అమ్మనాన్న ఫిలింస్ పతాకంపై రాహుల్ రవీంద్రన్, నిత్యశెట్టి, తరుణిక ప్రధాన పాత్రల్లో రాథోడ్ ఎం. దర్శకత్వంలో మణీంద్రన్ ఎం. నిర్మిస్తున్న చిత్రం 'రామసక్కనోడు'. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మణీంద్రన్ ఎం. మాట్లాడుతూ... 'సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది. ఈరోజు నుంచి 15 రోజులపాటు షెడ్యూల్ జరపనున్నాం. తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను' అన్నారు.
దర్శకుడు రాధోడ్ ఎం. మాట్లాడుతూ... 'మా నిర్మాతలు ఏ విషయంలో రాజీపడకుండా సినిమాను ప్లాన్ చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందీ చిత్రం. కథకు తగ్గ ఆర్టిస్టులు దొరికారు' అన్నారు.
హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... 'ఈ స్క్రిప్ట్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దర్శకుడు రాథోడ్‌గారు క్లారిటీతో సినిమా చేస్తున్నారు' అన్నారు.