4 September 2016
Hyderabad
దిలీప్, పూనమ్ కౌర్, అక్షిత హీరో హీరోయిన్లుగా శ్రీ విజయానంద్ పిక్చర్స్ బ్యానర్ పై జి.యస్.వి.సత్యప్రసాద్ దర్శకత్వంలో యం.డి.సలీమ్ నిర్మాణ నిర్వహణలో ఎ.నరేందర్, విజయానంద్, సురేష్ గౌడ్ నిర్మాతలుగా కొత్త చిత్రం ప్రణయం ఆదివారం హైదరాబాద్ దైవసన్నిధానమ్ లో ప్రారంభమైంది. గుణ్ణం గంగరాజు స్క్రిప్ట్ అందించారు. ముహుర్తపు సన్నివేశానికి రఘుబాబు క్లాప్ కొట్టగా, సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో....
చిత్ర దర్శకుడు జి.యస్.వి.సత్యప్రసాద్ మాట్లాడుతూ - `` సిన్సియర్ లవ్ స్టోరీ. కో ప్రొడ్యూసర్ నరేంద్ర కారణంగానే సినిమా చేయగలుగుతున్నాను. పూనమ్ కౌర్ మంచి స్నేహితురాలు. దిలీప్ ను హీరోగా పరిచయం చేస్తున్నాను. మా యూనిట్ కి మంచి బ్రేక్ ఇచ్చే చిత్రమవుతుంది. పూనమ్ కౌర్ ఇందులో ఇన్వెస్టిగేటివ్ లాయర్ పాత్రలో నటిస్తుంది. ఆమె పాత్ర మెయిన్ గా ఉంటుంది లాఖరున సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది`` అన్నారు.
Glam galleries from the event |
|
|
సహ నిర్మాత నరేందర్ మాట్లాడుతూ - ``దర్శకుడు చెప్పిన కథ వినగానే నచ్చింది. అందుకే సినిమా నిర్మాణానికి రెడీ అయ్యాం. కొత్తగా ఉంటుంది. అందరికీ నచ్చే చిత్రమవుతుంది. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని బావిస్తున్నాం`` అన్నారు.
హీరో దిలీప్ మాట్లాడుతూ - ``ఈ సినిమా చేయడానికి దర్శకుడు సత్యప్రసాద్ గారు, కథ, పూనమ్ కౌర్, మ్యూజిక్ డైరెక్టర్ కారణంగానే ఈ సినిమా చేస్తున్నాను`` అన్నారు.
పూనమ్ కౌర్ మాట్లాడుతూ - ``రియల్ లైఫ్ లో లాయర్ కావాలనుకున్నాను. ఈ సినిమాలో లాయర్ ఫాత్ర యేచడం ఎగ్జయిటింగ్ గా ఉంది. దర్శకుడు సత్యప్రసాద్ గారు నా క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశారు. మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: కె.యం.రాధాకృష్ణ, కెమెరా: రామ్ కుమార్, మాటలు, పాటలు: దేవవరపు నీలకంఠరావు, నిర్మాతలు: ఎ.నరేందర్, విజయానంద్, సురేష్ గౌడ్, నిర్మాణ, నిర్వహణ: యం.డి.సలీమ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.యస్.వి.సత్యప్రసాద్.



