pizza
Manikarnika Title Logo Launched In Varanasi
వారణాసి వేదికగా విడుదలైన "మణికర్ణిక" టైటిల్ లోగో !!
You are at idlebrain.com > News > Functions
Follow Us

04 May 2017
Hyderabad

Best known for acclaimed flicks like Gamyam, Vedam, Krishnam Vande Jagadgurum and Gautamiputra Satakarni, director Krish uplifted the values and morals in Telugu cinema. Krish also proved himself in Bollywood with Gabbar is Back.

Currently, Krish is directing a new Hindi project titled Manikarnika based on the life of brave, ferocious in any term Jhansi Rani Laxmi Bai. Amazingly talented Kangna Ranaut is playing the title character.

Manikarnika is presented by Zee Studios, produced by Kamal Jain on Kairos Kontent Studios banner. Vijayendra Prasad penned the story, screenplay and Shankar, Ehsan, Loy are the music directors.

Manikarnika title logo launch and release date announcement event is held today in Varanasi. Entire team participated in the event and 20 feet Manikarnika title logo poster is also released. Manikarnika release date is announced as April 27, 2018 in Hindi, Telugu and Tamil languages.

వారణాసి వేదికగా విడుదలైన "మణికర్ణిక" టైటిల్ లోగో !!

తెలుగులో "గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందింపజేసిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్ లోనూ "గబ్బర్ ఈజ్ బ్యాక్"తో తన సత్తాను చాటుకొన్నాడు. ఆయన తాజాగా తెరకెక్కించనున్న బాలీవుడ్ చిత్రం "మణికర్ణిక". వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చారిత్రక చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తోంది.

జీ స్టూడియోస్ సమర్పణలో కమల్ జైన్ ఈ చిత్రాన్ని కైరోస్ కంటెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చుతున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం సంగీత దర్శకత్వం వహించనున్నారు.

"మణికర్ణిక" టైటిల్ లోగో విడుదల మరియు రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ కార్యక్రమం వారణాసిలో జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర బృందం వారణాసిలో 20 అడుగుల పొడుగు "మణికర్ణిక" టైటిల్ లోగో పోస్టర్ ను విడుదల చేశారు. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది.. అనగా ఏప్రిల్ 27, 2018 విడుదల చేస్తున్నట్లు తెలిపారు!

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved