pizza
Allu Sirish - Sri Shailendra productions production No. 2 film launch
అల్లు శిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం
ou are at idlebrain.com > News > Functions
Follow Us

28 April 2016
Hyderabad

అల్లు శిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మించనున్న కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి బోయపాటిశ్రీను క్లాప్ కొట్టగా, శ్రీనువైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.....

అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘’శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ వారికిది తెలుగులో రెండో చిత్రం కాగా, నాకు నాల్గవ చిత్రం. డైరెక్టర్ ఎం.వి.ఎన్. తండ్రి మల్లిడి సత్యనారాయణగారు అన్నయ్యతో బన్ని అనే సినిమాను కూడా నిర్మించారు. అలాగే నాకు డైరెక్టర్ తో చిన్నప్పటి నుండి మంచి పరిచయం ఉంది. చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు నా సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంజయ్ లోక్ నాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం లోకేషన్స్ చూస్తున్నారు. డైలాగ్ వెర్షన్ వర్క్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం 20-30 కథలు వింటుంటాను. కానీ ఈ కథను సింగిల్ సిటింగ్ లోనే ఓకే చేసేశాను. నాన్నగారు కూడా కథను సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసేశారు. లవ్ ఎంటర్ టైనర్, 700 సంవత్సరాల పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స ఉండే చిత్రం. ఈ సినిమా కోసం వర్కవుట్ చేయాలి.  శ్రీరస్తు శుభమస్తు తర్వాత ఈ సినిమా సెట్స్ లోకి వెళుతుంది. ఇలాంటి రోల్ చేయాలని ఒక సంవత్సరం పాటు వెయిట్ చేశాను. కామెడి, పెర్ ఫార్మెన్స్ కలగలిసిన క్యారెక్టర్’’ అన్నారు.

శైలేంద్రబాబు మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు తర్వాత వస్తున్న రెండో తెలుగు సినిమా. మా బ్యానర్ లో పద్దెనిమిదో సినిమా. దర్శకుడు మంచి కథను అందించారు. అల్లు శిరీష్ గారికి థాంక్స్. ఈ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హరీష్ దుగ్గిశెట్టి మాట్లాడుతూ ‘’శిరీష్ బాడీ లాంగ్వేజ్ కు తగిన కథ. ఫుల్ ఎంటర్ టైనింగ్ వేలో సాగుతుంది’’ అన్నారు.

దర్శకుడు ఎం.వి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ ‘’మంచి లవ్ ఎంటర్ టైనర్. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరో శిరీష్ కు థాంక్స్’’ అన్నారు.  

                      ఈ చిత్రానికి ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్, మ్యూజిక్: జిబ్రాన్, నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి, దర్శకత్వం: ఎం.వి.ఎన్.రెడ్డి. 

 


 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved