
27 September 2014
Hyderabad
ఆశ్రీత్ మూవీస్ బ్యానర్ పై రమా రవి శంకర్ నిర్మిస్తున్న ' మెహబ్బత్ మె ' మూవీ హైద్రాబాద్ ఎన్టీరంగా అగ్రికల్చరల్ యూనివర్శిటిలో ప్రారంభమైంది. నూతననటీనటులను పరిచయం చేస్తూ గబ్బర్ సింగ్ టీమ్ ప్రధానపాత్రధారులుగా మహేష్ సూర్య తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ రాజకీయవేత్త ,తెలంగాణ స్టేట్ శాసనమండలి చైర్మెన్ శ్రీ స్వామి గౌడ్ క్లాప్ నిచ్చి ప్రారంబించారు.మొదటి షెడ్యూల్ లో టాకీ పార్ట్ పూర్తి చేసి ,రెండో షెడ్యూల్ పాటలను డిఫరెంట్ లోకెషన్స్ లో షూట్ చేసి పిభ్రవరి 14 ప్రేమికుల రోజున 'మెహబ్బత్ మె ' చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు మహేష్ సూర్య తెలిపారు..
బ్యానర్ : ఆశ్రీత్ మూవీస్ , కథ ,స్కీన్ ప్లే ,మాటలు ,దర్శకుడు : మహేష్ సూర్య , నిర్మాత : రమా రవి శంకర్ ,సంగీతం : మీనాక్షి భుజంగ్.

