Director P. Suneel Kumar Reddy who made several successful films in Telugu is coming up with his latest film 'Gulf'. This movie is getting ready for release soon. Director Sukumar has unveiled the logo of 'Gulf'.
Sukumar: I got acquaintance with Suneel Kumar Reddy garu from 'Oka Romantic Crime Katha'. I watched his 'Gangaputrulu' later.
I was shocked after watching the film 'Oka Romantic Crime Katha'. I felt that the film was fresh. I have mentioned the same in another interview also. Making such a film in Telugu and achieving success is completely a new thing. It is one of the very few new stories in Telugu. From then onwards, my affection has increased towards him. Even though I don't watch all his films.. I follow what kind of films he is doing. I have asked him once that whether he is remaking 'Oka Romantic Crime Katha' into Hindi. I thought of remaking it into Hindi if he is not doing the remake. What I liked most in him is.. he takes a point.. he does thorough research on the film.. completely understands the issue and then makes the film. We all go with the flow..he makes the film after thorough research, that is the real film making. That process gives huge satisfaction. Similarly Suneel garu has done so much research on the 25 lakh Telugu people living in Gulf.. and made the movie. He went there..met them and researched about their living conditions. Not only that.. 40% people of our village went to Gulf. They send money to the family members to support them financially. There are five such families around our home. Suneel garu made a good movie with this kind of concept. I wish that this film should become a big hit. I request all the Telugu people in Gulf should promote this film as 'Gulf' is based on their lives. Pulagam Chinnarayana is my long time friend. He is a journalist and he has been writing books. It's not difficult for a book author to pen dialogues. I've told him the same. He has penned dialogues for this film.
'Gulf' Director Suneel Kumar Reddy: I thank my friend and well wisher Sukumar garu for unveiling the logo of our film 'Gulf'. This is a research based film on the Gulf life. A beautiful love story.. social issues around the love story.. are told in an entertaining manner to create awareness. Gulf is getting ready for release soon.
'Gulf' Producer Ravindra Babu: I thank Sukumar garu for unveiling the logo of Gulf. This is fourteenth film of Suneel garu in the Sravya Films banner. Shooting of the film has been completed. It is into post production now. Output of the film is good. I hope everybody will watch the movie and make it a success.
'Gulf' Dialogue Writer Pulagam Chinnarayana: This journey with Suneel Kumar Reddy garu for Gulf is a different experience for me. It's not like he is a director.. I'm a writer.. but this is a sencere attempt of two journalists. 'Gulf' will show the dark aspects, emotions, love.. of the youngsters who go to Gulf in search of employment in a pure and naked manner. 'Gulf' will definitely impress the audience. This is not like an art film.. but heart film. My sincere thanks to Suneel Kumar Reddy garu for giving me this opportunity.
'గల్ఫ్' లోగోను ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్
పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తాజాగా 'గల్ఫ్' అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లోగో ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
సుకుమార్: సునీల్ కుమార్ రెడ్డి గారు నాకు 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' ద్వారా పరిచయం. ఆ తర్వాత అయన దర్శకత్వంలోనే తెరకెక్కిన 'గంగపుత్రులు' సినిమాను చూడడం జరిగింది. నేను ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ను చూసి షాక్ అయ్యాను. ఆ సినిమా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇదే విషయం నేను గతంలో ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పడం జరిగింది. తెలుగు లో అసలు ఇలాంటి సినిమా ఒకటి తీసి హిట్ చేయొచ్చు అనేది చాలా కొత్త విషయం. తెలుగు లో వచ్చే అతి తక్కువ కొత్త కథల్లో ఆ సినిమా ఒకటి. అప్పటినుండి సునీల్ గారిమీద నాకు అభిమానంపెరిగింది. అయన రూపొందించే అన్నీ సినిమాలు చూడకపోయినా.. అయన ఏ సినిమా తీస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సినిమాను హిందీలో తీస్తున్నారా లేదా అని ఆయనను అడిగాను.. ఒకవేళ ఆయన కనుక హిందీలో తెరకెక్కించకపోతే నేను ఆ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నాను. ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే.. మేమందరం ఒక ఫ్లో లో..ఒరవడిలో కొట్టుకుపోతున్నాం. అయన అలా కాదు. సినిమాను ఎంజాయ్ చేసే వ్యక్తి. ఒక పాయింట్ తీసుకుని.. దాని మీద పూర్తిగా రీసెర్చ్ చేసి, క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆ తర్వాతే అయన సినిమాను తెరకెక్కిస్తారు. అదే రియల్ ఫిలిం మేకింగ్. అదే నిజమైన సంతృప్తినిచ్ఛే ప్రాసెస్. అదేవిధంగా సునీల్ గారు ఇపుడు గల్ఫ్ లో ఉన్న పాతిక లక్షల మంది తెలుగువారు.. వారి జీవితాలపై రీసెర్చ్ చేసి 'గల్ఫ్' అనే సినిమాను రూపొందించారు. అందుకోసం గల్ఫ్ దేశాలకు వారిని కలిసి.. వాళ్ళు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు..వారు అలాంటి పరిస్థితుల్లో ఉంటూ తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆయన అధ్యయనం చేయడం జరిగింది. అంతే కాదు.. మా ఊర్లో 40% మంది ఉపాథి కోసం గల్ఫ్ బాట పట్టారు. వాళ్ళు తమ కుటుంబాలకు డబ్బు పంపడం.. కుటుంబాలకు అండగా నిలవడం ఇవన్నీ నేను దగ్గరనుండి చూశాను. మా ఇంటి చుట్టూ ఇలాంటివి 5 కుటుంబాలు ఉన్నాయి. సునీల్ గారు ఈవిధమైన కాన్సెప్ట్ తో చాలా మంచి సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గల్ఫ్ లో ఉండేవారి జీవితాలపై ఈ సినిమాను తీశారు కాబట్టి వారందరూ ఈ సినిమాను ప్రమోట్ చేయాలని కూడా కోరుతున్నాను. పులగం చిన్నారాయణ గారు నాకు చిరకాలమిత్రులు. అయన జర్నలిస్ట్ గా పనిచేస్తూ పుస్తకాలు రాస్తుంటారు. పుస్తకాలు రాసే వ్యక్తికి మాటలు రాయడం పెద్ద విషయం కాదు. నేను అదే విషయం ఆయనకు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు అయన ఈ సినిమాకు మాటల రచయిత. ఆయన ఉన్నత స్థానానికి ఎదగాలి .
'గల్ఫ్' దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి: ఈ రోజు మా 'గల్ఫ్' సినిమా లోగో ను ఆవిష్కరించిన మిత్రుడు, శ్రేయోభిలాషి సుకుమార్ గారికి ధన్యవాదాలు. 'గల్ఫ్' షూటింగ్ పూర్తయింది. గల్ఫ్ జీవితానికి సంబంధించిన కంప్లీట్ రీసెర్చ్ బేస్డ్ సినిమా ఇది. ఒక అందమైన ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీతో పాటు దాని చుట్టూ ఉండే సోషల్ ఇష్యూస్.. వాటికి వినోదాన్ని మేళవించి ఒక అవేర్ నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇది. అతి త్వరలో మీముందుకు రాబోతోంది.
'గల్ఫ్' నిర్మాత రవీంద్ర బాబు: ఈ రోజు మా శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన గల్ఫ్ సినిమా లోగో ను ఆవిష్కరించిన డైరెక్టర్ సుకుమార్ గారికి కృతఙ్ఞతలు. దర్శకుడు సునీల్ గారితో శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ కు ఇది 14 వ సినిమా. గల్ఫ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగుంది. గల్ఫ్ సినిమాను చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
'గల్ఫ్' మాటల రచయిత పులగం చిన్నారాయణ: సునీల్ కుమార్ రెడ్డి గారితో ఈ సినిమా ప్రయాణం ఒక విచిత్రమైన అనుభవం. అయన ఒక డైరెక్టర్ గా.. నేనొక డైలాగ్ రైటర్ అన్నట్టుగా కాకుండా ఇద్దరు జర్నలిస్టులు చేసిన ఒక సిన్సియర్ ప్రయత్నం ఈ 'గల్ఫ్' సినిమా. ఆంధ్ర, తెలంగాణ ల నుండి గల్ఫ్ కు వలస వెళ్లిన యువతీ యువకుల జీవితాల్లోని చీకటిని, తడిని, ప్రేమని.. చాలా స్వచ్ఛంగా నగ్నంగా ఆవిష్కరించే సినిమా ఇది. గల్ఫ్ ఖఛ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. ఇది ఆర్ట్ ఫిలిం లాంటిది కాదు..హార్ట్ ఫిలిం. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన సునీల్ కుమార్ రెడ్డిగారికి కృతఙ్ఞతలు.