యుని క్రాఫ్ట్ మూవీస్ బ్యానర్ పై ఆర్.పి.పట్నాయక్ హీరోగా నటిస్తూ దర్శకత్వం రూపొందించనున్న నూతన చిత్రం ‘మనలో ఒకడు’. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. జి.సి.జగన్మోహన్ నిర్మాత. ముహుర్తపు సన్నివేశానికి వేణుగోపాలచారి క్లాప్ కొట్టారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాక్రిష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ఆంధ్ర మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ ‘’ నిర్మాత మంచి టెస్ట్ ఫుల్, ప్యాషనేట్ ఉన్న వ్యక్తి. 50-60 కథలు విని నచ్చక సినిమా చేయలేదు. నేను చెప్పిన కథ వినడంతో ఆయనకు కథ నచ్చి సినిమా స్టార్ట్ చేశాడు. బ్రోకర్ తర్వాత నేను చేసిన హార్డ్ హిట్టింగ్ మూవీ ఇది. సిల్లీగా కనిపించే సీరియస్ ప్రాబ్లంపై సినిమా ఉంటుంది. సినిమాలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. మనలోని మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన కథ. కథ విన్నవాళ్ళు బ్రోకర్ బావుందని అందరూ అంటున్నారు. ఇందులో జూనియర్ లెక్చరర్ పాత్ర చేస్తున్నాను. మార్చి 10 నుండి ఏకధాటిన సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసేస్తాం. అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే జూన్ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం. సినిమాలో నాలుగు సాంగ్స్ ఉన్నాయి. 2016లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది’’ అన్నారు.
నిర్మాత జి.సి.జగన్మోహన్ మాట్లాడుతూ ‘’నిర్మాతగా తొలి చిత్రం. ఎన్నోకథలు విన్నాను. ఈ కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. సోసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే మూవీ. అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
AnitaGlam gallery from the event
చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’మధ్యతరగతి ప్రజలు వారి విలువల కోసం పోరాడుతుంటారు. అపరిమితమైన ప్రభావం చూపించే మీడియా ఏం చేసిందనేదే సినిమా. ఒక మంచి ప్రయత్నం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సందేశ్, సినిమాటోగ్రాఫర్ ఎస్.జె.సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.పి.పట్నాయక్, అనిత(నువ్వు నేను ఫేమ్), సాయికమార్, నాజర్, తనికెళ్ళభరణి, సందేశ్, రఘుబాబు, రాజారవీంద్ర, శరత్ బాబు, బెనర్జి, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్: సి.హెచ్.కృష్ణ, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ: ఎస్.జె.సిద్ధార్థ్, డైలాగ్స్: తిరుమల్ నాగ్, కో ప్రొడ్యూసర్స్: హెచ్.ఎ.ఉమేష్ గౌడ, పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొడ్యూసర్ : జి.సి.జగన్మోహన్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్.