pizza
Anand Deverakonda's Duet Movie Launch
Studio Green, Hero Anand Deverakonda, Ritika Nayak's "Duet" movie launched with a grand pooja ceremony
ఘనంగా ప్రారంభమైన స్డూడియో గ్రీన్, హీరో ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్ "డ్యూయెట్" సినిమా
You are at idlebrain.com > News > Functions
Follow Us


02 November 2023
Hyderabad

Studio Green, Hero Anand Deverakonda, Ritika Nayak's "Duet" movie launched with a grand pooja ceremony

Talented hero Anand Devarakonda's new movie "Duet" has started grandly in Hyderabad today. This film is being produced by KE Gnanavel Raja under Studio Green Banner with lavish making on a huge budget. Mathura Sreedhar Reddy is acting as co-producer. Mithun Varadaraja Krishnan, who worked under star director AR Murugadoss, is making his directorial debut with "Duet". Ritika Nayak is playing the heroine in this movie.

The opening ceremony of the movie "Duet" was held at Annapurna Studios in Hyderabad. Hero Vijay Devarakonda, directors Harish Shankar, Chandu Mondeti, Sai Rajesh, hero Satya Dev Anand's parents Govarthan Devarakonda and Madhavi were present as guests in this program. Blockbuster director Harish Shankar garu sounded the clapboard for the muhurtham shot, while Govardhan Deverakonda and Madhavi Deverakonda garu switched on the camera. Talented filmmaker Chandoo Mondeti directed the first shot. Producer Gnanavel Raja, director Sai Rajesh and Madhura Sreedhar handed over the script to the makers. On this occasion,

Co-producer Madhura Sreedhar Reddy said - I am happy to produce a duet film with Gnanavel Raja under Studio Green. After the super hit love story like Baby, Anand's yet another different love story film. Now variety of love stories are unfolding in Tollywood. In that sequence the duet also becomes a different kind of love story. Director Mithun has written a fantastic story. A talented team is working for this movie. All the best to the team.

Director Mithun Varadaraja Krishnan said - I'm happy to be introduced to Tollywood as a director with the film Duet. This is a good love story. Thanks to producer KE Gnanavel Raja for giving me the opportunity to be a director. I am also thankful to Anand. Madhura Sridhar is there to solve any problem our team has. Thanks to everyone who is supporting us.

Hero Anand Deverakonda said - Duet is a special movie for me. When he shared the title of this movie with his friends in the industry, he said, "It is a good title. It would have been better if we register it." From there positive vibes started on the duet. Thanks to the producers Gnanavel Raja and Madhura Sridhar who selected me for this movie. Gnanavel garu has done big movies in Tamil with Surya and Karthi. Here I have to produce with my elder brother as well. Gnanavel Raja is going to do big movies in Telugu. I want the movies in that huge line-up to be successful. I feel very happy that GV Prakash Kumar is the music director of our film. I have been his fan since the movie Aadukalam. Ritika played a superb role in Ashokavanamlo Arjuna kalyanam movie.. I wish her all the best for this film. Mithun has written an amazing story. We are going to make a good movie with our team.

Heroine Ritika Nayak said - I was mesmerized when I heard the story of the duet. Curiosity arose as to when we will go for shooting. It is an honor to work with Anand. Thanks to director Mithun, producers Gnanavel and Sridhar for giving me this opportunity.

Producer KE Gnanavel Raja said - Just like I did movies in Kollywood with Surya and Karthi, here I did Nota with Vijay and I am producing a duet movie with Anand. I have known Anand for a long time. He is always smiling and positive. We wanted to give him his first blockbuster hit in our company. When this film was committed, he did not know that he was doing a film called Baby. The movie became a super hit. We didn't get a chance to give Anand his first blockbuster. I like action and commercial entertainers more than love stories. But when Mithun told this story, I got emotional on many occasions. When I heard the story of the duet, I got the same feeling as I felt when I saw Atlee's first movie Raja Rani. Mathura Sridhar is supporting us. Not only this film, he will continue to be a part of the projects we have done in our Studio Green organization. Our director said that Ritika's acting is good. Wishing her all the best. GV Prakash was in Chennai and could not come. He said he will come to the next event. He has already given two songs for our movie. We will start the first schedule in a week. The entire team is confident that the duet will be a super hit.

Actors - Anand Devarakonda, Ritika Nayak, Rao Ramesh and others

Technical team
Studio Green Team :
Neha GnanavelRaja, G Dhananjayan, AG Raja, Murali Krishna.
Cinematography - Arun Radhakrishnan
Editing - GK Prasanna
Production Designer - Udaya Kumar
Music - GV Prakash Kumar
Banners - Studio Green
Co Producer - Mathura Sreedhar Reddy
Producer - KE Gnanavel Raja
Written and Directed by - Mithun Varadaraja Krishnan

ఘనంగా ప్రారంభమైన స్డూడియో గ్రీన్, హీరో ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్ "డ్యూయెట్" సినిమా

స్టార్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "డ్యూయెట్" ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో లావిష్ మేకింగ్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దగ్గర పనిచేసిన మిథున్ వరదరాజ కృష్ణన్ "డ్యూయెట్"తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో "డ్యూయెట్" సినిమా ప్రారంభోత్సవం ‌వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు హరీశ్ శంకర్, చందూ మొండేటి, సాయి రాజేశ్,హీరో సత్య దేవ్ ఆనంద్ పేరెంట్స్ గోవర్థన్ దేవరకొండ, మాధవి అతిథులుగా హాజరయ్యారు. మూహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ నివ్వగా...దర్శకుడు సాయిరాజేశ్, జ్ఞానవెల్ రాజా , సహ నిర్మాత మధుర శ్రీధర్ స్క్రిప్ట్ ను దర్శకుడు మిథున్ కి అందజేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ చందూ మొండేటి చేశారు. ఆనంద్ పేరెంట్స్ గోవర్ధన్ దేవరకొండ మాధవి దేవరకొండ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా

కో ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - స్టూడియో గ్రీన్ సంస్థలో జ్ఞానవేల్ రాజా గారితో కలిసి డ్యూయెట్ సినిమా ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఉంది. బేబి వంటి సూపర్ హిట్ లవ్ స్టోరి తర్వాత ఆనంద్ చేస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రమిది. టాలీవుడ్ లో ఇప్పుడు వెరైటీ లవ్ స్టోరీస్ తెరకెక్కుతున్నాయి. ఆ క్రమంలో డ్యూయెట్ కూడా ఒక వైవిధ్యమైన ప్రేమ కథ అవుతుంది. డైరెక్టర్ మిథున్ ఫెంటాస్టిక్ స్టోరీ రాశాడు. టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

దర్శకుడు మిథున్ వరదరాజ కృష్ణన్ మాట్లాడుతూ - డ్యూయెట్ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇదొక మంచి లవ్ స్టోరి. దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్. ఆనంద్ కు కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. మధుర శ్రీధర్ గారు మా టీమ్ కు ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేయడానికి ఉన్నారు. మాకు సపోర్ట్ అందిస్తున్న అందరికీ థ్యాంక్స్. అన్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - డ్యూయెట్ నాకొక స్పెషల్ మూవీ. ఈ సినిమా టైటిల్ ను ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడు మంచి టైటిల్..మేము రిజిస్టర్ చేసుకుంటే బాగుండేది అన్నారు. అక్కడి నుంచి డ్యూయెట్ మీద పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. ఈ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకున్న నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్. జ్ఞానవేల్ గారు తమిళంలో సూర్య, కార్తి గారితో పెద్ద మూవీస్ చేశారు. ఇక్కడ నాతో మా అన్నయ్యతో అలాగే ప్రొడ్యూస్ చేయాలి. తెలుగులో బిగ్ మూవీస్ చేయబోతున్నారు జ్ఞానవేల్ రాజా. ఆ భారీ లైనప్ లోని మూవీస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మా సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఆడుకాలం మూవీ నుంచి నేను ఆయనకు ఫ్యాన్ ను. అశోకవనంలో అర్జునకల్యాణం మూవీలో రితిక సూపర్బ్ గా నటించింది. ఈ సినిమాకు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మిథున్ అమేజింగ్ స్టోరీ రాశాడు. మా టీమ్ తో కలిసి ఒక మంచి మూవీ చేయబోతున్నాం. అన్నారు.

హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ - డ్యూయెట్ కథ విన్నప్పుడు మెస్మరైజ్ అయ్యాను. ఎప్పుడు షూటింగ్ కు వెళ్దామా అనేంత క్యూరియాసిటీ ఏర్పడింది. ఆనంద్ గారితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మిథున్, ప్రొడ్యూసర్స్ జ్ఞానవేల్, శ్రీధర్ గారికి థ్యాంక్స్. అని చెప్పింది.

నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - నేను సూర్య, కార్తీతో కోలీవుడ్ లో మూవీస్ చేసినట్లే..ఇక్కడ విజయ్ తో నోటా సినిమా చేశాను, ఆనంద్ తో డ్యూయెట్ మూవీ నిర్మిస్తున్నాను. ఆనంద్ నాకు చాలాకాలంగా తెలుసు. ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్ గా ఉంటాడు. అతనికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మా సంస్థలోనే ఇవ్వాలనుకున్నాం. ఈ సినిమా కమిట్ అయినప్పుడు ఆయన బేబి అనే సినిమా చేస్తున్నాడని తెలియదు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆనంద్ కు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చే అవకాశం మాకు దొరకలేదు. నాకు లవ్ స్టోరీస్ కంటే యాక్షన్, కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ఇష్టం. అయితే మిథున్ ఈ కథ చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. అట్లీ ఫస్ట్ మూవీ రాజా రాణి చూసినప్పుడు ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో డ్యూయెట్ కథ విన్నప్పుడు కూడా అలాంటి ఫీల్ కలిగింది. మధుర శ్రీధర్ గారు మాకు సపోర్ట్ గా ఉన్నారు. ఈ సినిమానే కాదు మా స్టూడియో గ్రీన్ సంస్థలో రాబోయో ప్రాజెక్ట్స్ కు కూడా ఆయన ఒక భాగంగా కొనసాగుతారు. రితిక యాక్టింగ్ బాగుంటుందని మా డైరెక్టర్ చెప్పారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. జీవీ ప్రకాష్ చెన్నైలో ఉండి రాలేకపోయాడు. నెక్ట్ ఈవెంట్ కు వస్తా అన్నాడు. ఇప్పటికే ఆయన మా మూవీకి రెండు సాంగ్స్ ఇచ్చాడు. వారం రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. డ్యూయెట్ సూపర్ హిట్ అవుతుందనే టీమ్ అంతా నమ్మకంగా ఉన్నాం. అన్నారు.

నటీనటులు - ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్, రావు రమేష్ తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ - అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటింగ్ - జీకే ప్రసన్న
ప్రొడక్షన్ డిజైనర్ - ఉదయ కుమార్
మ్యూజిక్ - జీవీ ప్రకాష్ కుమార్
బ్యానర్స్ - స్టూడియో గ్రీన్
కో ప్రొడ్యూసర్ - మధుర శ్రీధర్ రెడ్డి
ప్రొడ్యూసర్ - కేఈ జ్ఞానవేల్ రాజా
రచన దర్శకత్వం - మిథున్ వరదరాజ కృష్ణన్

 

Photo Gallery

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved