సునీల్, మియా హీరో హీరోయిన్లుగా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ పతాకంపై నూతన చిత్రం సోమవారం హైదరాబాద్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది. క్రాంతిమాధవ్ దర్శకుడు. పరుచూరి కిరిటీ నిర్మాత. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశానికి దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, డి.సురేష్‌బాబు క్లాప్ కొట్టారు. క్రాంతి మాధవ్ గౌరవ దర్శకత్వం వహించారు. రమేష్ ప్రసాద్ స్క్రిప్ట్‌ను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ``క్రాంతి మాధవ్ మంచి సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్‌లో సునీల్ సినిమా చేయడం ఆనందంగా ఉంది. తెలుగులో తొలి సినిమా చేస్తున్న హీరోయిన్ మియాకు మంచి బ్రేక్ రావాలి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
హీరో సునీల్ మాట్లాడుతూ ``రెండు గంటలు కథ విన్నతర్వాతే సినిమా చేయడానికి అంగీకరించాను. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే సెట్స్‌లోకి వెళుతున్నాం. నిర్మాత కిరిటీ మంచి స్నేహితుడు, నిర్మాత. ఈ చిత్రం నా కెరీర్‌లో మంచి హిట్ అవుతుందని భావిస్తున్నాను`` అన్నారు.
పరుచూరి కిరిటీ మాట్లాడుతూ ``రెండు మూడు నెలలుగా ఈ స్క్రిప్ట్‌తో ట్రావెల్ అవుతున్నాం. సునీల్‌గారు కథ వినగానే ఎగ్జయిట్ అయ్యి చేయడానికి ఓకే చెప్పారు. కొత్త టీంతో కలిసి చేస్తున్న సినిమా. సునీల్‌గారికి పెద్ద హిట్ మూవీ అవుతుంది`` అన్నారు.
Miya GeorgeGlam gallery from the event
డైరెక్టర్ క్రాంతిమాధవ్ మాట్లాడుతూ ``మళ్లీమళ్లీ ఇది రానిరోజు తర్వాత ఒక సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. ఓ కామెడి సినిమా చేయాలనే తపనతో చేస్తున్న సినిమా. హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సునీల్ సినిమాల్లోని కామెడి కంటే కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్‌కు సునీల్ అయితేనే యాప్ట్ అవుతారనిపించి ఆయనకు కథ వినిపిండచం, ఆయన ఓకే అనడం జరిగింది. ఆయనతో సినిమా చేస్తున్నందుకు హ్యపీగా ఉంది. జిబ్రాన్ సంగీం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి చిత్రీకరణ జరుపుకుంటుంది`` అన్నారు.
హీరోయిన్ మియా మాట్లాడుతూ ``తమిళం, మలయాళంలో సినిమాలు చేశాను. తెలుగులో తొలి చిత్రం. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత పరుచూరి కిరిటీ తదితర చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
సునీల్, మియా, సంపత్, అలీ, ఆశిష్ విద్యార్థి, వెన్నెలకిషోర్, పృథ్వీ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్ తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ః జిబ్రాన్, ఆర్ట్ డైరెక్టర్ః ఎ.యస్.ప్రకాష్, ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్ః చంద్రమోహన్ చింతాద, నిర్మాతః పరుచూరి కిరిటీ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంః కె.క్రాంతిమాదవ్.