pizza
Sairam Shankar new film launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 June 2014
Hyderabad

సాయిరామ్‌శంకర్‌,శరత్‌కుమార్‌లతో విభా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చిత్రం ప్రారంభం.

సాయిరామ్‌ శంకర్‌హీరోగా, తమిళస్టార్‌ హీరో శరత్‌ కుమార్‌ కీలకపాత్రలో విభా ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది.సుదర్శన్‌ సలేంద్ర దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను దేపా శ్రీకాంత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.యర్రం వంశీదర్‌ రెడ్డి సమర్పకులు.ఆదివారంనాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మూహూర్తనుషాట్‌కు నటుడు,దర్శకుడు కాశీ విశ్వనాద్‌ క్లాప్‌ నివ్వగా చిత్ర నిర్మాత శ్రీకాంత్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. చిత్ర దర్శకుడు సుదర్శన్‌ దర్శకత్వం వహించారు.జులై నుంచి చిత్రీకరణ ప్రారంభించుకునే ఈ సినిమా, హీరో సాయిరామ్‌ కెరీర్‌లో క్రేజీ మూవీగా నిలుస్తుంది.శరత్‌కుమార్‌ గారు పాత్ర ఆ సినిమాకు ఓ హైలెట్‌ .మంచి స్క్రిప్ట్ తోసాటు టాలెంటెడ్‌ టెక్నిషియన్స్‌ కలయికలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు.కమర్షియల్‌ సినిమాకు ఉండాల్సిన అన్నీ క్వాలిటీస్‌తో ఈ సినిమా ఉంటుందని.హీరో సాయిరామ్‌ శంకర్‌కు ఇదో స్పెషల్‌ మూవీ అవతుందని దర్శకుడు సుదర్శన్‌ తెలియచేశారు.

ఎం.ఎస్‌ నారాయణ, పోసాని కృష్ణమురళి,కాశీవిశ్వనాద్ ,తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తోన్న ఈ సిినిమాకు కెమెరా :ఐ.మార్టిన్‌ జో , సంగీతం: మహత్‌ నారాయణ్‌ , రచనా సహకారం: సన్నీ నాగబాబు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved