pizza
Sundeep Kishan launches 36 Drive Inn Street
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 December 2015
Hyderabad

36 Drive In is a new hangout place in Hyderabad, You can get your desired recipe in budget. Popular Actor Sundeep Kishan launched this new drive-in restaurant. Allu Sirish, Naveen Chandra and Deeksha Panth also made their presence on this occasion. It is completely a family Restaurant available for all 24/7.

Twelve unique food brands were been introduced in this new restaurant. Along with main course like Biryani and Pulao you can get Chinese dishes, italian dishes, Milk Shakes with Ice-cream, variety of tiffin, Kebabs, Fish chips, Coffee and Kinova rice.

Raghu, MS Varma, Arjun and Koushik together launched this innovative drive-in street restaurant.​

36 డ్రైవింగ్ స్ట్రీట్ ని లాంచ్ చేసిన హీరో సందీప్ కిషన్

ప్రపంచ ప్రసిద్ది గాంచిన కాస్మో పాలిటన్ సిటీ హైదరాబాద్ కు సరికొత్త రుచులను పరిచయం చేస్తూ ,సరళమైన ధరలకే ఆ వంటకాలను అందిస్తూ నగర చరిత్రలో మరో కలికితురాయిగా అవతరించింది ''36 డ్రైవింగ్ స్ట్రీట్ ''. ఉత్సాహం ఉరకలు వేసే నవ యువకుల సారధ్యంలో నగర యువత కు చక్కని ఆహ్లాద కరమైన వాతావరణాన్ని ,సరైన ప్లేస్ మెంట్ ని అందించడమే కాకుండా విభిన్న రుచులను అతి తక్కువ బడ్జెట్ లో అందిస్తూ అందరి మన్ననలను ముఖ్యంగా యువత ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది ''36 డ్రైవింగ్ స్ట్రీట్ . నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది .

ఈ ప్రారంభోత్సవానికి హీరోలు సందీప్ కిషన్ ,అల్లు శిరీష్ , నవీన్ చంద్ర ,హీరోయిన్ దీక్షా పంత్ లు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు అందజేసారు .

ఈ సందర్భంగా నిర్వాహకులు అర్జున్ , కౌశిక్ మాట్లాడుతూ '' మా దగ్గర 12 రకాల బ్రాండ్ లున్నాయి , కోస్తా రుచులు , హైదరాబాదీ దమ్ బిర్యానీ లతో పాటు హైదరాబాద్ లో లేని సరికొత్త రుచులను అందిస్తున్నాం ,అంతేకాదు హైదరాబాద్ లో ఉన్న వాటిలో ఉన్న లోటు పాట్లు ఏంటి ? వాటిని ఎలా ఓవర్ కం చేయాలో అన్ని రకాలుగా ప్లాన్ చేసి హైదరాబాద్ లో లేని సరికొత్త రుచులను అన్నీ మేమే అందిస్తున్నాం పైగా డిఫరెంట్ టేస్ట్ లను అందిస్తున్నాం . ఏషియాలో ది బెస్ట్ అందిస్తున్నాం , ఫిష్ లో డిఫరెంట్ ఐటమ్స్ అందిస్తున్నాం అలాగే వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ అందిస్తున్నాం ఎందుకంటే హెల్త్ విషయంలో వైట్ రైస్ అన్ హెల్తి కాబట్టి బ్రౌన్ రైస్ ని అందిస్తున్నాం ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది . అలాగే మా స్టాల్ లో ఏ ఐటెం అయినా 250 కు మించి ధర లేకపోవడంతో ఇది అందరికీ బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడానికి ఇష్టపడతారు . మా కాన్సెప్ట్ అదే కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసాం . తప్పకుండా మా 36 డ్రైవింగ్ స్ట్రీట్ అందరి మెప్పు పొందుతుందని ఆశిస్తున్నామని అన్నారు .

 




Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved