MISMATCH cinema song released by Power Star Pavan Kalyan
MISMATCH starring Uday Shankar and Aishwarya Rajesh is releasing on 6th December
'మిస్ మ్యాచ్' చిత్రంలోని 'ఈ మనసే' గీతాన్ని విడుదల చేసిన పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'
ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదలకు సిద్ధమైన 'ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్' ల 'మిస్ మ్యాచ్'
The song' Ee Manase' from the film MISMATCH was released today by Power Star Pawan Kalyan . Speaking on this occasion, he conveyed his best regards to the Hero of the film Uday Shankar and wished the whole team on their endeavor .
Uday Shankar speaking on the occasion expressed his joy at his favorite star launching the song from his film MISMATCH.
He said that Tholi Prema was a landmark film in Shri Pawan Kalyan's career and the evergreen hit song 'Ee Manase ' from that film has been remade in MISMATCH. He added that the song was one of it's kind as it was choreographed in a single shot .
The rest of the crew expressed that the film would appeal to the audience as it is a family entertainer with a unique theme and treatment .
This film is the first under the Adhiroh Creative Signs banner .
The hero of the film is G Uday Shankar ( Aatagadhara Shiva ) and the heroine is Aishwarya Rajesh ( Nawab , Kanaa , Vada Chennai ) who is the daughter of yesteryear actor Rajesh .
The director is N V Nirmal Kumar who created ripples with his much acclaimed debut Doctor Salim .
The producers of the film G Sriram Raju and K Bharat Ram officially have announced that the film is ready for release on Dec 6th .
'మిస్ మ్యాచ్' చిత్రంలోని 'ఈ మనసే' గీతాన్ని విడుదల చేసిన పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'
ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదలకు సిద్ధమైన 'ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్' ల 'మిస్ మ్యాచ్'
'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'మిస్ మ్యాచ్' విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు' సర్టిఫికెట్ ను పొందిందీ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న 'మిస్ మ్యాచ్' ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు.
'మిస్ మ్యాచ్' చిత్రంలోని 'ఈ..మనసే' పాట ను ఈరోజు విడుదల చేసారు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఈ సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'మిస్ మ్యాచ్' సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ...నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు 'మిస్ మ్యాచ్' చిత్రంలోని 'ఈ మనసే' గీతాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్న అన్నారు. నా మొదటి సినిమా 'ఆట కదరా శివ' సినిమా లోని గీతాన్ని గతంలో పవన్మ కళ్యాణ్ గారు విడుదల చేసి ఆశీర్వదించారు. ఆ చిత్రం నటుడుగా నాకుగుర్తింపును తెచ్చింది. ఆయన నటించిన 'తొలిప్రేమ' చిత్రం ఆరోజుల్లో ఎంతో ఘనవిజయం సాధించింది. ఆ చిత్రంలోని 'ఈ మనసే' పాటను ఈ 'మిస్ మ్యాచ్' లో నాపై చిత్రీకరించటం ఎంతో సంతోషంగా ఉంది. ఒకటే షాట్ గా ఈ పాట చిత్రీకరించటం మరో విశేషం. అలాంటి ఈ గీతం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విడుదల అవటం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. డిసెంబర్ ఆరున చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.
మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ...సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ పాట విడుదలవ్వడం సంతోషం. ఆడియన్స్ అందరికి ఈ సాంగ్ నచ్చుతుందని భావిస్తున్నాను" అన్నారు.
ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం
దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .
నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్