pizza
Varun Sandesh's Mister 420 logo launch
‘మిస్టర్ 420’ లోగో విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

22 May 2016
Hyderabad

శ్రీమతి శోభారాణి సమర్పణలో సాన్వి క్రియేషన్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా రూపొందుతోన్న చిత్రం మిస్టర్ 420. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని హరికుమార్ రెడ్డి గజ్జల నిర్మించారు. ఈ సినిమా లోగోను ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు.

కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘’ప్రస్తుతం ఉన్న నిర్మాతలు కొత్త నిర్మాతలను ప్రోత్సహించాలి. కొత్త నిర్మాతలకు మంచి ప్రోత్సాహం ఉన్నప్పుడే మంచి సినిమాలు రూపొందే అవకాశం ఉంది. సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. సినిమా మంచి విజయాన్ని సాధించాలి’’ అన్నారు.

చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ ‘’కథ నచ్చడంతో నిర్మాతగారు వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అన్నీ సమకూర్చి మంచి అవుట్ పుట్ రావడానికి సహాయం చేశారు. వరుణ్ సందేశ్ చిత్రాల్లో భిన్నంటూ ఉంటూ తనకు మంచి పేరు తెస్తుంది’’ అన్నారు.

Priyanka Bhardwaj Glam gallery from the event

నిర్మాత హరికుమార్ రెడ్డి గజ్జల మాట్లాడుతూ ‘’ ’మంచి కథతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించాం. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ముస్తఫా మాట్లాడుతూ ‘’మంచి మ్యూజిక్ కుదిరింది. మ్యూజిక్ అందరికీ నచ్చుతుంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస, అనంతశ్రీరాం, మాటలు: మోహన్ చందా, ఎడిటర్: నందమూరి హరి, ఆర్ట్: రామకృష్ణ, ఫైట్స్: నందు, సంగీతం: ముస్తఫా, సినిమాటోగ్రఫీ: జశ్వంత్, నిర్మాత: హరికుమార్ రెడ్డి గజ్జల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్.రవికుమార్.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved