pizza
'Indrani' is a visual feast with a logical, layered superwoman story: Makers at Trailer launch event
ఘ‌నంగా సూప‌ర్ ఉమెన్ మూవీ ఇంద్రాణి ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లు
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 February 2024
Hyderabad

Yaniya Bharadwaj and Kabir Duhan Singh are playing the lead roles in Indrani, which has been made in Telugu, Tamil, Hindi, Kannada and Malayalam languages with cutting-edge technical standards and an innovative time travel concept. The film will be released in theatres on April 5.

Stephen Pallam is making his debut as a director with this visual spectacle. Stanley Suman Babu is producing the movie under the banner of Veronica Entertainments. Sudheer Velpula, KK Reddy, and Jayson are its co-producers. Sai Kartheek is the music director. Shataf Figar, Ankitha, Franita, Garima Kaushal, Pratap Singh, Ajay, Saptagiri and others are playing other important roles. After getting a good response to the already-released teaser, the trailer for this superhero movie was unveiled at a grand event at the Park Hyatt Hotel in Hyderabad on Saturday. Melody Brahma Manisharma and famous producer Anil Sunkara were present as chief guests for this program.

Speaking on the occasion, Melody Brahma Manisharma said that the Trailer for 'Indrani' is very good. He wished the director of the film, besides wishing composer Sai Kartheek all the best.

Popular producer Anil Sunkara said, "All the best to KK Reddy and his friends, who produced a movie even while being residents of America. I know how difficult it is to stay there and make a movie. It is not possible unless there is a great passion for cinema. I am proud to say that they are my friends. The title Indrani itself has creativity embedded in it. It is a combination of India and Rani. Seeing the poster of this movie, I can say that the director has a vision. The trailer is very grand. The hard work and budget are visible in the output. I wish this April 5th release a grand success."

Stanley Pallam said, "Thanks to KK Reddy for helping to organize such a big event within a short time. My brother Stephen told me this story at the time of the COVID-19 pandemic. After that, we produced the film with the help of our well-wishers. After completing the shooting, he struggled for a year just for the VFX work. It is very difficult to imagine and predict what will happen in the climax of this movie. It is such a wonderful story. Everyone liked the trailer. All the credit goes to our brother Stephen for the success of this movie. Sai Kartheek gave good songs in single sittings. Thanks to everyone who helped us in the production of this film."

Stephen Pallam said, "I didn't set out to do a superhero movie. The plot I had developed demanded a superhero. The logical plot with an understanding of the current geopolitical situation demanded a big scale. The trailer itself is nearly four minutes long. This is the longest in Indian cinema. The film's running time is also long at nearly two hours 47 minutes. Time machine, futuristic sci-fi, robotics and a lot of other elements are infused in the film. The animation and VFX had to be so specific. Technology-based superhero movies are a risky genre. Time machines and robots are important in the movie. This movie will entertain the audience for sure. We have shown how advanced India will be in 50 years. This movie will be very inspiring for the youth."

Sai Kartheek said, "Looking at the trailer of Indrani, I am convinced that it is a visual feast. I am going to compose a groovy background score. Like the Superman movie, this is a Superwoman movie that is like the Avengers franchise. I want this movie to be a big hit."

Co-producer KK Reddy said, "Stephen took a great responsibility in making this movie. A superwoman movie trailer is liked by all of you. The movie will surely be liked by all of you. The responsibility of promoting this movie is in the media. We are very happy that Anil Sunkara garu, who first came from America and made films here and achieved success, is here today to support us by attending this event."

Actor Shataf said, "Heartfelt thanks to Stephen and Stanley who made all our dreams come true today. I am proud to be a part of such an epic movie. Sai Kartheek's music is amazing. Yaniya has worked very hard for this film. I want this movie to be a big hit.''

Actress Ankita said, "Thanks to the director and producers for giving us this opportunity. We have worked hard for this film. I want the film to become a big hit and bring a good name to all our team."

ఘ‌నంగా సూప‌ర్ ఉమెన్ మూవీ ఇంద్రాణి ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లు

యానీయా భరద్వాజ్, క‌బీర్ దుహాన్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం ఇంద్రాణి. అత్యాదునిక సాంకేత‌క ప్ర‌మాణాల‌తో, వినూత్న‌భ‌రిత‌మైన టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా స్టెఫన్ పల్లం ద‌ర్శ‌కుడిగా పరిచ‌య మ‌వుతుండ‌గా వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో సుధీర్ వేల్పుల, KK రెడ్డి, జైసన్ సహా నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫ్రనయిత జిజిన, గరీమా కౌశల్, ప్రతాప్ సింగ్, అజ‌య్‌, స‌ప్త‌గిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌, ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో...

మెలోడిబ్రహ్మ మ‌ణిశ‌ర్మ మాట్లాడుతూ - ``ఇంద్రాణి ట్రైల‌ర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ టు సాయి కార్తిక్. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ `` అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ - `అమెరికాలో ఉంటూ కూడా ఇక్క‌డ మూవీ నిర్మించిన కేకే రెడ్డి గారికి వారి మిత్రుల‌కి ఆల్ ది బెస్ట్‌..అక్క‌డ ఉండి సినిమా నిర్మించ‌డం ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు. సినిమా మీద ప్యాష‌న్ ఉంటే త‌ప్ప అది సాధ్యం కాదు..వారు నా మిత్రులు అని చెప్పుకోవ‌డానికి నేనే గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఇంద్రాణి పేరులోనే క్రియేటివిటీ ఉంది. పోస్ట‌ర్ చూడ‌గానే డైరెక్టర్ విజ‌న్ అర్ధ‌మైంది. ట్రైల‌ర్ చాలా గ్రాండ్‌గా ఉంది. వారి క‌ష్టం, ఖ‌ర్చు రెండు క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నారు. వారికి మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను`అన్నారు.

స్టాన్లీ ప‌ల్లం మాట్లాడుతూ - `మూడు రోజుల్లోనే ఇంత పెద్ద ఈవెంట్ జ‌ర‌గ‌డానికి స‌హాయ‌ప‌డ్డ కేకే రెడ్డి గారికి థ్యాంక్స్‌..ఇలా ఈవెంట్ ఉంది చెప్ప‌గానే మొత్తం అమెరికానే ఇక్క‌డ దింపేశారు. నా బ్ర‌ద‌ర్ స్టీఫెన్ ఈ క‌థ‌ని నాకు కోవిడ్ టైమ్‌లో చెప్పాడు. ఆ త‌ర్వాత మా శ్రేయోభిలాషుల‌ స‌హాయంతో మేమే సినిమా నిర్మించాం. షూటింగ్ పూర్తి చేసిన త‌ర్వాత కేవ‌లం వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కోసం ఏడాది క‌ష్ట ప‌డ్డాడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఏం జ‌ర‌గ‌బోతుంది అనేది ఊహించ‌డం చాలా క‌ష్టం. అంత అద్భుత‌మైన క‌థ‌. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చింది. ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చిందంటే ఆ క్రెడిట్ అంతా మా బ్ర‌ద‌ర్ స్టీఫెన్‌కే చెల్లుతుంది. సాయి కార్తిక్ సింగిల్ సిట్టింగ్స్‌లోనే మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా నిర్మాణంలో మాకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌` అన్నారు.

స్టీఫెన్ ప‌ల్లం మాట్లాడుతూ - `ఈ క‌థ అనుకున్నప్పుడే పెద్ద‌గా చేద్దాం అనుకున్నాను. మీరు ట్రైల‌ర్ చూస్తే ఇదే అత్యంత ఎక్కువ నిడివిగ‌ల ట్రైల‌ర్‌.. అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో కూడిన మంచి సైన్స్‌ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమా రెండుగంట‌ల న‌ల‌బై నిమిషాల పాటు ఒక విజువ‌ల్ వండ‌ర్‌గా ఉంటుంది. టైమ్ మెషిన్‌, రోబో ఇలా ప్ర‌తీది సినిమాలో కీల‌కంగా ఉంటుంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్టైన్ చేస్తుంది. రాబోయో 50 సంవ‌త్సరాల్లో ఇండియా ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉండ‌నుంది అనేది ఈ సినిమాలో చూపించాం. ఈ మూవీ యువత‌రానికి చాలా స్పూర్తి దాయ‌కంగా ఉంటుంది` అన్నారు.

సాయి కార్తిక్ మాట్లాడుతూ - `` ఇంద్రాణి ట్రైల‌ర్ చూస్తుంటే మేక‌ర్స్ క‌ష్టం క‌నిపిస్తుంది. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం రెడీ అవుతున్నాను. సూప‌ర్‌మేన్ మూవీ లాగా సూపర్ ఉమెన్ మూవీ ఇది, మొత్తం ఎవెంజ‌ర్స్ టీమ్‌ని దింపారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను``అన్నారు.

కో ప్రొడ్యూస‌ర్ కెకె రెడ్డి మాట్లాడుతూ - `స్టీఫెన్ గారు ఒక గొప్ప భాద్య‌త తీసుకుని ఈ సినిమాని నిర్మించ‌డం జ‌రిగింది. ఒక సూప‌ర్ ఉమెన్ మూవీ ట్రైల‌ర్ మీ అంద‌రికీ న‌చ్చింది..సినిమా కూడా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది. ఇక ఈ సినిమాని ప్రోత్స‌హించే భాద్య‌త మీడియా వారి మీద ఉంది. మొద‌టగా అమెరికా నుండి వ‌చ్చి ఇక్క‌డ సినిమాలు తీసి స‌క్సెస్ సాధించిన అనీల్ సుంక‌ర‌గారు ఈ రోజు ఇక్క‌డికి రావ‌డం చాలా సంతోషంగా ఉంది` అన్నారు.

న‌టుడు శ‌తాఫ్ మాట్లాడుతూ - `ఈ రోజు మా అంద‌రి క‌ల నెర‌వేర‌డానికి కార‌ణ‌మైన స్టీఫెన్‌,స్టాన్లీకి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.. ఇలాంటి ఒక ఎపిక్ మూవీలో భాగం అయినందుకు గ‌ర్వంగా ఉంది. సాయి కార్తిక్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. యానియా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను` అన్నారు.

న‌టి అంకిత మాట్లాడుతూ - `` ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌నికి థ్యాంక్స్‌..ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం...సినిమా పెద్ద హిట్ అయ్యి మా టీమ్ అంద‌రికీ మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సాంకేతిక వ‌ర్గం:
రచన, దర్శకత్వం, నిర్మాత - స్టీఫెన్ పల్లం
సహ నిర్మాతలు – సుధీర్ వేల్పుల, KK రెడ్డి,జైసన్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్ – స్టాన్లీ పల్లం
ఛాయాగ్రహణం - చరణ్ మాధవనేని
ఎడిటింగ్‌ - రవి తేజ కుర్మాణ
ఆర్ట్ డైరెక్టర్ - రవి కుమార్ గుర్రం
యాక్షన్ డైరెక్టర్ – ప్రేమ్ సన్
కో – డైరెక్టర్ - సాయి త్రివేధి
డి.టి.యస్ మిక్సింగ్ – దేవి కృష్ణ కడియాల
సౌండ్ డిజైన్ - జి. పురుషోత్తం రాజు

Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved