pizza
Angel Movie launch
ప్రారంభ‌మైన `ఏంజెల్‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 August 2016
Hyderaba
d

నాగఅన్వేష్‌, హెబ్బాపటేల్‌ హీరో హీరోయిన్లుగా ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిలింస్‌ బ్యానర్‌పై బహుబలి పళని దర్శకత్వంలో భువన్‌ సాగర్‌ నిర్మాతగా కొత్త చిత్రం 'ఏంజెల్‌' బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఠాగూర్‌ మధు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సాయిధరమ్‌తేజ్‌ క్లాప్‌ కొట్టారు. పళని గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో....

సింధూర పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ''వినవయ్యా రామయ్యా తర్వాత మా బ్యానర్‌లో రూపొందుతోన్న చిత్రమిది. తొలి చిత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేదు. కాబట్టి ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో ఎంతో కేర్‌ తీసుకున్నాం. ముఖ్యంగా స్క్రిప్ట్‌పై ఏడాది పాటు మా డైరెక్షన్‌ టీం వర్క్‌ చేసింది. అన్నీ ఓకే అయిన తర్వాతే సినిమాను స్టార్ట్‌ చేశాం. చంద్రబాబునాయుడుగారి బంధువైన ముప్పా వెంకయ్యచౌదరిగారు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నా పెద్దబ్బాయి భువనసాగర్‌ అమెరికా ఎం.ఎస్‌ పూర్తి చేసిన సినిమాలపై ఆసక్తితో ఈ చిత్రానికి నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడు పళని ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్‌. ప్రతి సీన్‌కు సంబంధించిన వర్కంతా, అంటే లోకేషన్స్‌, కాస్ట్యూమ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ ఇలా అన్ని విషయాలను ముందుగానే రెడీ చేసేశాడు. అలా ఎలా, కుమారి 21 ఎఫ్‌, ఆడోరకం-ఈడోరకం సినిమాలతో హ్యాటిక్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మంచి టాలెంట్‌తో పాటు లక్కీ హీరోయిన్‌ తను. గుణశేఖర్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, భీమ్స్‌ శెసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సాంగ్స్‌ కూడా రికార్డింగ్‌ చేసేశాం. రేపటి నుండే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి నాలుగు నెలల్లో షూటింగ్‌ అంతటినీ పూర్తి చేస్తాం. ఈ చిత్రంలో కీలకంగా ఉండే గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తి చేయడానికి రెండు, మూడు నెలల సమయం పడుతుంది. ఆరేడు నెలల్లో సినిమా చిత్రీకరణను పూర్తి చేసి మంచి విడుదల తేదిని తెలియజేస్తాం. ప్రేక్షకుల ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం'' అన్నారు.

చిత్ర సమర్పరకుడు ముప్పా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ''నేను రియల్‌ ఎస్టేట్‌ రంగం నుండి సినిమాలపై ఉన్న ఆసక్తితో కృష్ణారెడ్డిగారి సపోర్ట్‌తో ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాను. కచ్చితంగా సక్సెస్‌ఫుల్‌ సినిమా అవుతుంది. సినిమాకు సంబంధించిన వర్కంతా ముందే పూర్తయ్యింది. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను'' అన్నారు.

Glam gallery from the event

దర్శకుడు బాహుబలి పళని మాట్లాడుతూ ''రాజమౌళిగారి వద్ద అసోసియేట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. నేను దర్శకుడిగా మారడానికి ఆయన ఎంతో సపోర్ట్‌ చేశారు. అలాగే ఈ సినిమా దర్శకత్వం అవకాశం ఇచ్చిన కృష్ణారెడ్డిగారికి థాంక్స్‌. హీరో నాగఅన్వేష్‌లో మంచి ఎనర్జీ ఉంది. కథ వినగానే వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. భీమ్స్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు. భువన్‌గారు మంచి ప్రొడ్యూసర్‌గా నాకు ఎంతో సపోర్ట్‌ చేస్తున్నారు. హెబ్బా మా సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది'' అన్నారు.

భువన్‌ సాగర్‌ మాట్లాడుతూ ''మా తమ్ముడు చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తిగాఉండేవాడు. సినిమాల్లో కూడా యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తను హీరోగా నటించిన వినవయ్యా రామయ్యా చిత్రం అనుకున్నంత సక్సెస్‌ కాలేదు. కాబట్టి ఈఏంజెల్‌సినిమాను పెద్ద హిట్‌ చేసేలా పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతున్నాం'' అన్నారు.

హీరో నాగఅన్వేష్‌ మాట్లాడుతూ ''హీరోగా నా రెండో చిత్రం. పళనిగారు చెప్పిన కథ ఎంతో నచ్చింది. డిఫరెంట్‌ స్టోరీ. మంచి టీం కూడా కుదిరింది. ఈ సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. హెబ్బాపటేల్‌తో యాక్ట్‌ చేయడం హ్యాపీగా ఉంది'' అన్నారు.

హెబ్బాపటేల్‌ మాట్లాడుతూ ''మంచి స్క్రిప్ట్‌, నా రోల్‌ వినగానే చాలా బాగా అనిపించి వెంటనే నటించడానికి ఒప్పుకున్నాను. తప్పకుండా మంచి హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

సప్తగిరి మాట్లాడుతూ ''ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేస్తున్నాను. దర్శక నిర్మాతలు అడగ్గానే నా రోల్‌ను పెంచి బాగా డిజైన్‌ చేశారు'' అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

నాగఅన్వేష్‌, హెబ్బాపటేల్‌, సప్తగిరి, సుమన్‌, షాయాజీ షిండే, ప్రదీప్‌రావత్‌, రఘుబాబు తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వేంపల్లి రమేష్‌రెడ్డి, బాహుబలి పళని, రచనా సహకారం: శ్రీనివాస్‌ లంకపల్లి, ప్రదీప్‌, శంకర్‌ మైచర్ల, రాజ్‌కుమార్‌.కె, మాటల సహకారం: శ్రీనివాస్‌ అంకాలపు, వీరబాబు బాసిన, కొరియోగ్రఫీ: శేఖర్‌, జానీ, ఆర్ట్‌: వి.ఎన్‌.సాయిమణి, స్టంట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టంట్‌ జాషువా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కడప గోపి, ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌, సంగీతం: భీమ్స్‌ శెసిరోలియో, సినిమాటోగ్రఫీ: గుణా, సహ నిర్మాత: యోగీశ్వర్‌రెడ్డి, నిర్మాత: భువన్‌సాగర్‌, దర్శకత్వం: బాహుబలి పళని.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved