pizza
Laila O Laila movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

7 September 2015
Hyderabad

జి‌కే సినిమా పతాకం పై 'లైలా ఓ లైలా' చిత్రం ఈ రోజు వైజాగ్ లో ఘనంగా ప్రారంభం అయింది. నూతన నటీనటులు కార్తీక్ మరియు శ్వేత వర్మ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. జి సంతోషి కుమారి నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి అప్ప రావు క్లాప్ ఇవ్వగా ఎం‌వి రఘు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, ఈ చిత్రానికి దర్శకత్వం వహింస్తున్న ఎస్ నౌషాద్ ప్రారంభ సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్, ఎఫ్‌ఎం బాబాయి కూడా పాల్గొన్నారు .

అనంతరం పాత్రికేయుల సమావేశం లో, దర్శకుడు ఎస్. నౌషాద్ మాట్లాడుతూ "ఇది కామిడీ తో కూడిన ఒక ప్రేమ కథ చిత్రం. ఉందిలే మంచి కాలం ముందుముందున్న లో ద్వితీయ హీరో గా నటించిన కార్తీక్ ఈ చిత్రం లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం .అని రకల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ నెల 11నా షూటింగ్ ప్రారంభం కానుంది".

నిర్మాత జి. సంతోషి కుమారి మాట్లాడుతూ "నాకు ఈ చిత్రం కథ చాలా బాగా నచ్చింది, వెంటనే ఈ చిత్రని నిర్మించడానికి ఒప్పుకున్నాను. ఈ నెల సెప్టెంబర్ 11నా షూటింగ్ ప్రారంభం కానుంది, కథ డిమాండ్ మేరకు ఆరకు, వైజాగ్ మరియు పండిచ్చేరి షూటింగ్ జరుపుకుంటున్నం. ఈ చిత్రం లోని 5 పాటలను విదేశాల్లో చిత్రకరించాలనుకుంటున్నాం. డిసెంబర్ లో క్రిస్మస్ కనుకుగా విడుదల చేయాలనుకుంటున్నం" అని చెప్పారు.

హీరో కార్తీక్ మాట్లాడుతూ ".నేను ఉందిలే మంచి కాలం ముందుముందున్నచిత్రం లో ద్వితీయ హీరో గా నటించాను, నాకు ఈ చిత్రా కథ చాలా భాగానచ్చింది, ఈ సినిమా కోసం మరో రెండు సినిమాలు ఒదులుకున్నాను. ప్రక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది అని ఆశిస్తున్నాను".

కార్తీక్ మరియు శ్వేత వర్మ ముఖ్య పాత్రలు గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యా, సాయి, సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్, ప్రియాంకా, పావని మరియు చంద్రకళ తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫి : కే. ప్రవీణ్, ఎడిటింగ్ : యూ‌బి ఉద్దవ్, సంగీతం : గౌతమ్ డాన్ని , ప్రొడక్షన్ మేనేజర్ : శేఖర్, మాటలు : ఆభై శ్రీ జై , కొ-డైరెక్టర్ : బి. సంతోష్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ఎస్ నౌషాద్.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved