pizza
‘పాకశాల’ ట్రైలర్ రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 April 2015
Hyderabad

ఐశ్వర్య సినీ స్టూడియో బ్యానర్ పై ఫణి కృష్ణ దర్శకత్వంలో రాజ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘పాకశాల’. విశ్వ, హరీష్ చక్ర సతీష్, శ్రీనివాస్, అర్పిత, కీర్తి ప్రధానపాత్రధారులు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. బ్యానర్ లోగోను గోపిచంద్ మలినేని, ట్రైలర్ ను గోపించద్ మలినేని, సురేష్ కొండేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...

గోపిచంద్ మలినేని మాట్లాడుతూ ‘’ట్రైలర్ చాలా బావుంది. చూస్తుంటే మంచి థ్రిల్లర్ మూవీలా కనపడుతుంది. స్టోరిలైన్ కూడా విన్నాను. చాలా బావుంది. ఈ మధ్యకాలంలో హర్రర్, థ్రిల్లర్ మూవీస్ పెద్ద సక్సెస్ అవుతున్నాయి. అదే విధంగా ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘’చిన్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. నాకు కాన్సెప్ట్ బేస్ మూవీలంటే బాగా ఇష్టం. పాకశాల కూడా మంచి కాన్సెప్ట్ బేస్ డ్ మూవీ. ట్రైలర్ బావుంది. తప్పకుండా సక్సెస్ అవుతుంది. యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

రాజ్ కిరణ్ మాట్లాడుతూ ‘’వైజాగ్ లో హుదూద్ వచ్చినప్పుడు ఈ సినిమా చేశాం. కంప్లీట్ చేయగలుగుతామా? లేదా? అనే డౌట్ వచ్చింది. అయితే గురుకిరణ్ సపోర్ట్ ఉండటంతో మంచి లోకేషన్స్ లో సినిమాని పూర్తి చేశాం. మంచి థ్రిల్లింగ్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది అన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకొస్తాం’’ అన్నారు.

ఈ చిత్రానికి పాటలు: హరీష్ చక్రవర్తి, సంగీతం: శ్రవణ్ ఎస్. మిక్కీ, ఆర్ట్: బాలు, సినిమాటోగ్రఫీ: భరద్వాజ్ దాసరి, ఎడిటింగ్: అనిల్ రాజ్, రచన: గురుకిరణ్, సహనిర్మాత: ఆర్.పి.రావు, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved