pizza
SVC Entertainments Production No. 1 movie launch
ఎస్.వి.సి.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై,లి. నూతన చిత్రం ప్రారంభం

You are at idlebrain.com > News > Functions
Follow Us

19 March 2016
Hyderabad

నవీన్ విజయ కృష్ణ, నిత్యా నరేష్ జంటగా ఎస్.వి.సి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన చిత్రం శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. పి.వి.గిరి దర్శకత్వంలో బిక్షమయ్య, రాధాకిషోర్ గుబ్బల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టగా, సాయిధరమ్ తేజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శ్రీమతి విజయ నిర్మల గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘’నవీన్ హీరోగా చేస్తున్న రెండో సినిమా ఇది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథ. పి.వి.గిరి దర్శకత్వంలో బిక్షమయ్య, రాధాకిషోర్ గుబ్బల నిర్మిస్తున్న ఈ చిత్రం డెఫనెట్ గా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను‘’ అన్నారు.

శ్రీమతి విజయ నిర్మల మాట్లాడుతూ ‘’నవీన్ కు బాగా నచ్చిన సబ్జెక్ట్ కావడంతో సినిమాలో యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. ఈ సినిమాలో నిత్యా నరేష్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. దర్శక నిర్మాతలకు, యూనిట్ కు అభినందనలు‘’ అన్నారు.

నవీన్ విజయ కృష్ణ మాట్లాడుతూ దేవుడి దయ వల్ల సినిమా నా మొదటి సినిమా బాగా వచ్చింది. ఇది నా సెకండ్ మూవీ. చాలా స్క్రిప్ట్స్ విన్నాను. గిరిగారు చెప్పిన కథ చాలా ఎంటర్ టైనింగ్ ఉంది. లవ్ ప్రధానాంశంగా ఉండే చిత్రమిది. త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. మంచి ప్రొడక్షన్ టీం కుదిరింది. మంచి సినిమా రూపొందుతుందని భావిస్తున్నాను‘’ అన్నారు.

సీనియర్ నరేష్ మాట్లాడుతూ ‘’ఈ ఏడాది సినిమాలకు సంక్రాంతి అని చెప్పాలి. చిన్న, పెద్ద సినిమాలన్నీ పెద్ద హిట్స్ అవుతున్నాయి. ప్రజలు, ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. కొత్తటాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో నా తనయుడు నవీన్ గిరి అనే నూతన దర్శకుడి డైరెక్షన్ లోబిక్షమయ్య, రాధాకిషోర్  నిర్మాతలుగా సినిమా చేయడం ఆనందంగా ఉంది. చాలా ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్. హైదరాబాద్ కు చెందిన నిత్యానరేష్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. శేఖర్ చంద్ర, శివేంద్ర వంటి మంచి టెక్నికల్ టీం కుదిరింది. కథను వినగానే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశాం. అన్నీ రకాల ఎలిమెంట్స్ తో ఎంటర్ టైనింగ్ గా సాగే చిత్రమిది‘’అన్నారు.

దర్శకుడు పి.వి.గిరి మాట్లాడుతూ ‘’చాలా సినిమాలకు రచయితగా వర్క్ చేసిన నేను ఈ సినిమా కథ చెప్పగానే నిర్మాతలు నన్నే డైరెక్ట ఛేయమని అనడంతో సరేనన్నాను. దర్శకుడిగా తొలి చిత్రం. లవ్ ఎంటర్ టైనర్. ఏప్రిల్ మొదటి నుండి సినిమా ప్రారంభమవుతుంది. శేఖర్ చంద్ర, శివేంద్ర,కార్తీక శ్రీనివాస్ సహా మంచి యూనిట్ సినిమాకు వర్క్ చేస్తున్నారు‘’ అన్నారు.

చిత్రనిర్మాతల్లో ఒకరైన బిక్షమయ్య మాట్లాడుతూ ‘’డైరెక్టర్ గిరితో ఒకటిన్నర సంవత్సరం నుండి ట్రావెల్ అవుతున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది. మంచి టీం కుదిరింది. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాం‘’ అన్నారు.

జె.పి.రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్, జయప్రకాష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రెహమాన్, డైలాగ్స్: పి.వి.గిరి, ఎ.సురేష్ బాబు, ఆర్ట్: వెంకట్ సన్నిధి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, మ్యూజిక్: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బిక్షమయ్య సంగం, రాధాకిషోర్ గుబ్బల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి. 

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved