pizza
Bangaru Telangana Logo launch
`బంగారు తెలంగాణ‌` లోగో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 June 2016
Hyderabad

బిపిన్‌, శ్రీహ‌ర్ష‌, ల‌య‌న్ ఎ.వి.స్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బంగారు తెలంగాణ‌`. శిరిడి సాయి క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా లోగో విడుద‌ల హైద‌రాబాద్‌లో గురువారం ఉద‌యం జ‌రిగింది. బిపిన్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు.

ద‌ర్శ‌క‌నిర్మాత బిపిన్ మాట్లాడుతూ ``కేసీఆర్ చేసిన మంచి ప‌నుల‌ను గురించి చేసిన చిత్ర‌మిది. ఈ సినిమా ఏ ప్రాంతానికీ వ్య‌తిరేకం కాదు. కేసీఆర్ ప‌రిపాల‌న త‌దుప‌రి కూడా సాగుతుంది. షూటింగ్ పూర్త‌యింది. త్వ‌ర‌లో పాట‌ల్ని విడుద‌ల చేస్తాం. ముందు ప‌ది జిల్లాల్లో విడుద‌ల చేస్తాం. త‌ర్వాత మిగిలిన ప్రాంతాల్లో ఆవిష్క‌రిస్తాం`` అని తెలిపారు.

రాగిణి మాట్లాడుతూ ``నేను న‌టించిన తొలి తెలంగాణ చిత్ర‌మిది. మంచి మెసేజ్ ఉంటుంది`` అని చెప్పారు.

స‌హ నిర్మాత‌లు మాట్లాడుతూ ``కేసీఆర్‌గారు మాకు ఈ సినిమాకు రాయితీ ఇవ్వాలి. సినిమాను క‌ష్ట‌ప‌డి చేశాం`` అని తెలిపారు.

రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ ``తెలంగాణ ప్ర‌భుత్వం సినిమా ప‌రిశ్ర‌మ‌కు స‌హ‌కారం చేస్తూనే ఉంది. ఈ మ‌ధ్య‌నే ఐదో షో చిన్న సినిమాల‌కు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. నేను కూడా ఈ సినిమాకు ప‌న్ను రాయితీ ఇప్పించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను`` అని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు.

గౌతంరాజు, ర‌ఘునాథ‌రెడ్డి, వికాస్‌, గుండు హ‌నుమంత‌రావు, వినోద్‌, పిన్నింటి జాన‌కీరామారావు, మాస్ట‌ర్ పైజాన్‌, మాస్ట‌ర్ సాయి త్రిశాంక్‌, న‌ర‌సింహ‌, కీర్తి, మాన‌స త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌లు: ల‌య‌న్ ఎ.వి.స్వామి, కిష్టంప‌ల్లి సురేంద‌ర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: పిన్నింటి జాన‌కీరామ‌రావు, పొన్న కృష్ణ మంచిరేవుల‌, స‌హ నిర్మాత‌లు: వినోద యాద‌వ్‌, త‌న‌వ్ కుమార్ యాద‌వ్‌, బేబి అన‌న‌య్య యాద‌వ్‌, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్స్: మ‌ల్కాజ్ గిరి కుమార్‌, బిల్లా ప్ర‌భాక‌ర్ రావు, వేల్పుల సంజీవ్‌, కెమెరా: మ‌ధు.ఎ.నాయుడు, జి.య‌స్‌.ఆర్‌, ఆళ్ల రాంబాబు, ఎడిటింగ్‌: వి.నాగిరెడ్డి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved