అర్మాన్ సమర్పణలో తారా నీలు కో ఆపరేషన్స్ పతాకంపై ప్రదీప్, కిరణ్, ధీరేంద్ర, మమత ప్రధాన తారాగణంగా కొత్త చిత్రం మంత్రం తంత్రం యంత్రం శనివారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఎం.ఎస్.బాబు స్వీయ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతున్న ఈ సినిమా ముహుర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, వరంగల్ పార్లమెంట్ సభ్యుడు దయాకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. చంద్రబోస్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
దర్శక నిర్మాత ఎం.ఎస్.బాబు మాట్లాడుతూ‘’హర్రర్, థ్రిల్లర్, కామెడి సహా అన్నీ ఎలిమెంట్స్ తో సినిమాను తెరకెక్కిస్తాం. గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత నా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. బాగా స్టడీ చేసిన పాయింట్ తో సినిమా ఉంటుంది. వరగంల్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ ను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాం’’ అన్నారు.
హీరో అంబేద్కర్ మాట్లాడుతూ‘’నేను కొన్ని నాటకాలు, షార్ట్ మూవీస్ చేశాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ మమత మాట్లాడుతూ‘’తెలుగులో ఇంతకు ముందు కాలింగ్ బెల్, పంచముఖి సినిమాల్లో నటించాను. నా పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్ సభ్యులు దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉపేంద్ర, కెమెరా: గిరి దోసాడ, కథ: మహేశ్వర్, సహకారం: రమేష్ గౌడ్, సహ నిర్మాతలు: అంబాల రవి, మోతే ప్రకాష్ రెడ్డి, ఎన్.అప్సర. ఎస్.కె.ముఖ్బాల్, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఎం.ఎస్.బాబు.