pizza
Jakkanna Motion poster & Logo launch
‘జక్కన్న’ మోషన్ పోస్టర్ రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 March 2016
Hyderabad

సునీల్, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. మోషన్ పోస్టర్ ను హీరో సునీల్ విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

సునీల్ మాట్లాడుతూ ‘’మంచి ఎనర్జిటిక్ మాస్ ఎంటర్ టైనర్. మర్యాదరామన్న తర్వాత రాంప్రసాద్ గారితో చేస్తున్న సినిమా. రక్ష డైరెక్టర్ వంశీ అకెళ్ళ రాంగోపాల్ వర్మగారి నుండి బాగా చేశావని మెచ్చకున్నారు. ఎవరూ టచ్ చేయని పాయింట్ తో వస్తున్నామని చెబుతున్నాను. ఇక కథ విషయానికి వస్తే రాళ్ళను శిల్పాలుగా చెక్కిన జక్కన ఎంతో కీర్తి గడించారు. అలాగే ఈ సినిమాలో నేనెందుకు పనికిరానని అనుకున్న వ్యక్తులకు నేను గొప్ప పనులు చేసి చూపడమే కాన్సెప్ట్’’ అన్నారు.

ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ‘’ప్రేమకథా చిత్రం తర్వాత వస్తున్న ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. ప్రేమకథా చిత్రంలో ఎన్ని ట్విస్టులుంటాయో ఈ సినిమాలో కూడాద అన్ని ట్విస్టులుంటాయి‘’ అన్నారు.

దర్శకుడు వంశీకృష్ణ అకెళ్ల మాట్లాడుతూ ‘’నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతగారికి థాంక్స్. సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 24 నుండి చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాం ‘’ అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజారవీంద్ర, ఆర్ట్ డైరెక్టర్ మురళి తదితర చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, రాజా రవీంద్ర తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved