గా హిట్ అవుతుంది. ఈ సినిమాకు వర్క్ చేయడం నాకు బెస్ట్ జర్నీ అవుతుంది. నన్ను నమ్మి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నిర్మాతలకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శకుడు అని కన్నెగంటి మాట్లాడుతూ ‘’గుమ్మడికాయ ఫంక్షన్ తో సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ షీల్డ్స్ ఇవ్వడం మంచి విషయం. సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. సందీప్, అనీషాలు చక్కగా యాక్ట్ చేశారు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఆడియెన్స్ కు నచ్చుతుంది. సినిమా బాగా వచ్చింది. 23న విడుదలవుతున్న ఈ సినిమాకు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సాయికార్తీక్ మాట్లాడుతూ ‘’గుమ్మడికాయ ఫంక్షన్ జరుపుకోవడం హ్యపీగా ఉంది. సినిమా బాగా వచ్చింది. రఘుకుంచెగారు బెజవాడ సాంగ్ ను బాగా పాడారు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సపోర్ట్ చేసిన యూనిట్ మెంబర్స్ కు థాంక్స్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాశీవిశ్వనాథ్, అనీషా అంబ్రోస్ సహా చిత్రయూనిట్ సభ్యులు పాల్గొని షీల్డ్స్ అందుకున్నారు.