pizza
Malupu release on 19 February
Kalyan Cine Creations production No. 1 movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 February 2016
Hyderabad

క‌ళ్యాణ్ సినీ క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం1 చిత్రం ప్రారంభం

కాశ్య‌ప్‌, చాందిని హీరో హీరోయిన్లుగా క‌ళ్యాణ్ సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నూత‌న చిత్రం ఫిభ్ర‌వ‌రి17, బుధ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. శ్రీరాంబాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.జాహ్న‌వి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి స‌న్నివేశానికి కిషోర్ పార్థ‌సాని క్లాప్ కొట్టారు. బ‌సిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. మ‌ల్కాపురం శివ‌కుమార్ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

నిర్మాత ఎం.జాహ్న‌వి మాట్లాడుతూ ``ఈ సినిమాతో కాశ్య‌ప్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాం. అల్రెడి చాలా సినిమాల్లో న‌టించిన చాందిని ఈ చిత్రంలో న‌టిస్తుంది. మంచి డైలాగ్స్ కుదిరాయి బంటిగారు మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చి మొద‌టివారంలో సినిమా స్టార్ట‌వుతుంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీరామ్ బాలాజీ మాట్లాడుతూ ``చిరుజ‌ల్లు సినిమా చూసిన క‌ళ్యాణ్ రామ‌కృష్ణ‌గారు ఈ సినిమా ద‌ర్శ‌కత్వ బాధ్య‌త‌ల‌ను నాకు అప్ప‌గించారు. ల‌క్ష్మీ, కాశీవిశ్వ‌నాథ్‌, అలీ స‌హా ప్ర‌ముఖ న‌టీన‌టులంతా సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాతో కాశ్యప్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్‌పై ఆరునెల‌లు పాటు వ‌ర్క్ చేశాం. న‌టీన‌టుల‌కు మూడు నెల‌లు పాటు వ‌ర్క్ షాప్ నిర్వ‌హించాం. న‌ట‌న ప‌రంగా కాశ్య‌ప్ అన్న‌పూర్ణ స్టూడియోలో ట్ర‌యినింగ్ తీసుకున్నారు. మార్చి మొద‌టివారంలో సినిమా చిత్రీక‌ర‌ణ స్టార్ట్ చేస్తాం. మేనెలకంతా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి జూన్ నెల‌లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌. యూత్‌కు న‌చ్చే ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయి`` అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శ్రీమ‌తి ఎం.పావ‌ని మాట్లాడుతూ``మంచి టీం కుదిరింది. చాందిని హీరోయిన్‌గా న‌టిస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అవుతుంది అన్నారు

హీరో కాశ్య‌ప్ మాట్లాడుతూ ``అన్న‌పూర్ణ స్టూడియోలో ట్ర‌యిన‌ప్ అయ్యాను. మంచి స్టోరీ. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే చిత్ర‌మ‌వుతుంది. అంద‌రూ ఆశీర్వదిస్తార‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ బంటి మాట్లాడుతూ ``నేను, క‌ళ్యాణ్ రామ‌కృష్ణ మంచి స్నేహితులం. శ్రీరామ్ సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. నా మిత్రుడు త‌న‌యుడు చేస్తున్న సినిమా ఇది. ఇందులో ఆరు పాటలు ఉంటాయి`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కాశీవిశ్వ‌నాథ్‌, హీరోయిన్ చాందిని త‌దిత‌రులు పాల్గొన్నారు.

ల‌క్ష్మి, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, కాశీవిశ్వనాథ్‌, అలీ, ప్ర‌గ‌తి, హేమ‌, జ‌య‌వాణి, ప్ర‌భాస్ శ్రీను, గుండు సుద‌ర్శ‌న్‌, డ్రాగ‌న్ ప్రకాష్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణం.

మూల‌క‌థః క‌ళ్యాణ్‌, క‌థ‌, మాట‌లుః మ‌ల్కార్ శ్రీనివాస్‌, పాట‌లుః సుద్దాల అశోక్‌తేజ‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి, బ‌ల‌భ‌ద్ర‌పాత్రుని మ‌ధు, సంగీతంః బంటి, సినిమాటోగ్ర‌ఫీః వంశీకృష్ణ‌, ఎడిట‌ర్ః ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌, డ్యాన్స్ః నిక్స‌న్ డి క్రూజ్‌, ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః శ్రీమ‌తి ఎం.జాహ్న‌వి, నిర్మాతః ఎం.జాహ్న‌వి, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీరామ్ బాలాజీ.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved