pizza
Kumari 21F First Look Poster Launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 September 2015
Hyderabad

`కుమారి 21ఎఫ్‌` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌

సుకుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎ.ఎమోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై రూపొందుతున్న సినిమా `కుమారి21ఎఫ్‌`. రాజ్ త‌రుణ్‌, హీబా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. విజ‌య్ ప్ర‌సాద్ బండ్రెడ్డి, థామ‌స్ రెడ్డి అదూరి నిర్మాత‌లు. ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు క‌లిసి ఫ‌స్ట్ లుక్ ను లాంచ్ చేశారు.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``సినిమా పూర్త‌యింది. త‌రుణ్‌, హీబా చాలా చ‌క్క‌గా న‌టించారు. యూత్‌ఫుల్ సినిమా ఇది. అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చుతుంది`` అని అన్నారు.
ర‌త్న‌వేలు మాట్లాడుతూ ``ఇది డిఫ‌రెంట్ క‌థ. ప్ర‌తి సీనూ కొత్త‌గా ఉంటుంది. సుకుమార్ స్టైల్లో ఉంటుంది సినిమా. త్వ‌ర‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతంలో సింగిల్ విడుద‌ల చేస్తాం. ఆడియో, వీడియో క‌లిపిన సింగిల్‌ను విడుద‌ల చేస్తాం. రాజ్ త‌రుణ్ నేచుర‌ల్ పెర్ఫార్మ‌ర్‌. నేచుర‌ల్‌గా న‌టించాడు. అక్టోబ‌ర్ 0న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అని చెప్పారు.
దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``సుకుమార్ స‌బ్జెక్ట్ ఎలా ఉంటుందో అంద‌రికీ తెలుసు. డిఫ‌రెంట్ సినిమా. ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది. యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందింది. రాజ్‌-హీబా చ‌క్క‌గా న‌టించారు. ర‌త్న‌వేలు బెస్ట్ డీఓపీ ఇచ్చారు. విజువ‌ల్‌గా రిచ్‌గా ఉంటుంది. ర‌త్న‌వేలుకి నేను పెద్ద ఫ్యాన్‌. యూత్‌ఫుల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ కంటత‌డి పెట్టిస్తుంది. మంచి మెసేజ్ ఉన్న సినిమా. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ జ‌రుగుతోంది`` అని అన్నారు.
నిర్మాత‌లు మాట్లాడుతూ ``సుక్కు ఏడాది క‌ష్ట‌ప‌డి స్క్రిప్ట్ బాగా చేశాడు. ద‌ర్శ‌కుడు మంచి ఔట్‌పుట్ ఇచ్చాడు. ర‌త్న‌వేలు, దేవిశ్రీ ప్ర‌సాద్‌ల ప‌నితీరు గురించి చెప్పేటంత వాడిని కాఉ. త‌రుణ్ బాగా న‌టించాడు. హీరోయిన్ పాత్రకు త‌గ్గ‌ట్టు బాగా చేసింది`` అని తెలిపారు.
రాజ్‌త‌రుణ్ మాట్లాడుతూ ``ర‌త్న‌వేలు, దేవిశ్రీ ప్ర‌సాద్‌, సుకుమార్ తో క‌లిసి చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. యూత్‌ఫుల్ మెసేజ్ సినిమా ఇది. డిఫ‌రెంట్‌గా ఉంటుంది`` అని తెలిపారు.
హీరోయిన్ మాట్లాడుతూ ``ఈ సినిమాకు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
ఈ కార్య‌క్ర‌మంలో రామ‌చంద్ర‌సింగ్ కూడా పాల్గొన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved