pizza
Ram Charan - Srinu Vaitla movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

05 March 2015
Hyderabad

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల', ప్రముఖ నిర్మాత 'దానయ్య డి.వి.వి.'ల చిత్రం ప్రారంభం



మెగాస్టార్ చిరంజీవి దంపతులు, సెన్సేషనల్ దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథులు..
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల'ల పవర్ ఫుల్ కాంబినేషన్...
ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఈ రోజు (మార్చి 5) ఉదయం 6 గంటల 24 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో వైభవంగా ప్రారంభమైంది.

దేవుని ఫోటోలపై మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ గారు క్లాప్ ఇవ్వడం జరిగింది. చిత్రం స్రిప్ట్ ను మెగాస్టార్ చిరంజీవి గారు దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత దానయ్య డి.వి.వి.లకు అందజేశారు . దర్శకుడు వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ "ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. . కథ చాలా బాగా వచ్చింది. రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లతో నా కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. మళ్ళీ మా కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందటం ఎంతో ఆనందాన్నిస్తోంది. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎంతో అంకితభావంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ " మా శ్రీను చెప్పినట్టు ఒక అద్భుతమైన కథ ఈ సినిమాకి కుదిరింది. కొంత గాప్ తర్వాత మళ్ళీ మేము ఈ ప్రాజెక్ట్ కోసం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా మొత్తం చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. పని చేసేటప్పుడు ఎంత జోష్ గా ఫీల్ అయ్యామో రేపు థియేటర్ లో కూడా అదే జోష్ కనిపిస్తుంది. మేము, శ్రీను వైట్ల - కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ కథలనే నమ్ముతాం. అవే మమ్మల్ని ఈ స్థాయి కి తీసుకొచ్చాయి. ఈ సినిమా మా శ్రీను మార్క్ తో ఉండబోతోందని నేను ఖచ్చితంగా చెప్పగలను." అన్నారు. గోపి మోహన్ మాట్లాడుతూ " మా శ్రీను గారితో మళ్ళీ కలిసి పని చెయ్యటం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ " నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు." అన్నారు. "శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ లు ఈ సినిమాకి కలిసి పని చెయ్యటం ఎంతో ఆనందంగా ఉంది. అద్భుతమైన స్రిప్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది." అన్నారు. 'ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', నాయిక 'రకుల్ ప్రీత్ సింగ్' ల తో పాటు భారీ తారాగణం , అత్యున్నత సాంకేతిక విలువలతో తమ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభమౌతుంది. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చక్కని ప్లానింగ్ తో జరుగుతాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్
సంగీతం: "కొలవేరి డి" ఫేం అనిరుధ్ , కెమెరా : మనోజ్ పరమహంస , ఎడిటింగ్: ఎం. ఆర్. వర్మ, ఆర్ట్ : నారాయణ రెడ్డి , ఫైట్స్: అనల్ అరసు, చీఫ్ కో డైరెక్టర్: చలసాని రామారావు, చీఫ్ ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సూర్నెడ్డి, ప్రొడక్షన్ కంట్రోలర్ : సత్యనారాయణ గుజ్జెళ్ళ,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బాబు కె.,
ప్రొడక్షన్ మేనేజర్స్ : కె. కళ్యాణ్ , రాము.

లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్
సమర్పణ : డి. పార్వతి
నిర్మాత : దానయ్య డి.వి.వి.
మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved