pizza
Nenu Naa Boy Friends movie launch
ప్రారంభమైన 
నేను నా బాయ్ ఫ్రెండ్స్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

8 April 2016
Hyderabad

మహాలక్ష్మి, మానస సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై హేబా పటేల్, పునర్నవి, నోయెల్, పార్వతీశం ప్రధాన తారణంగా నూతన చిత్రం నేను నా బాయ్ ఫ్రెండ్స్’. ఏప్రిల్ 8న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్(గోపి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. డి.సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘’ఉగాది సందర్భంగా మా బ్యానర్ లో నూతన చిత్రం ప్రారంభం కావడం అనేది చాలా హ్యపీగా ఉంది. మా బ్యానర్ రీసెంట్ గా సూపర్ హిట్టయిన సినిమా చూపిస్తమావ సినిమా తర్వాత చాలా కథలను విన్నప్పటికీ మాకు అంతగా ఏదీ నచ్చలేదు. భాస్కర్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాం. అతన్నే డైరెక్ట్ చేయమని అన్నాం. భాస్కర్ గతంలో వినాయక్ దగ్గర కో డైరెక్టర్ గా వర్క్ చేశారు. మంచి యూత్ ఫుల్ సబ్జెక్ట్’’ అన్నారు.

డైరెక్టర్ బండి భాస్కర్ మాట్లాడుతూ ‘’ఉగాది రోజున డైరెక్టర్ గా పరిచయం కావడం హ్యపీగా ఉంది. వినాయక్ గారి ప్రియ శిష్యుడిని. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే చిత్రమవుతుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్టయింది. సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ ‘’ఈ బ్యానర్ నాకు హోం బ్యానర్. ఈ బ్యానర్ లో మూడో సినిమా చేస్తున్నాను. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉన్న సినిమా’’ అన్నారు.

హేబా పటేల్ మాట్లాడుతూ ‘’కుమారి 21ఎఫ్ చిత్రం తర్వాత చేసిన సినిమా ఇది. మంచి రోల్ చేస్తున్నాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో పునర్నవి, సినిమాటోగ్రాఫర్ విశ్వ డి.బి తదితరులు పాల్గొన్నారు.

హేబా పటేల్, పునర్నవి, నోయెల్, పార్వతీశం, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: లక్కీ మీడియా, మాటలు: నంద్యాల రవి, కెమెరా: విశ్వ డి.బి, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, సంగీతం: శేఖర్ చంద్ర, సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్, రచన: సాయికృష్ణ, ఆర్ట్: ఎస్.రామకృష్ణ మోనిక నిగోత్రే, అసోసియేట్ ప్రొడ్యూసర్: గంజి రమేష్ కుమార్, ప్రొడ్యూసర్: బెక్కం వేణుగోపాల్(గోపి), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భాస్కర్ బండి. 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved