pizza
Dr. Saleem logo launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 December 2014
Hyderabad

విజయ్ ఆంటోని హీరోగా ఎస్.కె. పిక్చర్స్ 'డాక్టర్ సలీమ్' లోగో విడుదల

ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై ఇప్పటివరకు పది విజయవంతమైన చిత్రాలను అందించిన సురేష్ కొండేటి ఇప్పుడు మరో సూపర్ హిట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని, అక్ష పార్థసాని జంటగా నటించిన 'సలీమ్' చిత్రాన్ని ఆయన విడుదల చేయనున్నారు. ఎస్.కె. పిక్చర్స్, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి విడుదల చేయనున్న ఈ చిత్రానికి 'డాక్టర్ సలీమ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సురేష్ కొండేటి, తమటం కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం లోగో ఆవిష్కరణ, టైటిల్ ప్రకటన ఆదివారం వియవాడలో జరిగింది. హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్థం అక్కడ జరిగిన స్టార్ క్రికెట్ మ్యాచ్ లో విరామ సమయంలో 'డాక్టర్ సలీమ్' వేడుక జరిగింది. ఈ చిత్రం టైటిల్ ను కథానాయిక రెజీనా ప్రకటించగా, లోగోను శ్రీకాంత్, అల్లరి నరేశ్, తరుణ్.. ఇలా హీరోలందరూ విడుదల చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ - "నా 'మహాత్మ' చిత్రానికి విజయ్ ఆంటోని పాటలందించారు. ఆ చిత్రవిజయానికి పాటలు కూడా ఓ కారణం. ఇప్పుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన 'డాక్టర్ సలీమ్ ' లోగోను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

'అల్లరి' నరేష్ మాట్లాడుతూ - "ఎస్.కె. పిక్చర్స్ ద్వారా సురేష్ పలు విజయవంతమైన చిత్రాలు అందించారు. మళ్లీ ఓ మంచి సినిమా ఇవ్వబోతున్నారు'' అని చెప్పారు.

రెజీనా మాట్లాడుతూ - ''ఈ చిత్రం లోగో చాలా బాగుంది. ఇది మంచి సినిమా కూడా. హిట్ అవుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

గౌరీ ముంజల్ మాట్లాడుతూ - ''సురేష్ కొండేటి గత చిత్రాలు విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

కామ్నా జఠ్మలానీ మాట్లాడుతూ - ''సురేష్ కొండేటి ప్రతి ఏడాది సంతోషం అవార్డ్స్ ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. వాటిలో నేను కూడా పాల్గొన్నాను. సురేష్ అందించే చిత్రాలు కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి. అవన్నీ హిట్ అయినట్లుగానే ఈ చిత్రం కూడా హిట్ కావాలని ఆశిస్తున్నాను'' అని తెలిపారు.

సంజనా మాట్లాడుతూ - ''సురేష్ ని నా సొంత అన్నయ్యలా భావిస్తాను. ఈ సినిమా టైటిల్ బాగుంది. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ - "ఇదొక మంచి యాక్షన్ థ్రిల్లర్. ఇందులో హీరోగా నటించడంతో పాటు విజయ్ ఆంటోని పాటలు కూడా స్వరపరిచారు. ఐదు పాటలూ సందర్భానుసారంగా సాగుతాయి. విజయ్ ఆంటోని చేసిన ఫైట్స్ థ్రిల్ కి గురి చేస్తాయి. మా సంస్థ నుంచి వచ్చిన గత చిత్రాల విజయానికి ఏమాత్రం తగ్గని రీతితో ఈ చిత్రం ఉంటుంది'' అని తెలిపారు.

 

Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved