కృష్ణ, జనని, అఖిల్, భార్గవి, చరణ్, ప్రజ్ఞ జంటలుగా కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జాకి అతిక్ దర్శకత్వంలో మేరువ సుబ్బారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'లక్ష్మీదేవీ సమర్పించు నేడే చూడండి`. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ నరేష్, సిజెశోభ, టి.ప్రసన్నకుమార్, సుదర్శన్‌రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ సహా చిత్ర దర్శక నిర్మాతలు, యూనిట్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా....
సి.జె.శోభ మాట్లాడుతూ``నిర్మాతలు చాలా మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేశారు. సినిమా పూర్తయ్యింది. మంచి కథ. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే నేటి నిర్మాతల పరిస్థితిని తెలియజేసే చిత్రం. నేడు చిన్న నిర్మాతలెవరూ కనిపించడం లేదు. నిర్మాత అంటే గౌరవం ఉండాలి. అలాగే నిర్మాతకు ఇండస్ట్రీలోకి శాఖల పట్ల అవగాహన ఉండాలి. ఈ నిర్మాతలు మంచి అవగాహనతో ముందుకెళ్తున్నారని తెలుస్తుంది`` అన్నారు.
సీనియర నరేష్ మాట్లాడుతూ``వేలల్లో సినిమాలు రూపొందుతోన్న 120 సినిమాలు మాత్రమే విడుదలవుతున్నాయి. నేను కూడా నిర్మాతనే. నిర్మాత కష్టాలు నాకు కూడా తెలుసు. పరిశ్రమలో మార్పులు రావాలి. నిర్మాత లేకుంటే పరిశ్రమ లేదు. పెద్ద సినిమాలు తక్కువగానే విడుదలైన చిన్న సినిమాలే ఎక్కువగా విడుదలవుతున్నాయి. అన్నీ సినిమాలు బాగా ఆడాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. డిపరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. దర్శక నిర్మాతలకు, యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
సి.కల్యాణ్ మాట్లాడుతూ ``నిర్మాతల జీవితాలను నిర్మాత సుబ్బారెడ్డి ఈ చిత్రంలో చూపిస్తున్నాడు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ కష్టం ఈ సినిమాలో చూపిస్తాడని అనుకుంటున్నాం. నిర్మాతలుగా ఉండి మేమే నిర్మాతను చంపుకుంటున్నాం. నిర్మాతగా మా విలువలను మేమే దిగజార్చుకుంటున్నాం. అయినా కూడా మేం సినిమాలంటే ఫ్యాసన్‌తోనే ఉన్నాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిర్మాతల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత యం.సుబ్బారెడ్డి మాట్లాడుతూ``నాలుగు సినిమాలు తీసినా, మంచి విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని అనుకుంటున్నాను. లాభం రాకపోయినా పరావాలేదు, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు. ఇందులో నిర్మాతల కష్టాలను చూపిస్తున్నాం. కానీ ఎవరినీ కించపరిచే విధంగా సినిమా ఉండదు. అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటివారంలో ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం``అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : శ్రీకోటి, ఫొటోగ్రఫీ: రఘు.ఆర్.బళ్ళారి, సహనిర్మాత : సిరాజ్, నిర్మాత : మేరువ సుబ్బారెడ్డి, కథ,మాటలు,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: జాకి అతిక్.