క్యాన్సర్ బాధితులను ఆదుకునెందుకు, క్యాన్సర్ వ్యాధిపై ప్రజలలో అవగాహన పెంచెందుకు ప్రముఖ నటి గౌతమి లైఫ్ ఎగైన్ పెరుతో ఓ సోషల్ ఆర్గనెజైషన్ ను ప్రారంభించారు.. హైమా రెడ్డి మరియు మద్రాస్ టాకీస్ సహ నిర్మాత మాల ఈ సంస్థకు కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు.. కాగా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ను గౌతమి ప్రారంభించారు.. ఈ సందర్బంగా గౌతమి మాట్లాడుతూ.. నేను క్యాన్సర్ వ్యాధి తో పోరాడి గెలిచాను..
క్యాన్సర్ వ్యాధితో ప్రతి యేటా కోట్ల సంఖ్యలో ప్రజలు మృత్యవ్యాత పడుతున్నారు.. వారిలో కొందరినైనా కాపాడేందుకు, మరింతమందిలో క్యాన్సర్ వ్యాధి రాకుండా ఏ జాగ్రత్తలు పాటించాలి. ఒక వేళ వ్యాధి కి గురయితే ఏ విధమైన చికిత్సలు పొందాలనె దాని పై అవహాగాన తెవాలన్న సంకల్పంతో ఈ ఫౌండేషన్ ను ప్రారంభించాము.నాకు తోడుగా మాల మరియు హైమా రెడ్డి ఈ ఫౌండేషన్ ను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లేందుకు సపోర్ట్ చెస్తున్నారు. క్యాన్సర్ తో పాటు ఇతర ప్రమాద కరమైన వ్యాధుల పై కూడా మా ఫౌండేషన్ ద్వారా అవగాహన కల్పిస్తామను గౌతమి తెలిపారు.
లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ చెస్తోన్న ఈ క్యాంపెన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సేవకు ముందికొచ్చిన గౌతమి మరియు మాల , హైమా రెడ్డి ల కృషి విజయవంత మవ్వాలని విచ్చెసిన అతిథులు మనోజ్ నందం, రాహుల్, సుధాకర్ లు ఆకాంక్షించారు..