pizza
Shekaramgari Abbayi first look launch
`శేఖరం గారి అబ్బాయ్` ఫస్ట్ లుక్ లాంచ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 August 2016
Hyderaba
d

విన్ను మద్దిపాటిఅక్షత జంటగా అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై  హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావుమధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం `శేఖరంగారి అబ్బాయ్`. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటుడు కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు లాంఛ్ చేశారు. ఈ సందర్బంగా ..

కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు మాట్లాడుతూ ``మా బిగినింగ్ డేస్ లో మాలాంటి వారిని దాసరి గారు తప్ప వేరేవరూ ఎంకరేజ్ చేయలెదు. అక్కినేని నాగేశ్వరరావుగారు చెప్పారు నటుడికి ప్రతి రోజు ఓ లెసన్. ఈ చిత్ర దర్శకురాలు అక్షత బహుముహ ప్రజ్ఞాశాలి.  హీరో విన్ను  చాలా బాగున్నాడు. ఇప్పుడున్న చాలా మంది కృషిపట్టుదలక్రమశిక్షణ ఉంటే ఏదో రోజు విజయం మనకు లబిస్తుంది. చిత్ర యూనిట్ అబినందనలు`` అన్నారు.

Glam gallery from the event

కాశీ విశ్వనాద్ మాట్లాడుతూ ``శేఖరంగారి అబ్బాయి మంచి కాన్సెప్ట్. ప్లానింగ్ తో చేశారు. మంచి విజయాన్ని సాధిస్తుంది`` అన్నారు.

హీరో విన్నుమద్దపాటి మాట్లాడుతూ `` మోహన్ బాబు గారు మా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం మా టీమ్ అదృష్టం. కష్టపడి చేశాం. అందరి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం`` అన్నారు.

చిత్ర దర్శకురాలు, హీరోయిన్ అక్షత మాట్లాడుతూ ``మోహన్ బాబుగారు మా లాంటి కొత్త వారిని ఆశీర్వదించడానికి  వచ్చినందుకు ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది.నటీనటులుసాంకేతిక నిపుణులందరికి మంచి పేరు తీసుకు వచ్చే చిత్రమిది. టీమ్ అందరు చాలా బాగా  సపొర్ట్ చేశారు`` అన్నారు.

నిర్మాత మద్దిపాటి సోమశేఖర రావు మాట్లాడుతూ ``టాకీ కంప్లీట్ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది త్వరలోనే మోషన్ పోస్టర్ నుపాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సూర్యఅనురూప్ ,డి.ఎం.కె సంగీత దర్శకుడు సాయి ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సాయి ఎలెందర్కెమెరా: రాఘవ,  కూర్పు: నందమూరి హరి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved