pizza
Marala Telupana Priya team participate in Haritha Haaram
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 August 2016
Hyderaba
d

ప్రిన్స్‌, వ్యోమనంది, పూజా రామచంద్రన్‌ లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం 'మర‌ల తెలుపనా ప్రియా`. ఈ చిత్రం ఆగస్ట్ 5 న విడుదలకు సిద్ధమైంది. చిత్ర విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ రామానాయుడు స్టూడియో లో హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించి తమ చేతుల మీదుగా మొక్కలు నాటారు.

అనంతరం దర్శకురాలు వాణి.యం.కొస‌రాజు మాట్లాడుతూ... మా సినిమా 'మర‌ల తెలుపనా ప్రియా` ఆగస్ట్ 5 న విడుదల సందర్భాన్ని పురస్కరించుకుని హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాకు ఇది మంచి జ్ఞాపకం గా మిగులుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా వారికి, మా చిత్ర యూనిట్ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమా గురించి చెప్పాలంటే.. ఇది స్వచ్చమైన ప్రేమకథ. ఇది ఓ విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రం. భిన్న‌మైన వ్య‌క్తిత్వాలు నేప‌ధ్యాలున్న అమ్మాయి, అబ్బాయిల మ‌ద్య సాగే ప్రేమ‌కథ ఇది. ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారని అనుకుంటున్నారు. స్త్రీ అయిన నాకే అది నచ్చలేదు. స్త్రీ, పురుషులెవరైనా ప్రేమ స్వచ్చంగానే ఉండాలి. అవసరమైతే ప్రేమ కోసం అమ్మాయిలు కూడా త్యాగాలు చేస్తారు. ఈ విషయాన్నే నేను సినిమాగా చూపిస్తున్నాను. శేఖర్ చంద్రగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమా బాగా వచ్చింది. ఆగస్ట్ 5 న సినిమాను చూసి ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.. అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో ప్రిన్స్, హీరోయిన్ వ్యోమనంది, నిర్మాత కె. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రిన్స్‌, వ్యోమనంది, పూజా రామచంద్రన్‌, సుజో మ్యాథ్యూ, సమీర్‌, సన, రవివర్మ, పావనీ రెడ్డి, ఈ రోజుల్లో ఫేమ్‌ సాయి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, ఆర్ట్‌: పి.యస్‌. వర్మ, ఫైట్స్‌: సతీష్‌, కెమెరా: ఎస్‌. రాజశేఖర్‌, ఎడిటర్‌: మార్తాండ్‌. కె. వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కె. సురేష్‌బాబు, శ్రీనివాస్‌ వుడిగ, నిర్మాణం: శ్రీ చైత్ర చలన చిత్ర, కథ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్‌-దర్శకత్వం: వాణి. ఎమ్‌. కొసరాజు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved