`
pizza

Mana Shankara Vara Prasad Garu Pre Release Event
'మన శంకర వర ప్రసాద్ గారు' ఆల్రెడీ సూపర్ హిట్. వెంకటేష్ తో కాంబినేషన్ అదిరిపోతుంది. ఇది పండగ లాంటి సినిమా. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి

You are at idlebrain.com > News > Functions
Follow Us


7 January 2026
Hyderabad

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. 'మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి కేవలం శంకర వరప్రసాద్ దే కాదు.. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ రాజాసాబ్, నా తమ్ముడు రవితేజ సినిమా, మా ఇంట్లో చిన్నప్పుడు నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ సినిమా..అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తెలుగు చిత్రం పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నాను.అలంటి విజయాలు ప్రేక్షకులు ఇచ్చి తీరుతారనే ప్రగాఢ నమ్మకం నాకు ఉన్నది. 2026 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోకూడదు. ప్రతి సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమా, నచ్చే సినిమా. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడేలా చేసే బాధ్యత మీది, అన్ని సినిమాల్ని థియేటర్స్ కి వెళ్లి చూడండి. థియేటర్స్ లోనే ఆస్వాదించండి, ఆశీర్వదించండి.

రాఘవేంద్రరావు గారు, అనిల్ తో నేను సినిమా చేస్తే అది అదిరిపోతుందని చాలా సంవత్సరాల క్రితం అన్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఘరానా మొగుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలని ఆయన నాతో ఎన్నోసార్లు చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు .. ఫ్యామిలీ టచ్, సెంటిమెంట్, హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయి .ఈ సినిమాని వైవిధ్యంగా చేస్తామని తనతో చెప్తే...' ఎలాంటి వైవిధ్యం వద్దండి.. దొంగ మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు అన్నయ్య, చంటబ్బాయి... ఈ సినిమాలన్నీ ఎలా ఉన్నాయో నాకు అలా ఉంటే చాలు అన్నారు. అప్పట్లో ఆ సినిమాలన్నీ జనం చూశారు. వాళ్లంతా పెద్దవాళ్ళు అయిపోయారు.అవి తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్ కి అవి మీరు ఎలా చేస్తారు కూడా తెలియకపోవచ్చు .అదంతా ఈ జనరేషన్ తెలియజేసే నా ప్రయత్నం అన్నారు. అప్పుడు నేను సరే అన్నాను. అలా చేయడం నాకు కేక్ వాక్. చాలా చక్కటి హోం వర్క్ చేసుకుని నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అద్భుతంగా సీన్స్ ని డిజైన్ చేస్తూ వచ్చారు. తనతో ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా సరదా సరదాగా జరిగింది.అనిల్ రావిపూడి అంత మంచి పాజిటివ్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఇలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ చాలా కేక్ వాక్ లాగా చేయగలరు. సినిమా తీయడమే కాదు, దాన్ని ఎడిటింగ్‌ విషయంలోనూ అనిల్‌ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. సినిమాను ఎంతగా ప్రేమిస్తాడో, అనవసర సన్నివేశం వస్తే, నిర్దాక్షణ్యంగా తీసేస్తాడు.

ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. బడ్జెట్ లిమిట్లో చేసాం. డేస్ పరంగా అనుకున్న దాని కంటే తక్కువ రోజుల్లో అత్యద్భుతంగా తీగలిగాం. అనుకున్న బడ్జెట్లో అనుకున్న రోజుల్లో సినిమాచేయగలగడం ఒక సినిమాకి మొదటి సక్సెస్. రెండో విజయం 12 తారీఖున ఎంత ఘన విజయం ఇస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. నా తమ్ముడు వెంకటేష్ తో సినిమా చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. వెంకటేష్ చాలా పాజిటివ్ పర్సన్. తనతో కూర్చుంటే చాలా ఫిలాసఫికల్ గా అనిపిస్తుంది. మోడరన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువు లాగా అనిపిస్తుంటాడు. తనతో మాట్లాడుతుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మేము చాలా సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టిల్ ఫోటో దిగడం జరిగింది. మనిద్దరం కలిసి ఇలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. అనిల్ ద్వారా ఎన్నాళ్లకు అది కుదిరింది. అనిల్ రావిపూడి మాత్రమే దానికి జస్టిఫికేషన్ చేయగలిగాడు. మా కాంబినేషన్ చాలా అద్భుతంగా వచ్చింది. అది మీరు థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. వెంకీ నేను ఇద్దరం చాలా ఎంజాయ్ చేశాం. ఇది యాక్టింగ్ చేసినలా ఉండదు. ఇద్దరు కుర్రాళ్ళు కలిసి అల్లరి చేసినట్టుగా ఉంటుంది. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి పూర్తిస్థాయి న్యాయం చేసి మరో సినిమాని నెక్స్ట్ తీసుకెళ్లడానికి దోహదపడిన వెంకటేష్ కి మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా గురించి మేము ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, ఎంత ఊహించుకున్న తక్కువే అవుతుంది. అనిల్ మాట్లాడుతూ మనిద్దరం ఫుల్ లెంత్ ఒక సినిమా చేస్తే బాగుంటుందన్నారు. అలాంటి ఒక కథ రాసుకుంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

నయనతార ఈ సినిమా కోసం తను కూడా మాకు కుటుంబ సభ్యురాలు లాగా కలిసిపోయింది. ఈ సినిమాలో నయనతార కనిపించిన విధానం అద్భుతంగా ఉంటుంది. తను అద్భుతంగా నటించి మెప్పించింది. నటీనటులు అందరూ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్లందరికీ నా అభినందనలు. ఈ సినిమాకి బీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఒక గోదావరి పడవ ప్రయాణం లాగా ఉండే మ్యూజిక్ ఇచ్చాడు. మీసాల పిల్ల సాంగ్ వంద మిలియన్ పైగా హిట్ ఇచ్చింది. పాటలో లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో హుక్ స్టెప్ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. థియేటర్లో ఆ సాంగ్ టోటల్ గా హైలైట్ అవుతుంది. ఆ సాంగ్ వింటున్న వెంకటేష్ ఎదురుగా డాన్స్ వేశారంటే అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన బీన్స్ కి అభినందనలు. నేను అంత అందంగా కనిపించడానికి మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు కారణం, చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. తను చాలా ఫాస్ట్ కెమెరామెన్. కాఫీ తాగే గ్యాప్ కూడా ఇవ్వరు కాబట్టే సినిమా 88 రోజుల్లో పూర్తయింది. ఆయన లాంటి కెమెరామెన్స్ ఉంటే ప్రొడ్యూసర్స్ కి ఖర్చు తగ్గుతుంది ప్రొడక్షన్ డిజైన్ ప్రకాష్ చాలా చక్కగా చూపించారు. సాహు గారు అందర్నీ చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు. చాలా మంచి ప్రొడ్యూసర్. తనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నా బిడ్డ సుస్మిత... తను ఇండస్ట్రీకి వస్తానని చెప్పినప్పుడు కష్టపడి పని చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పాను. తను అదే మాట ప్రకారం నిరంతరం కష్టపడుతూ పనిచేసింది. ఈ సినిమా కూడా సాహూ గారితో కలిసి తను నిర్మాణం చేసింది. తన అన్ని కంఫర్ట్ ని వదులుకొని చాలా హార్డ్ వర్క్ చేసింది. సాహు, తను బెస్ట్ కాంబినేషన్లో ఈ సినిమా చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అలాంటి హిట్ తండ్రిగా నాకు ఇచ్చినందుకు తను గర్వపడుతుంది. ఈ పరిశ్రమలో నాకు అన్ని రకాలుగా భుజం కాస్తూ ఇంటికి పెద్ద బిడ్డ అయినందుకు ఆ పెద్దరికన్ని సొంతం చేసుకుంటూ నాకు అన్ని విధాలుగా తాను చేదోడు వాదోడుగా ఉంది. రామ్ చరణ్ తో పాటు తను నాకు మరో బిడ్డ. ఇదే కష్టాన్ని నమ్ముకోండి. కచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేస్తాడు. ప్రతి ఒక్కరు ఏదో సాధించాలనే లక్ష్యంతో ఉండాలి. నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి లోకి వస్తారని నాకు తెలుసు. ఇదే అభిమానం ప్రేమ మీరు ఎప్పుడూ నా మీద చూపించాలి. థాంక్యూ సో మచ్. ఐ లవ్ యు ఆల్.

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. మెగా విక్టరీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది మామూలుగా లేదు. ఆయన రఫ్ ఆడేస్తారు. నేను కూడా ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ అని రఫ్ ఆడాను ఇద్దరం రాఫ్ఫాడాం. రచ్చ రచ్చే. నేను మా తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ తో మహేష్ తో మల్టీ స్టార్స్ చేశాను. ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను. సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్. అనిల్ తో నాది వండర్ఫుల్ కాంబినేషన్. అన్ని సినిమాలు మీరు సూపర్ హిట్ చేశారు. తన రైటింగ్ టీం. టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఫ్యామిలీ ఫిలిం, మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తోంది. ఎప్పటిలాగే మీరు దాన్ని అద్భుతంగా ఆదరించి మంచి హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి ఫిలిమ్స్ అన్ని చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని సినిమాలు ఆడాలి. మీరు అన్ని సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది నాకు తొమ్మిదో సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారితో చేయడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ సినిమాకు పనిచేసిన రైటర్స్ కి థాంక్యూ. నిర్మాతలు సాహు గారికి సుస్మిత గారికి థాంక్యూ. సాహు గారితో నాకు ఇది రెండో సినిమా. సుస్మిత గారు హాట్సాఫ్. మా టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. భీమ్స్ తన మ్యూజిక్ తో సినిమాకి ఒక ఊపు తీసుకొచ్చారు. మీసాల పిల్ల పెద్ద హిట్. అక్కడినుంచి ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది.నయనతార గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా కోసం రెండు ప్రమోషన్స్ కూడా చేశారు. విక్టరీ వెంకటేష్ గారు ఫ్రెండ్, గైడ్. టెక్నికల్ గా వెంకటేష్ గారితో ఇది నాలుగో సినిమా. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. వెంకీ గారు ఈ సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు. నేను ఈ కథ చెప్పిన తర్వాత ఈ ఆలోచన ఇచ్చింది చిరంజీవి గారే. చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్ మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. వెంకీ గౌడ గా కర్ణాటక బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నారు. చిరంజీవి గారు వెంకటేష్ గారిని ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఉంది ఎన్నో ఏళ్ల కల. అది నాకు కుదిరింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఒక కన్నుల విందు ఇవ్వాలనేది వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. తెలుగు సినిమా చరిత్రలో వారి కాంబినేషన్ మెమొరబుల్ గా మిగిలిపోతుంది. చిరంజీవి గారు 150 పైగా సినిమాలు చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్, పద్మ భూషణ్, పద్మ విభూషణ్.. ఇలా ఒక మనిషి ఎన్ని సాధించాలో అంతా ఉన్నత స్థాయి సాధించారు. కానీ చాలా గ్రౌండ్ గా, హంబుల్ గా ఉంటారు. అలా ఎలా ఉంటారో అనేది నాకు అర్ధం కాదు. ఆయనతో గడిపిన ఈ ఆరు నెలల జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నాకు ఒక నాస్టాలజికి ఫీలింగ్. ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా మాకు పెట్టారు. ఒక హీరోగా ఆయన నాకు నమ్మి అవకాశం ఇచ్చినందుకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాంటి లెజెండ్రీ హీరోతో నేను పని చేసినందుకు చాలా ఆనందంగా నేను ఫీల్ అయ్యాను.ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అనుకుంటున్నారు కానీ అంతకుమించి ఎమోషనల్ డ్రామా ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ డాన్స్ సాంగ్స్, వెంకటేష్ గారు వచ్చిన తర్వాత అల్లరి.. ఇలా ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. చిరంజీవి గారు వెంకటేష్ గారితో కలిసి ఈ సంక్రాంతికి రాబోతున్నాను. నా ప్రతి సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ కి థాంక్యూ. వాళ్ళు లేకపోతే నేనులేను. కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా కష్టం. క్రిటిసిజం తట్టుకుని ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ మీ ముందుకు తెచ్చి మీ ఆదరణ పొందడం అనేది పెద్ద ప్రాసెస్. ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నామంటే అది ఆడియన్స్ వళ్ళనే. ఫ్యామిలీ జోనర్ కి ఇంత బలం ఉందని నిరూపించిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు. చిరంజీవి గారికి ఎన్నో అద్భుతమైన విజయాలు వున్నాయి. అలాంటి అద్భుతమైన విజయాలు జాబితాలో ఈ సినిమా కూడా జాయిన్ అవ్వాలని నా చిరు కోరిక. ఆ కోరికనే మీరందరూ నెరవేరుస్తారని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఈ సంక్రాంతికి వస్తున్న ప్రభాస్ గారి సినిమా, రవితేజ గారి సినిమా, నవీన్, శర్వా అన్ని సినిమాలకి నా బెస్ట్ విషెస్. జనవరి 12 నుంచి మన శంకర వరప్రసాద్ గారు మీ థియేటర్స్ కి వచ్చేస్తున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి అందరికీ థాంక్యు.

ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. డాడీ, వెంకటేష్ గారు రాగానే ఈ వైబంతా మారిపోయింది. ఈ సినిమా నా జీవితంలో బిగ్ మైల్స్టోన్ ప్రాజెక్ట్. సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేయడమే చాలా పెద్ద విషయం. అలాంటిది డాడీ సినిమాతో మీ ముందుకు రావడం చాలా గొప్ప విషయం. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నాన్నగారికి థాంక్యూ. ఇది ఎప్పటికి నా మనసులో నిలిచిపోతుంది. వెంకటేష్ గారు నయనతార నయనతార గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి గారు బ్యాక్ బోన్. ఆయన పాజిటివ్ ఎనర్జీ నింపేస్తారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతి కూడా ఆయనదే స్టాంప్. బీమ్స్, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. రామ్ చరణ్ నా స్ట్రెంత్. నా ప్రతి అడుగులో తన ప్రోత్సహం ఉంటుంది. చరణ్ ఐ లవ్ యు ఫర్ దిస్. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి నాకు మరి కొంచెం దగ్గర అయ్యేలా చేసింది. అది ఒక గాడ్ గిఫ్ట్ గా భావిస్తాను. జనవరి 12న అందరం థియేటర్స్ లో కలుద్దాం.

ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ.. మెగాస్టార్ గారికి, విక్టరీ వెంకటేష్ గారికి, వారి ఫ్యాన్స్ కి హృదయపూర్వక స్వాగతం. ఏ ప్రొడ్యూసర్ కైనా ఒక స్టార్ హీరో తో చేయడమే అదృష్టం. అలాంటిది నాకు మా అనిల్ బ్రదర్ ద్వారా ఇద్దరు స్టార్స్ తో చేసే అవకాశం దొరికింది. దానికి చాలా సంతోషంగా ఉంది. గత సంక్రాంతికి అనిల్ బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేశారో మీరందరూ చూశారు. ఈ సినిమాతో మొత్తం అదిరిపోద్ది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా టెక్నికల్ టీమ్ అందరికీ థాంక్యు. అందరూ చాలా కోపరేట్ చేశారు. అందరికీ చాలా థాంక్స్. మాతో పాటు ప్రభాస్ గారు శర్వానంద్ గారు నవీన్ పోలిశెట్టి గారు నవీన్ రవితేజ గారి సినిమాలు వస్తున్నాయి. అన్ని సినిమాలు బాగా ఆడాలి. ఈ ప్రాసెస్ లో నాకు అన్ని విధాలుగా హెల్ప్ గా ఉన్న సుస్మిత గారికి థాంక్యూ. ఇది చాలా మంచి జర్నీ. ఈ అవకాశం ఇచ్చిన వెంకటేష్ గారికి చిరంజీవి గారికి థాంక్యూ సో మచ్.

ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారికి విక్టరీ వెంకటేష్ గారికి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకు పాటలు రాయడం ఎప్పుడూ ఆనందకరమైన విషయం. ఈ సినిమాలు కూడా చక్కని పాట రాయించుకున్నారు. నా పాట ఈ సందర్భంగా రిలీజ్ కాబోతోంది.ఆ పాట చూడ్డానికి నేను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా సంక్రాంతికి గొప్ప విజయాన్ని నమోదు చేయబోతోంది.

భాస్కరభట్ల మాట్లాడుతూ.. మెగాస్టార్ అభిమానులందరికీ నమస్కారం. ఇందులో మీసాల పిల్ల 100 మిలియన్స్ మెట్టు మీద దాన్ని కూర్చోబెట్టారు. అంత మంచి హిట్ సాంగ్స్ నాకు ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ప్రతి రైటర్ కి మెగాస్టార్ గారితో పని చేయాలని ఉంటుంది. ఆయనకి బ్లాక్ బస్టర్ రాయాలనేది నా 25 ఏళ్ల కల. ఈ పాటతో అది నెరవేరింది. లాస్ట్ ఇయర్ గోదావరి గట్టుమీద పాట హైలెట్ అయింది. ఈ సంక్రాంతికి మీసాల పిల్ల హైలెట్ అయింది. అనిల్ రావిపూడి గారు రుణం తీర్చుకోలేను. మెగాస్టార్ గారు నా పాటకి స్టెప్పులు వేయడం, నయనతార గారి కాంబినేషన్ చాలా ఆనందంగా అనిపించింది.

రఘురాం మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక మంచి పాటను రాసే అవకాశం కల్పించిన బీమ్స్ గారికి దర్శకులు అనిల్ గారికి థాంక్యూ సో మచ్. ఇది నాకు చాలా మెమొరబుల్. పవర్ స్టార్ గారికి ఓజీ లో హంగ్రీ చీత రాశాను. ఇప్పుడు చిరంజీవి గారికి రాసే అవకాశం రావడం నా కెరీర్లో హైలైట్స్. సంక్రాంతికి ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది

కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరూ తెరపై కనిపించే అద్భుతమైన సన్నివేశానికి నా కలం తోడవడం చాలా ఆనందంగా ఉంది. మెగా విక్టరీ సాంగ్ రాయించినందుకు దర్శకులు అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ఈ పాటని అత్యద్భుతంగా స్వర కల్పన చేసిన నా మిత్రుడు భీమ్స్ కి ధన్యవాదాలు. చిరంజీవి గారికి వెంకటేష్ గారికి ఒకే సినిమాలో రాసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంక్రాంతి మనదే. ఈ సంక్రాంతి అదిరిపోద్ది.

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. మెగా అభిమానులందరికీ నమస్కారం. ఇందులో శశిరేఖ పాట రాశాను. ఆ పాట బీమ్స్ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. 50 మిలియన్ వ్యూస్ పైగా సాంగ్ దూసుకెళ్తుంది. ప్రేక్షకుల కోసమే పని చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ఈ పండక్కి తోడు అల్లుడు వెంకటేష్ గారితో పాటు వస్తున్న మన పెద్దల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఇంట్లో తన సతీమణి సురేఖ గారిని సరదాగా ఉన్నప్పుడు రేఖ అని పిలుస్తుంటారు. ఈ పాటలో ఆ పదాన్ని ప్రయోగించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అది మీ అందరికీ నచ్చడం చాలా సంతోషం. మన శంకర వరప్రసాద్ గారు పండగను తెస్తున్నారు. మూవీ యూనిట్, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

 

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved