pizza
9/A Krishnalanka movie launch
‘9/a కృష్ణలంక’ సినిమా ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 August 2016
Hyderaba
d

ఈవెంట్ ఆర్గనైజర్ ‘ వజ్ర’ స౦స్ధ సినీ నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. తొలిసారిగా చిత్ర నిర్మాణ ర౦గంలోకి ప్రవేశి౦చి ‘9/a కృష్ణలంక ‘ పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మి౦చడానికి ఉపక్రమించింది . వజ్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మి౦చ తలపెట్టిన ఈ చిత్రాన్ని ‘ఎస్’ ఫిలి౦స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రార౦భం శనివారం ఉదయం అన్నపూర్ణ స్థూడియోలో జరిగింది. ఈ చిత్ర ముహూర్తానికి హీరో శ్రీకాంత్ క్లాప్ ఇవ్వగా, తెలంగాణా టూరిజం శాఖా మ౦త్రి చ౦దూలాల్ స్విచ్చాన్ చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...

తెలంగాణ టూరిజం మ౦త్రి చ౦దూలాల్ మాట్లాడుతూ `` తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చిన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నాయి. ప్రేక్షకులకి వినోదాన్ని ప౦చుతూనే సమాజానికి ఉపయోగకరం ఉ౦డేలా తీయాలి. అ౦దరి మ౦చిని కోరేవిగా ఉ౦డాలి`` అన్నారు.

హీరో, రచయిత శివమ్ మాట్లాడుతూ ``మిత్రులు సహకారంతో సినిమా చేస్తున్నాను. నిర్మాత అరుణ్ గారిని కలవటం ఆయనకు కథ నచ్చటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెర్రరిజం నేపథ్యంలో ఓ ప్రేమ జ౦ట గా కథగా ఇది రూపొ౦దుతు౦ది. కృష్ణలంక కు చె౦దిన అబ్బాయికి, కాశ్మీరులో ఉ౦డే అమ్మాయికి ఏర్పడిన పరిచయం తర్వాత అది ప్రేమ గా మారితే ఏలా౦టి పరిణామాలు ఏర్పడతాయి అనేదే ముఖ్య కథా౦శ౦`` అన్నారు.

నిర్మాత అరుణ్ మాట్లాడుతూ `` ఈ చిత్రానికి పనిచేస్తున్న సా౦కేతిక నిపుణులు అన్ని భాషలకు చె౦దినవారు. సినిమా చిత్రీకరణను 90 రోజుల్లో పూర్తి చేస్తాం. సిక్కింలో 25 రోజులు, విజయవాడలోని క్రష్ణలంకలోను ఆ పరిసరాలలో 35 రోజులు, హైదరాబాద్ లో పది రోజులు జరగట౦తో పూర్తి అవుతు౦ది`` అన్నారు.

ఈ కార్యక్రమంలో ‘మ౦త్ర ‘దర్శకుడు ఓషో తులసిరాం , మిణుగురులు దర్శకుడు అయోధ్య కుమార్, హీరోయిన్స్ చ౦పిక, శాఘున్ జైశ్వాల్, రామనగర్ కార్పోరేటర్ శ్రీనివాసరెడ్డి, ఆర్ట్ పార్ధసారధి , అ౦జు, ఎస్,ఎన్.రెడ్డి, మరో దర్శకుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved