pizza
Soda Golisoda movie launch
`సోడా గోలిసోడా` ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 March 2017
Hyderaba
d

మాన‌స్, కారుణ్య‌, మ‌హిమా అలేఖ్య తారాగ‌ణంగా ఎస్‌.బి.ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌రిబాబు మ‌ల్లూరి ద‌ర్శ‌క‌త్వంలో భువ‌న‌గిరి స‌త్య సింధూజ నిర్మిస్తున్న కొత్త చిత్రం `సోడా గోలిసోడా` ఆదివారం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. ముహుర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత స‌త్య సింధూజ క్లాప్ కొట్ట‌గా, స్వామిగౌడ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి స‌న్నివేశానికి శివాజీ రాజా గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొప్పుల ఈశ్వ‌ర్ లోగోను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు హ‌రిబాబు మ‌ల్లూరి మాట్లాడుతూ - ``స‌మాజంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల దృష్ట్యా ఓ మంచి మెసేజ్‌తో ఈ సోడా గోలిసోడా సినిమాను నిర్మిస్తున్నాం. వృతి రీత్యా డాక్ట‌ర్ అయిన నిర్మాత‌గారు తొలిసారి సినీ నిర్మాణం రంగంలోకి అడుగు పెట్టారు. అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ నెలాఖ‌రున సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. పాల‌కొల్లు, హైద‌రాబాద్‌లో టాకీ పార్ట్ పూర్తి చేస్తాం. అవుట్ డోర్‌లో సాంగ్స్‌ను చిత్రీక‌రిస్తాం`` అన్నారు.

నిర్మాత భువ‌న‌గిరి స‌త్య సింధూజ మాట్లాడుతూ - ``మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని నిర్మాత‌గా చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం `సోడా గోలిసోడా`. మంచి టీం కుదిరింది. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తాను`` అన్నారు.

Karunya glam gallery from the event

హీరో మాన‌స్ మాట్లాడుతూ - ``టైటిల్‌లోనే మంచి ఎన‌ర్జీ ఉంది. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. కాయ్‌రాజాకాయ్‌, ప్రేమికుడు సినిమాల త‌ర్వాత హీరోగా చేస్తున్న ఈ సినిమా మంచి విజ‌యాన్ని అందిస్తుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం`` అన్నారు.

కారుణ్య మాట్లాడుతూ - ``మంచి ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. మంచి పాత్ర చేస్తున్నాను. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

ప‌ద్మిని మాట్లాడుతూ - ``లేడీ ప్రొడ్యూస‌ర్ ఇండ‌స్ట్రీలోకి రావ‌డం మంచి ప‌రిణామం. మాన‌స్ గ‌తంలో చేసిన రెండు సినిమాల‌ను మించి హిట్ సాధిస్తాడు. మంచి ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``ప‌ద్మినిగారు మాకెంతో ఆత్మీయులు. ఆమె త‌న‌యుడు మాన‌స్ చేస్తున్న ఈ సినిమా మంచి స‌క్సెస్ కావాలి. లేడీ ప్రొడ్యూస‌ర్ సింధూజ‌గారికి అభినంద‌న‌లు`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved