
8 September 2025
Hyderabad
The film Little Hearts, starring Mouli Tanuj and Shivani Nagaram as the lead pair, was recently released and has become a massive success. The movie was directed by Sai Marthand under the ETV Win Original Productions banner, with Aditya Hasan as the producer. It was brilliantly promoted and distributed worldwide on a grand theatrical scale by Bunny Vas through BV Works and Vamsi Nandipati through Vamsi Nandipati Entertainments.
The team held a Thanks Meet today in Hyderabad, where cast and crew expressed their gratitude and shared their joy over the film’s success. Actor Nikhil said, "I played Mouli’s friend in the movie, and the audience is giving a great response to my character. I thank everyone who made this film a big hit. I’m also a friend of music director Sinjith, and we always wanted to work together. Little Hearts gave us that opportunity"
Actor Hari said, "I played the role of Kishore in the film, and I thank director Sai Marthand for giving me the opportunity. The character had good importance in the story, and I’m getting a lot of recognition. Everyone in the team became like close friends."
Actress Padmini said, "I appeared as Anjali in this film. I had auditioned for many films earlier but often never got any clear feedback. After auditioning for Little Hearts, director Marthand immediately confirmed me for the role. Getting this role made me very happy."
Actor Jai krishna said, "In my first audition for Mouli’s friend Madhu, I couldn’t make much of an impression. But after performing a few more scenes, the director finalized me. People from ETV Win like Sai Krishna and Nithin told me I’d gain a good name after this film, and that’s coming true."
Actress Shivani Nagaram said, "Along with the media, meme creators also promoted our film strongly. Some people said they watched it two to three times, which makes us really happy. As we said before release, the film is connecting well with both youth and family audiences. I thank director Marthand for trusting me with the role of Katyayani. We shot the film in just 35 days. Many people don’t believe this was made by a debut director—it’s that well-executed. Our support system was ETV Win’s Sai Krishna and Nithin, and distributors Vamsi Nandipati and Bunny Vass."
Director Sai Marthand said, "Mouli attracted audiences from the very first premieres. He was a star for this film even before its release. Initially, I wanted to make this as a web series, but Sai Krishna, Nithin, and Aditya Hasan from ETV Win supported it as a theatrical project. I had doubts during the making - sometimes I lost confidence and wondered if people would come to theatres. But our producers backed us at every step. They believed in me and left it in my hands, saying the director knows best. Bunny Vass and Vamsi Nandipati gave us a grand release. Bunny Vass followed the film's performance daily and kept updating us with collections and audience feedback, which was very motivating."
Lead actor Mouli Tanuj said, The audience gave us more success than we imagined. Right from the premieres, the response was strong. On Day 1, we earned 2.5 crore rupees - more than our film’s total budget. The film continues to perform week after week. Our director Sai made a movie that connects with everyone. Everywhere I go, the feedback is positive. Bandla Ganesh and Ravi Teja personally called me. Ravi Teja said the film reminded him of his early career. My favorite actor Nani even tweeted about it. I feel like I’m on cloud nine. Moving forward, I’ll only do films that audiences love and that bring profits to producers."
ETV Win Content Head Nithin said, "I had mentioned during the teaser launch that this film would be a big hit like Nuvve Kavali. Some people thought I was exaggerating, but now they’re the ones praising Little Hearts. Once every decade, a film with fresh content comes along. Little Hearts is one such film that’s capturing the audience's hearts."
ETV Win Head Sai Krishna said, "Little Hearts has once again proven that audiences always support good content. We can’t forget the support the media gave us. Whether it was with 90 Middle-Class Biopic or now with Little Hearts, some people discouraged us, wondering if such films would attract theatre-goers. But the film’s success itself is the answer. It gave us the courage to continue making such meaningful content."
Producer-distributor Vamsi Nandipati said, "The happiness that audiences are sharing with us about Little Hearts is very satisfying. Personally, I wouldn’t have even listened to this kind of story for 15 minutes. But this is a film that thrives on its emotional moments. I appreciate Sai Krishna and Nithin from ETV Win for believing in this story. Usually, we think about working with known heroes, but Sai Krishna wanted to make a hero out of someone new. That’s how Mouli came to the forefront. Director Sai Marthand showed his talent with fresh, close-up-driven scenes. Mouli is destined to reach great heights. His performance won everyone’s hearts. I also hope Shivani gets more opportunities. Aditya Hasan found great success as a debut producer. It was a pleasure to distribute this film along with Bunny Vas."
Producer-distributor Bunny Vass said, "We always believed that audiences will support films with strong content. That belief led us to make Little Hearts. Today, that belief is proven right. Viewers are receiving the film with open hearts. Even Aravind Garu watched and appreciated the film. Every rupee this movie earns feels like a crore to me because it’s the first film released under my BV Works banner. Bunny Garu always advises me to prepare a young team, and I found that in Little Hearts. From the moment I saw it, I felt confident about its success. The confidence this film has given me will push me to do more films. Vamsi Nandipati took care of promotions and release with great attention. Audiences are cheering Mouli in theatres. He reached this level of popularity through social media. It’s a highlight that his debut film earned such strong collections. Mouli is an example that anyone - regardless of background - can make a name in the industry. Even if we don’t work together immediately, I definitely want to do another film with director Sai someday. I’ll never forget the support ETV Win has given. I’ll always remain grateful to Bunny Garu and Allu Aravind Garu for giving me this opportunity.”
Cast:
Mouli Tanuj, Shivani Nagaram, Rajeev Kanakala, S. S. Kanchi, Anitha Chowdary, Satya Krishnan, and others
Technical Crew:
Direction & Writing – Sai Marthand
Producer – Aditya Hasan
PRO – GSK Media (Suresh & Sreenivas)
Music – Sinjith Yerramilli
Cinematography – Surya Balaji
Editor – Sridhar Sompalli
Art Director – Divya Pavan
Executive Producers – Vinod Nagula, Murali Punna
Distribution – Bunny Vas, Vamsi Nandipati
Distribution Banners – BV Works, Vamsi Nandipati Entertainments
మరిన్ని మంచి చిత్రాలు చేసే ధైర్యాన్ని "లిటిల్ హార్ట్స్" విజయం మా అందరికీ ఇచ్చింది - థ్యాంక్స్ మీట్ లో నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ బన్నీవాస్
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా థ్యాంక్స్ మీట్ ను ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
నటుడు నిఖిల్ మాట్లాడుతూ - ఈ చిత్రంలో మౌళి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాను. నా క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మా మూవీని పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. నేను మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఫ్రెండ్స్. మేము కలిసి సినిమా చేయాలని అనుకునేవాళ్లం. "లిటిల్ హార్ట్స్"తో కలిసి వర్క్ చేశాం. అన్నారు.
నటుడు హరి మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్"లో కిషోర్ అనే క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సాయి మార్తాండ్ కు థ్యాంక్స్. కిషోర్ క్యారెక్టర్ కు కథలో ఇంపార్టెన్స్ ఇచ్చారు. నాకు మంచి గుర్తింపు వస్తోంది. ఈ టీమ్ లోని వారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అన్నారు.
నటి పద్మినీ మాట్లాడుతూ - ఈ చిత్రంలో అంజలిగా మీ ముందుకు వచ్చాను. నేను గతంలో అనేక చిత్రాలకు ఆడిషన్స్ ఇచ్చాను. కానీ చాలాసార్లు రిజల్ట్ ఏంటనేది చెప్పేవారు కాదు. కానీ "లిటిల్ హార్ట్స్"కు ఆడిషన్ ఇచ్చాక అంజలి పాత్రకు తీసుకుంటున్నామని డైరెక్టర్ మార్తాండ్ వెంటనే చెప్పాడు. ఈ రోల్ నాకు దక్కడం సంతోషాన్నిచ్చింది. అన్నారు.
నటుడు జయకృష్ణ మాట్లాడుతూ - ఫస్ట్ ఆడిషన్స్ లో నేను మౌళి ఫ్రెండ్ మధు క్యారెక్టర్ కోసం ఇంప్రెస్ చేయలేకపోయా. మరికొన్ని సీన్స్ చేశాక ఆ క్యారెక్టర్ కు నేనే కరెక్ట్ అని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు. "లిటిల్ హార్ట్స్" తర్వాత నీకు మంచి పేరొస్తుందని ఈటీవీ విన్ సాయికృష్ణ అన్న, నితిన్ అన్న చెప్పేవారు. వారు చెప్పినట్లే నాకు మంచి పేరు దక్కుతోంది. అన్నారు.
హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్" సినిమాను మిగతా మీడియాతో పాటు మీమర్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. మా సినిమాను ఒక్కొక్కరు రెండు మూడు సార్లు చూశామని చెబుతుండటం హ్యాపీగా ఉంది. రిలీజ్ ముందు మేము చెప్పినట్లే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతోంది. నేను కాత్యాయని క్యారెక్టర్ లో బాగుంటానని అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మార్తాండ్ కు థ్యాంక్స్. 35 డేస్ లోనే ఈ సినిమా షూట్ చేశాం. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ చేశారంటే చాలామంది నమ్మడం లేదు. మార్తాండ్ అంత బాగా రూపొందించాడు. మా సపోర్ట్ సిస్టమ్ ఈటీవీ విన్ సాయికృష్ణ, నితిన్. అలాగే డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ నందిపాటి, బన్నీవాస్ గారికి థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ - ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే ప్రేక్షకుల్ని రప్పించింది మౌళి. అతను ఈ సినిమా తర్వాత కాదు సినిమాకు ముందే స్టార్. "లిటిల్ హార్ట్స్" థియేట్రికల్ గా బాగుంటుందని ఫస్ట్ నమ్మింది మౌళి. నేను వెబ్ సిరీస్ లా చేయాలనుకున్నా. ఆ తర్వాత ఈటీవీ విన్ సాయి కృష్ణ, నితిన్, ఆదిత్య హాసన్ ఈ ప్రాజెక్ట్ గా సపోర్ట్ గా నిలబడ్డారు. సినిమా చేస్తున్నప్పుడు కొన్ని డౌట్స్ వచ్చేవి, కొన్నిసార్లు కాన్ఫిడెంట్ పోయేది. ఈ మూవీని థియేట్రికల్ గా చూస్తారా అనిపించేది. కానీ సింగర్స్ ను అడిగినా, సినిమా కోసం ఇంకేం అడిగినా మా ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేశారు. సినిమాకు ఏం కావాలో డైరెక్టర్ కు తెలుసు అని నాకు వదిలేశారు. బన్నీవాస్, వంశీ నందిపాటి గారు గ్రాండ్ గా రిలీజ్ చేశారు. బన్నీవాస్ గారు రోజూ మా మూవీని ఫాలో చేస్తూ ఎంత కలెక్షన్స్ ఏంటనేది చెబుతూ మమ్మల్ని సంతోషపెడుతున్నారు. అన్నారు.
హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ - మేము ఊహించినదానికంటే పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ప్రీమియర్స్ నుంచే ఆదరణ చూపించారు, మొదటి రోజే 2.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అది మా మూవీ బడ్జెట్ కంటే ఎక్కువ. ఒక్క వారం కాదు ఈ వారం వచ్చేవారం..అలా మా మూవీ ప్రదర్శితమవుతూనే ఉంటుంది. మా డైరెక్టర్ సాయి అందరికీ నచ్చే సినిమా చేశాడు. ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బండ్ల గణేష్ గారు, రవితేజ గారు కాల్ చేశారు. రవితేజ గారు ఫోన్ చేసి నేను మొదట్లో చేసిన సినిమాలు గుర్తొచ్చాయి అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. నా ఫేవరేట్ హీరో నాని గారు ట్వీట్ చేశారు. నేను ప్రస్తుతం గాల్లో ఉన్నా. అంత సంతోషంగా ఉంది. ఇకపైనా మీకు నచ్చే చిత్రాలే చేస్తాను, నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చే కంటెంట్ తోనే వస్తాను. అన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ - ఈ సినిమా టీజర్ లాంఛ్ లోనే చెప్పాను. ఇది నువ్వేకావాలి అంత పెద్ద హిట్ అవుతుందని. అప్పుడు నేను మూవీ గురించి ఎక్కువ చెప్పానని అనుకున్న వాళ్లే ఈ రోజు "లిటిల్ హార్ట్స్" సక్సెస్ చూసి ప్రశంసిస్తున్నారు. పదేళ్లకో కొత్త కంటెంట్ వస్తుంది. అలా ప్రేక్షకుల్ని "లిటిల్ హార్ట్స్" ఆకట్టుకుంటోంది. అన్నారు.
ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ - మంచి కంటెంట్ తో సినిమా చేస్తే తప్పకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు "లిటిల్ హార్ట్స్" సక్సెస్ తో మరోసారి ప్రూవ్ చేశారు. ఈ చిత్రానికి మీడియా ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. 90 మిడిల్ క్లాస్ బయోపిక్ తీసినప్పుడు గానీ "లిటిల్ హార్ట్స్" టైమ్ లో గానీ కొందరు నిరుత్సాహపరిచారు. ఈ కంటెంట్ ను థియేటర్స్ లో చూస్తారా అన్నారు. కానీ అలాంటి వారికి మా మూవీ సక్సెస్ ఆన్సర్ ఇచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్ చేసేందుకు ధైర్యాన్ని ఇచ్చింది. అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ - ప్రేక్షకులు "లిటిల్ హార్ట్స్" గురించి మాతో షేర్ చేసుకుంటున్న హ్యాపీనెస్ ఎంతో సంతృప్తినిస్తోంది. ఈ కథను నేనైతే పదిహేను నిమిషాలు కూడా వినలేను. మూవ్ మెంట్స్ మీద వెళ్లే చిత్రమిది. ఇలాంటి కథను నమ్మి సినిమా చేసిన ఈటీవీ విన్ సాయి కృష్ణ, నితిన్ ను అప్రిషియేట్ చేయాలి. మేము హీరోలతో వెళ్లాలని అనుకుంటాం, సాయి కృష్ణ హీరోను తయారుచేద్దామని అనేవాడు. అలా మౌళిని ఈ వేదిక మీద నిలబెట్టాడు. డైరెక్టర్ గా సాయి మార్తాండ్ తన ప్రతిభ చూపించాడు. క్లోజ్ షాట్స్ తో తను చేసిన సీన్స్ కొత్తగా ఉన్నాయి. మౌళి గొప్ప స్థాయికి వెళ్తాడు. తన పర్ ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. శివానీకి కూడా ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఆదిత్య హాసన్ తన తొలి చిత్రంతో నిర్మాతగా పెద్ద సక్సెస్ అందుకున్నాడు. బన్నీ వాస్ అన్నతో కలిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ - కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మే వాళ్లం మేమంతా. ప్రేక్షకుల మీదున్న ఆ నమ్మకంతోనే "లిటిల్ హార్ట్స్" చేశాం. ఈ రోజు మా అంచనా నిజమైంది. ప్రేక్షకులు "లిటిల్ హార్ట్స్" చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. అరవింద్ గారు కూడా మూవీ చూశారు. ఈ చిత్రంతో వచ్చే ప్రతి రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం. ఎందుకంటే నా బీవీ వర్క్స్ బ్యానర్ మీద రిలీజ్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. బన్నీ గారు యంగ్ టీమ్ ను ప్రిపేర్ చేసుకోండని చెబుతుంటారు. నాకు అలాంటి యంగ్ టీమ్ "లిటిల్ హార్ట్స్" రూపంలో దొరికింది. ఈ సినిమా చూస్తున్నప్పుడే గట్టి సక్సెస్ కొడుతున్నామనే ఫీల్ కలిగింది. ఈ సినిమా నాకు ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మరిన్ని చిత్రాలు చేస్తాను. మా వంశీ నందిపాటి ప్రమోషన్, రిలీజ్.. ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నాడు. మౌళిని స్క్రీన్ మీద చూస్తూ ప్రేక్షకులు ఈలలు వేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అంతగా రీచ్ అయ్యాడు మౌళి. తన తొలి చిత్రంతోనే ఇంత మంచి వసూళ్లు ఆయన సినిమాకు రావడం హైలైట్. బ్యాక్ గ్రౌండ్, ఉన్నా లేకున్నా ఎవరైనా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవచ్చు అనేందుకు మౌళి ఉదాహారణ. డైరెక్టర్ సాయి నాతో నెక్ట్స్ సినిమా కాకపోయినా ఎప్పుడైనా ఒక మూవీ చేయమని కోరుతున్నా. ఈటీవీ విన్ వారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. అలాగే నాకు లైఫ్ ఇచ్చిన బన్నీ గారికి, అల్లు అరవింద్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. అన్నారు.
నటీనటులు - మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, దర్శకత్వం - సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ - ఆదిత్య హాసన్
మ్యూజిక్ - సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ - సూర్య బాలాజీ
ఎడిటర్ - శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ - దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - వినోద్ నాగుల, మురళి పున్న
డిస్ట్రిబ్యూషన్ - బన్నీవాస్, వంశీ నందిపాటి
డిస్ట్రిబ్యూషన్ బ్యానర్స్ - బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్
