pizza
Antha Vichitram Movie launch
ou are at idlebrain.com > News > Functions
Follow Us

10 April 2016
Hyderabad


నిఖిల్, ఇషిక, నీరజ్, సమ్రీన్, జాహ్నసాయి, కావేరి, లిఖిత్, రేవతి, సాయిప్రనీత్, బిట్టు, నరేష్, సిద్ధు, చరణ్ ప్రధాన తారాగణంగా జగదాంబ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొత్త చిత్రం అంతా Vచిత్రం ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. రామ్ కుమార్ దర్శకత్వంలో వెంకటాచారి ఎర్రోజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, రవి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు రామ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘’ఓ 14-16 వయసు మధ్య పిల్లలను తీసుకుని సినిమా హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ ను వారికి డిజైన్ చేసి చేస్తున్న చిత్రమిది. దర్శక నిర్మాతలు కొత్తగా చేస్తున్న ప్రయత్నం. ఓ రెగ్యులర్ కథలో వారు ఎలా ఇన్ వాల్వ్ అయ్యారనేదే సినిమా. యూనిట్ సభ్యులందరికీ థాంక్స్’’ అన్నారు.

డైరెక్టర్ రామ్ కుమార్ మాట్లాడుతూ ‘’అందరి చిన్నపిల్లలతో నలుగురు హీరోలు, హీరోయిన్స్ పాత్రలను డిజైన్ చేసి చేస్తున్న చిత్రమిది. పవన్ కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ, రక్షిత, ఇలియానా, భూమిక, సమంత హీరోయిన్స్ క్యారెక్టర్స్ లో చిన్నపిల్లలు నటిస్తున్నారు. ఐదు సాంగ్స్ ఉంటాయి. మాస్ కామెడి ఎంటర్ టైనర్. బాంబే బోలేగారు మంచి మ్యూజిక్ అందించారు. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.

నిర్మాత వెంకటాచారి ఎర్రోజు మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో రూపొందుతోన్న రెండో సినిమా. ఇప్పటి వరకు ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదని అనుకుంటున్నాం. ఈ నెల 13 నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దర్శకుడు రామ్ కుమార్ కథ చెప్పగానే బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను, మంచి ఎంటర్ టైనర్’’ అన్నారు.

బాంబే బోలే మాట్లాడుతూ ‘’సినిమాలో 5 సాంగ్స్ ఉంటాయి. ఇందులో పిల్లల భవిష్యత్ ను తెలియజేసే ఓ సాంగ్ కూడా ఉంటుంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహ్మద్ అస్లాం మాట్లాడుతూ ‘’కొత్త కాన్సెప్ట్. చిన్నపిల్లలతో కొత్త ప్రయత్నం. సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్’’ అన్నారు.

నిఖిల్, ఇషిక, నీరజ్, సమ్రీన్, జాహ్నసాయి, కావేరి, లిఖిత్, రేవతి, సాయిప్రనీత్, బిట్టు, నరేష్, సిద్ధు, చరణ్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రవి, సూపర్ ఆనంద్, ఆర్ట్: విజయ్ కృష్ణ, డ్యాన్స్: కిరణ్, మురళి, బాలు, మ్యూజిక్: బాంబే బోలే, సినిమాటోగ్రఫీ: మురళి వై.కృష్ణ, స్టోరీ, డైలాగ్స్: ఎస్.రమారామ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహ్మద్ అస్లాం, ప్రొడ్యూసర్: వెంకటాచారి ఎర్రోజు, డైరెక్టర్: రామ్ కుమార్.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved