pizza
Dandupalyam 2 Movie launch
'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం2' ప్రారంభం

ou are at idlebrain.com > News > Functions
Follow Us

24 March 2016
Hyderabad

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్యం' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. కన్నడతోపాటు తెలుగులోనూ శతదినోత్సవ చిత్రంగా నిలిచిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం2' చిత్రం ఈరోజు(మార్చి 24) ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ గోవిందు క్లాప్‌ ఇచ్చారు. ఇంకా ప్రారంభోత్సవంలో సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హెచ్‌.డి.గంగరాజు, కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎన్‌.సురేష్‌ పాల్గొన్నారు. ఇంకా నటులు డానీ కుట్టప్ప, ముని, జయదేవ్‌, పెట్రోల్‌ ప్రసన్న, సినిమాటోగ్రాఫర్‌ వెంకటప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''దండుపాళ్యం సక్సెస్‌ తర్వాత దీనికి సీక్వెల్‌గా సినిమా చెయ్యాలన్న ఆలోచన వున్నప్పటికీ వెంటనే చెయ్యలేకపోయాను. ఆ సినిమా కోసం నేను వివరాలు సేకరిస్తున్నప్పుడు క్రైమ్‌ లో కూడా ఇంత పెద్ద స్పాన్‌ ఉంటుందా అనిపించింది. ఫస్ట్‌ పార్ట్‌ వెనుక ఉన్న కథను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఒక విషయంపై పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, మీడియా, ప్రజలు ఇలా ముగ్గురి కోణంలో సినిమా రన్‌ అవుతుంది. సాధారణంగా ఒకరు ఒక మంచి పనిచేస్తే దాన్ని ఎక్కువ చేసి చూపిస్తాం, చెబుతాం. అలాగే ఏదైనా క్రైమ్‌ జరిగినపుడు కూడా మీడియా దాన్ని ఎక్కువ చేసి చూపిస్తుంది. ప్రజలు కూడా దాని గురించి ఎక్కువ డిస్కస్‌ చేస్తారు. ఈ చిత్రంలో ఒక నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నాం. నిజానికి నేను ఈ స్టోరీని హేట్‌ చేస్తున్నాను. అయినప్పటికీ క్రైమ్‌ను డైలూష్యన్‌ వేలో చూపిస్తున్నాను. సినిమాలో ఎలాంటి మెసేజ్‌ ఉండదు'' అన్నారు.

నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ - ''దండుపాళ్యం చిత్రానికి సీక్వెల్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్‌ డూపర్‌హిట్‌ అయి శతదినోత్సవం జరుపుకుంది. ఈ సీక్వెల్‌ను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. జూన్‌, జూలై నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved