
16 August 026
Hyderabad
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నాగచైతన్య దంపతులు, గోపీచంద్, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీకాంత్, నటి జయప్రద, దర్శకులు కె రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, నిర్మాతలు అల్లు అరవింద్, నాగవంశీ, అనిల్ సుంకర, శిరీష్, సాహు గారపాటి తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.





