pizza
Andhra Pori motion poster launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 April 2015
Hyderabad

K.Raghavendra Rao launches 'Andhra Pori' motion poster

The shooting of Puri Jagannadh's son Aakash Puri's debut film as hero, 'Andhra Pori', was completed recently and the post production work is going on currently. K.Raghavendra Rao, who attended the event as chief guest, launched the motion poster and official website of the film.

K.Raghavendra Rao said, "Many beautiful films were produced by Prasad Productions banner. They made many actors as stars. I hope 'Andhra Pori' produced by that banner will be a big hit. I wish the team all the very best".

Ramesh Prasad said, "Raghavendra Rao and I are family friends. I am very happy that he attended this event. We remade Marathi super hit film 'Time Pass' as 'Andhra Pori' in Telugu. We hope this film will be a bigger hit than the original version".

Raj Madiraju said, "I thank Raghavendra Rao sir for launching the motion poster.Whenever I talk to him, it would be a very enriching experience. I learnt so much about film making from him. I am really fortunate that I directed two films in a big production house like Prasad Productions. Many questioned me why I roped in Ulka Gupta for 'Andhra Pori' and not a Telugu girl. But I liked the commitment of Ulka Gupta and selected her. Aakash acted very well. I am very happy that both of them are part of this film. I thank everyone who supported us in this journey".

Aakash Puri said that the film is a very good Teenage love story and he did a very good role. He is confident that everyone will like the film. Ulka Guptha thanked the director and producer for giving her chance to act in the film.

Poornima, Eeshwari Rao, Aravind Krishna, Srimukhi, Uttej, Abhinaya, Sri Teja etc acted in the film.

Cinematography : Praveen Vanamali, Music : Dr.J, Art : Rajeev Nair, Lyrics : Suddala Ashok Teja, Ramajogaiah Sastry, Editor : Srikar Prasad, Choreography : Chandra Kiran, Producer : Ramesh Prasad, Director : Raj Madiraju, Production designer : Mahesh Chadalavada, Publicity designer : Eeshwar Andhe, PRO : Surendra Kumar Naidu,

‘ఆంధ్రాపోరి’ మోషన్ పోస్టర్ విడుదల

ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న నూత‌న చిత్రం ‘ఆంధ్రాపోరి’. ర‌మేష్ ప్ర‌సాద్ నిర్మాత‌. రాజ్ మాదిరాజు ద‌ర్శ‌కుడు. షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. చిత్రయూనిట్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మోషన్ పోస్టర్ విడుదల చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మోషన్ పోస్టరను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా...

కె.రాఘవేంద్రావు మాట్లాడుతూ ‘’ఒక వ్యక్తి వ్యవస్థగా మారిన సంస్థ ప్రసాద్ ప్రొడక్షన్స్.. ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించారు. ఎంతో మంది నటీనటులను స్టార్స్ గా చేసిన సంస్థ. ఆ బ్యానర్ లో వస్తోన్న ఆంధ్రాపోరి పెద్ద విజయాన్ని అందుకోవాలి. యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ‘’నేను, రాఘవేంద్రరావు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో కలిసే పెరిగాం. మరాఠీలో విజయవంతమైన టైమ్ పాస్ చిత్రాన్ని ఆంధ్రాపోరి పేరుతో రీమేక్ చేశాం. మరాఠీలో విజయవంతమైన విధంగానే ఇక్కడ కూడా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ ‘‘ప్రసాద్ ప్రొడక్షన్స్ 55 ఏళ్ల చరిత్ర ఉన్న బ్యానర్. ఆ బ్యానర్ లో 2011లో రుషి సినిమా తీశారు. తర్వాత చేస్తున్న సినిమా ఆంధ్రాపోరి. ఆంధ్రా పోరి చిత్రం బ్యూటిఫుల్ టీనేజ్ ల‌వ్‌స్టోరి. 1993లో జరిగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌. ఈ సినిమా 35 రోజులు పాటు నిరవధికంగా షూటింగ్ ను జరుపుకుని సింగిల్ షెడ్యూల్ లో పూర్తయింది. ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ జరుపుకుంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా రషెష్ చూసిన వాళ్లందరూ సినిమా చాలా బాగా వచ్చిందని అంటున్నారు. అత్తారింటికి దారేది సహా అనేక హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన రిలయన్స్ సంస్థ మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. జోశ్యభట్లగారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్ర ఆడియో కార్యక్రమాన్ని మే 2న నిర్వహించనున్నాం. అలాగే నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని మే రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ర‌మేష్ ప్ర‌సాద్‌గారు మ‌రోసారి నాకు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ విలువెంటో నాకు బాగా తెలుసు. అందుకు ఆయ‌న‌కి ద‌న్య‌వాదాలు. అలాగే నేను థాంక్స్ చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి పూరి జగన్నాథ్ గారు స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ మా కథపై నమ్మకంతో ఆకాష్ ని మాకు అప్పగించారు. మాకు బాగా సపోర్ట్ చేశారు. ఆకాష్ వయసు 17 ఏళ్ల కుర్రాడు. బయట ఉన్న ఆకాష్ పూరి, పూరి అనే పవర్ ఫుల్ బ్యాగేజ్ తో మా దగ్గరికి వస్తున్నాడనగానే ఒక చిన్న భయం కూడా ఏర్పడింది. కానీ తను ఓబిడియెంట్ పర్సన్. తన పరిధులు బాగా తెలిసిన వ్యక్తి. తను కెమెరా ముందుకు వచ్చే సరికి అద్భుతంగా నటించాడు. ఉల్కాగుప్తా ఈ సినిమాలో చక్కగా నటించింది. ఈ సినిమాకి ముందు చాలా మంది హీరోయిన్స్ ను చూసినా ఉల్కాగుప్తాను చూడగానే ఈమె సరిపోతుందని భావించి ఆమెను కలిసి హీరోయిన్ గా ఎంపిక చేశాం. ప్రవీణ్ వనమాలి. ఈ సినిమాని తన సినిమాటోగ్రఫీతో మరో లెవల్ కి తీసుకెళ్లాడు. ఈ సినిమాకి సపోర్టగ్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్” అన్నారు.

ఆకాష్ పూరి మాట్లాడతూ ‘’మంచి టీనేజ్ లవ్ స్టోరి. మంచి రోల్ చేశాను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

ఉల్కాగుప్తా మాట్లాడుతూ ‘’నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్’’ అన్నారు.

ఈ చిత్రంలో పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : మహేష్ చదలవాడ, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందె, పి.ఆర్.ఒ: సురేంద్రనాయుడు, సంగీతం: డా.జె., ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, డాన్స్: చంద్రకిరణ్, పాటలు: సుద్ధాల ఆశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగాడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల, నిర్మాత: రమేష్ ప్రసాద్, దర్శకుడు: రాజ్ మాదిరాజ్.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved