
21 May 2014
Hyderabad
యంగ్ హీరో నితిన్ కధానాయకుడిగా ప్రేమకధా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఈ రోజు ప్రారంభమయింది. శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి,సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.విక్రమ్ గౌడ్ సమర్పకులు.నితిన్ సరసన బాలీవుడ్ కదానాయిక మిస్తీ జోడి కడుతోంది.ముహూర్తపు షార్ట్ కు నిర్మాత రామ్ మోహన్ రావు క్లాప్ నివ్వగా..సదానంద్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. వి వి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత నికితా రెడ్డి మాట్లాడుతూ..జూన్ 2 న రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంబి౦చుకునే ఈ సినిమా ఇండియాతో పాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంటుంది. ..శ్రేస్ట్ మూవీస్‌లో గతంలో వచ్చిన ఇష్క్, గుండేజారి గల్ల౦తయ్యి౦దే లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి:ఆండ్రూ,ఆర్ట్ రాజీవ్ నాయర్ ,సమర్పణ: విక్రమ్ గౌడ్.


